News


సుప్రీం తీర్పుతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ పరిస్థితి ఏంటి?

Friday 17th January 2020
Markets_main1579200403.png-30974

సుప్రీం తీర్పు ప్రభావం టెలికం రంగ కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్లపై శుక్రవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో చూపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)పై గతేడాది అక్టోబర్‌ 24న ఇచ్చిన తీర్పును తిరిగి సమీక్షించాలని కోరుతూ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా టెలీసర్వీసెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. దీని తాలూకూ ప్రకంపనలు టెలికం కంపెనీలపై తీవ్రంగానే ఉంటాయని, ముఖ్యంగా వొడాఫోన్‌ ఐడియా షేరుపైనేనని దలాల్‌ స్టీల్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

సుప్రీంకోర్టు తీర్పు కారణంగా టెలికం కంపెనీలు రూ.1.47 లక్షల కోట్లను చెల్లించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉపశమనం కల్పిస్తే తప్ప.. ఈ నెల 23 నాటికి వొడాఫోన్‌ ఐడియా రూ.53,039 కోట్లు, ఎయిర్‌టెల్‌ రూ.35,586 కోట్లను చెల్లించక తప్పదు. ఈ తీర్పుపై ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా తీవ్ర నిరాశ వ్యక్తం చేశాయి. క్యురేటివ్‌ పిటిషన్‌ను దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ తీర్పు టెలికం పరిశ్రమను సంక్షోభంలోకి నెడుతుందని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌. మాథ్యూస్‌ అభివర్ణించారు. దీనిపై టెలికం శాఖతో సంప్రదింపులు చేస్తామని, అసలు ఈ అంశంలో కోర్టు జోక్యం అవసరం లేదన్నారు. భారతీ ఎయిర్‌టెల్‌పై ఇదొక విపత్తు దెబ్బ వంటిదని ప్రభుదాస్‌ లీలాధర్‌ పీఎంఎస్‌ సీఈవో అజయ్‌ బోడ్కే అభివర్ణించారు. ‘‘ఇది బ్యాలన్స్‌ షీటును గణనీయంగా బలహీనపరుస్తుంది. వొడాఫోన్‌ ఐడియాకు అయితే అస్తిత్వ సంక్షోభమే. ఈ టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన సంస్థలపైనా ప్రభావం ఉంటుంది. వాటి ఎన్‌పీఏలు పెరిగేందుకు దారితీస్తుంది’’ అని బోడ్కే వివరించారు. ఇతర నిపుణులు సైతం ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

‘‘టెలికం కంపెనీల విషయంలో నేనేమీ ఆశ్చర్యపడలేదు. కానీ, టెలికమేతర కంపెనీల విషయమై సానుకూలతను ఆశించాను. తీర్పు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఒప్పందం కూడా స్పష్టంగానే ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ కాస్త మెరుగైన పరిస్థితిలో ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌, జియో మాత్రమే ఉండే డ్యుయోపోలీ పరిస్థితి రానుంది. వొడాఫోన్‌ ఐడియా భవిష్యత్తు ప్రస్తుతానికి అనిశ్చితితో ఉంది. కొత్త ఇన్వెస్టర్‌ను అవి గుర్తించే వరకు ఇంతే. పోటీ పడేందుకు అదనపు నిధులు అవసరం. కానీ, అది కష్టమైన విషయమే’’ అని కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవేన్‌ చోక్సే అన్నారు. వొడాఫోన్‌ ఐడియాకు సుప్రీంకోర్టు తీర్పు పెద్ద ఎదురుదెబ్బగా ఫిచ్‌ రేటింగ్స్‌ కార్పొరేట్స్‌ డైరెక్టర్‌ నితిన్‌ సోని అభివర్ణించారు. పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తే టెలికం పరిశ్రమ నుంచి తప్పకుంటామన్న చైర్మన్‌ వ్యాఖ్యల్ని (కుమార మంగళం బిర్లా) ఆయన గుర్తు చేశారు. ‘‘భారతీ ఎయిర్‌టెల్‌కు కూడా ప్రతికూల వార్తే. కానీ, కంపెనీ నిధులను సమీకరించింది. 2 బిలియన్‌ డాలర్లను ఈక్విటీ రూపంలో, కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ రూపంలో మరో బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. వొడాఫోన్‌ ఐడియా బకాయిలను చెల్లించలేకపోతే పరిశ్రమ నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు 30 కోట్ల మంది చందాదారుల రూపంలో జియో, భారతీ లబ్ధి పొందుతాయి. ఆ విధంగా చూస్తే భారతీ ఎయిర్‌టెల్‌కు పెద్ద సానుకూలం’’ అని సోని వివరించారు.You may be interested

టెల్కోల ఎఫెక్ట్‌...వీక్‌ ఓపెనింగ్‌?

Friday 17th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 21 పాయింట్లు మైనస్‌ సుప్రీం కోర్టు టెలికాం కంపెనీల ఏజీఆర్‌ చెల్లింపులపై పిటీషన్‌ కొట్టివేయడంతో ఆ షేర్లతో పాటు, ఆయా కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడనున్న నేపథ్యంలో  నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలం(నెగిటివ్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 21 పాయింట్లు క్షీణించి 12,349 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,370 పాయింట్ల

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌.. ఏం కొన్నదో చూద్దాం..

Friday 17th January 2020

నిర్వహణ ఆస్తుల పరంగా హెచ్‌డీఎఫ్‌సీ అస్సె్‌ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ/మ్యూచువల్‌ ఫండ్‌). ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తర్వాత ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ దేశంలో మూడో అతిపెద్ద సంస్థ. 2019 డిసెంబర్‌ నాటికి రూ.3.6 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. అయితే, ఇందులో రూ.1.91 లక్షల కోట్లు ఈక్విటీ ఆస్తులే కావడం గమనార్హం. ఈక్విటీ ఆస్తుల పరంగా అతిపెద్ద ఏఎంసీ ఇదే. ఈ సంస్థ గతేడాది నవంబర్‌లో యస్‌ బ్యాంకు షేర్లను

Most from this category