News


ఎస్‌బీఐ లైఫ్‌లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌

Thursday 12th September 2019
Markets_main1568257749.png-28313

  • ఫ్లోర్‌ ధర రూ.770
  • ఈ నెల 13న రిటైల్‌ ఇన్వెస్టర్లకు 

ముంబై: ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4.5 శాతం వాటాను ఎస్‌బీఐ విక్రయించనున్నది. కనీస పబ్లిక్‌ హోల్డింగ్‌ నిబంధనలను పాటించడం కోసం ఈ వాటాను విక్రయించడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 3.5 శాతం వాటా(3.5 కోట్ల ఈక్విటీ షేర్ల)ను ఆఫర్‌-ఫర్‌-సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనున్నామని పేర్కొంది. అదనంగా సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తే, మరో 1 శాతం వాటాను కూడా విక్రయిస్తామని తెలిపింది. ఈ ఓఎఫ్‌ఎస్‌కు రూ.770 ధరను(బుధవారం ముగింపు ధర, రూ.800తో పోల్చితే ఇది 4 శాతం తక్కువ) ఫ్లోర్‌ ధరగా నిర్ణయించామని తెలిపింది. వాటా విక్రయం సంస్థాగత ఇన్వెస్టర్లకు ఈ నెల 12న, రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈ నెల 13న ఉంటుందని పేర్కొంది. ఈ వాటా విక్రయం అనంతరం ఎస్‌బీఐ లైఫ్‌లో ఎస్‌బీఐ వాటా 62.1 శాతం నంఉచి 57.6 శాతానికి తగ్గుతుంది. 



You may be interested

22 కోట్ల షేర్లను విక్రయించిన ప్రమోటర్‌ సంస్థలు

Thursday 12th September 2019

విప్రో షేర్ల బైబ్యాక్‌లో  న్యూఢిల్లీ: విప్రో షేర్ల బైబ్యాక్‌లో అజిమ్‌ ప్రేమ్‌జీ, ఇతర ప్రమోటర్‌ సంస్థలు 22.46 కోట్ల షేర్లను కంపెనీకి అమ్మేశాయి. వీటి విలువ రూ.7,300 కోట్ల మేర ఉంటుందని అంచనా. గత నెలలో ముగిసిన షేర్ల బైబ్యాక్‌లో భాగంగా మొత్తం 32.3 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌  చేశామని విప్రో కంపెనీ వెల్లడించింది. ఒక్కో షేర్‌ను రూ.325కు కొనుగోలు చేశామని, మొత్తం రూ.10,500 కోట్లు షేర్ల బైబ్యాక్‌ కోసం

డెడ్‌లైన్‌కు ముందే బీఎస్‌-6 ఇంధనం

Thursday 12th September 2019

డెడ్‌లైన్‌కు ముందే అందుబాటులోకి కసరత్తు చేస్తున్న  చమురు కంపెనీలు ప్రమాణాల అప్‌గ్రేడ్‌కు రూ.30,000 కోట్ల వ్యయం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌ స్టేజ్‌–6 (బీఎస్‌) ప్రమాణాలు దేశంలో 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా బీఎస్‌–6 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న ఆందోళన వాహన తయారీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఈ విషయంలో ధీమాగా ఉన్నాయి. డెడ్‌లైన్‌ లోగానే

Most from this category