ఈ మూడు రంగాల్ని చూడొచ్చు: యుటీఐ ఎంఎఫ్
By Sakshi

ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ఇంకో రెండు, మూడు త్రైమాసికాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.కానీ నెమ్మదిగానైనా మందగమనం తగ్గుముఖం పడుతుందని యుటిఐ ఎంఎఫ్ ఈక్విటీ ఫండ్ మేనేజర్ అండ్ రీసెర్చ్ హెడ్ సచిన్ త్రివేది ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. రేట్ల కోత మంచిదే.. ఇంకో రెండు మూడు క్వార్టర్లు ఆగాలి... మూడు రంగాలు... పెట్టుబడుల ఉపసంహరణ..
ఎస్బీఐ డిపాజిట్లపై రేట్ల కోత విధించింది. ఇది స్వాగతించాల్సిన విషయం. ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఆర్బిఐ రేట్లను తగ్గిస్తుండగా, ఆ ఫలాలను వినియోగదారులకు అందించడంలో బ్యాంకులు ప్రతిభావంతంగా పనిచేయలేకపోతున్నాయి. వ్యవస్థలో చిన్న మొత్తాల పోదుపులపై ఎక్కువగా ఆధారపడుతున్న బ్యాంకులకు ఈ రేట్ల కోత ఇబ్బంది కలిగించేదే. వ్యవస్థలో బ్యాంకులు ఇచ్చే రేట్ల కంటే ఎక్కువగా వీటిపై లభించడమే దీనికి కారణం. ఇది వ్యవస్థలో ఉన్న ఒక ముఖ్యమైన సవాలు. దీనితో పాటు ఇన్వెస్టర్లు కూడా చిన్న పొదుపుల పథకాలలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తురనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ప్రస్తుతం దేశియ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. కార్పోరేట్ ఆదాయాలు కూడా అంచనాలను మించలేకపోతున్నాయి. రెండంకెల వృద్ధి కోసం ఎదురుచూస్తున్నాం. గత రెండేళ్లు గమనిస్తే కార్పోరేట్ ఆదాయ వృద్ధి 20 శాతం ఉంటుందని అంచనాలు వేశాం. కానీ అది 5 శాతం 6 శాతానికే పరిమితమయ్యింది. ఈ ఏడాది కూడా కార్పోరేట్ల ఆపరేటింగ్ లాభాలు సమస్యగానే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ కొద్దిగా బాగుంది.
అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు మందగమనంలో ఉందని గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ బాండ్ ఈల్డ్‌లు కూడా నెగిటివ్ జోన్లో ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ సంక్షోభం, ఎన్నికల వలన ప్రభుత్వ ఖర్చులు తగ్గడం కూడా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణమయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం కూడా బ్యాంకింగ్ సెక్టార్‌ను ప్రోత్సహిస్తుండడంతో ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగానైనా తిరిగి పుంజుకుంటుంది. ఇది సాకారమవ్వడానికి రెండు మూడు త్రైమాసికాలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు. కానీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.
నిఫ్టీ దీర్ఘకాలిక ఆదాయాల సగటు 15 రెట్లు కంటే ప్రస్తుతం 17.2 నుంచి 17.3 రెట్లుగా ట్రేడ్చేస్తున్నాం. అయినప్పటికి కొన్ని సెలక్టివ్ స్టాక్సును ఎంచుకోవడం మంచిది. ఆటో సెక్టార్లో అవకాశాలున్నాయి. కానీ ఈ రంగంలో వాల్యూమ్ల పెరుగుదల మందగించడం వంటి స్పష్టమైన సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. గత 20-25 ఏళ్లను గమనిస్తే ఆటో రంగం ఒక సైక్లికల్ సెక్టార్ అని తెలుస్తుంది. ఈ రంగంలోని కంపెనీల అమ్మకాల పరిమాణాలు గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. అందువలన మార్కెట్లో ఇదొక అవకాశంగా ఉంది. కానీ సెలక్టివ్ స్టాక్సును ఎన్నుకోవడం ముఖ్యం. అవకాశం ఉన్న ఇంకో రంగం ఫార్మా. దేశీయంగా ఫార్మా రంగం బాగుంది. మరొక వైపు ఈ రంగంలోని కంపెనీల ధర విషయంలో కొంత సవాళ్లను కనిపించాయి. కానీ ప్రస్తుతం ఇవి తగ్గుముఖం పడుతున్నాయి. వీటితో పాటు ఐటీ సెక్టార్‌ను పరిశీలించవచ్చు. అయితే ఇది సమీప సగటు విలువలు కంటే ఖరీదుగా ఉంది. కానీ అంతర్లీనంగా వృద్ధి ఉండడం వలన ఈ సెక్టార్ షేర్లు బాగున్నాయి.
ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై అధికంగా దృష్ఠి పెట్టింది. బడ్జెట్లో కూడా దీనికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎల్ఐసి సంస్థలో ఇది జరుగుతుందని మనకు క్లియర్‌గా అర్ధమవుతుంది. ఎల్ఐసీ మార్కెట్లో లిస్ట్‌కావడం ఖచ్చితంగా మార్కెట్‌ను ప్రభావం చేస్తుంది. అన్నిటికన్నా బడ్జెట్లో పబ్లిక్ హోల్డింగ్‌ను 35 శాతానికి పెంచడం వలన దీని ప్రభావం అధికంగా ఉండనుంది. ఇన్సురెన్స్ సెక్టార్లో ఎల్ఐసి ఒక అద్భుతమైన సంస్థ. ఈ సంస్థ ఇష్యూకి రావడం స్వాగతించవలసిన అంశం.
You may be interested
యుఎస్ సూచీ లక్ష్యాన్ని పెంచిన గోల్డ్‌మాన్‌శాక్స్
Tuesday 30th July 2019యుఎస్ బెంచ్‌మార్క్ ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 2019 టార్గెట్‌ను 3 శాతం పెంచి 3,100 పాయింట్లుగా నిర్ణయించినట్టు ప్రముఖ గోల్డ్‌మాన్ శాక్స్ మంగళవారం తెలిపింది. ఇది ఈ ఏడాది 24 శాతం లాభాలను సూచిస్తుంది. కానీ ఆర్థిక కార్యకలాపాలు, మార్జిన్ దృక్పథంలో బలహీనత వలన ఆదాయ అంచనాలను తగ్గించింది. ఈ వారం ఫెడరల్ రిజర్వ్ నుంచి ఊహించినట్టే రేటు తగ్గింపు ఉంటుందనే వార్తల నేపథ్యంలో వాల్ స్ట్రీట్ ఇంట్రాడే గరిష్ఠమైన
మార్కెట్లో పాజిటివ్ మార్పు రానుందా?
Tuesday 30th July 2019బుల్లిష్‌గా మారొచ్చని సంకేతాలిస్తున్న బాండ్‌ఈల్డ్స్ దేశీయ మార్కెట్లో కొనసాగుతున్న అమ్మకాల వెల్లువకు శుభం కార్డు పడనుందా? త్వరలో ట్రెండ్ రివర్సల్ కనిపించనుందా? సూచీలు తిరిగి బుల్‌రన్ ఆరంభించబోతున్నాయా?.. అంటే.. అవునంటున్నారు కొంతమంది టెక్నికల్ నిపుణులు. నిఫ్టీ ఎర్నింగ్స్ ఈల్డ్స్‌కు, పదేళ్ల బాండ్ ఈల్డ్స్‌కు మధ్య అంతరం కుంచించుకుపోవడం ఇందుకు నిదర్శనమంటున్నారు టెక్నికల్ నిపుణులు. ఈ విధంగా ఈ రెండింటి మధ్య తేడా తగ్గిపోవడమనేది సూచీల్లో పతనం ఇకపై కొనసాగకపోవచ్చనేందుకు సంకేతంగా భావిస్తున్నారు. ప్రస్తుతం