News


ఎస్‌బీఐ ఓకే- బీమా షేర్లు వ్యయభరితం?!

Wednesday 29th January 2020
Markets_main1580282760.png-31305

ప్రస్తుతానికి ఎయిర్‌లైన్స్‌ షేర్లను విస్మరించవచ్చు
ఎయిర్‌ ఇండియా కొనుగోలుకి ప్రాధాన్యం
ఎన్‌బీఎఫ్‌సీలలో మణప్పురం ఫలితాలు గుడ్‌
- దీపక్‌ షినాయ్‌, కేపిటల్‌ మైండ్‌ వ్యవస్థాపకులు

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ షేరుని తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చునంటున్నారు కేపిటల్‌ మైండ్‌ వ్యవస్థాపకులు దీపక్‌ షినాయ్‌. బ్యాంకింగ్‌, ఐటీ రంగాల ఫలితాలు, ర్యాలీ చేస్తున్న బీమా రంగ కౌంటర్లు తదితర పలు అంశాలపై ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు చూద్దాం.. 

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తదితర ఎన్‌బీఎఫ్‌సీల కారణంగా ఎస్‌బీఐ పనితీరుపై కొంత ప్రభావం పడనుంది. ఈ కంపెనీలకుతోడు గత ‍క్వార్టర్‌లో కొన్ని కార్పొరేట్‌ స్లిప్పేజెస్‌ నమోదయ్యాయి. మొండిబకాయిల సవాళ్లను అధిగమించినట్లేనంటూ గత కొన్ని నెలలుగా ఎస్‌బీఐ చెబుతూ వస్తోంది. అయితే ఎన్‌పీఏ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ అంశంలో బ్యాంక్‌ పేర్కొన్నట్లు పరిస్థితులు మెరుగుపడితే.. ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టింగ్‌ ద్వారా కూడా బ్యాంక్‌ భారీగా నిధుల సమీకరణ చేపట్టగలుగుతుంది. దీంతో మూలధన పెట్టుబడులు ఒక్కసారిగా బలపడే అవకాశముంది. ఇవన్నీ బిజినెస్‌లో భాగంకాగా.. విలీనాలు, కన్సాలిడేషన్‌ బాటలో ఉన్న ఇతర పీఎస్‌యూ బ్యాంకులతో పోలిస్తే.. ఎస్‌బీఐ మరింత లబ్డి పొందనుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఖరీదుగా ఉన్నప్పటికీ షేరు తగ్గినప్పుడు(కరెక్షన్‌) కొనుగోలు చేయవచ్చు.

విమానయానం ఎటు?
ప్రధానంగా ముడిచమురు ధరలు విమానయాన కంపెనీలపై ప్రభావం చూపుతుంటాయి. చమురు ధరలు పెరిగినప్పుడల్లా కంపెనీలు నష్టాల్లోకి ప్రవేశిస్తుంటాయి. ఇటీవల చమురు ధరలు సగటున స్థిరత్వాన్నే ప్రదర్శించాయి. ఇవి ఎయిర్‌లైన్స్‌ కంపెనీల ఫలితాలకు దన్నునిచ్చినప్పటికీ ఇటీవల ఇంజిన్లు విఫలంకావడం, ప్రమోటర్ల వివాదాలు వంటి అంశాలు సమస్యలకు తావిచ్చాయి. ఇండిగో, స్పైస్‌జెట్‌ మెరుగైన ఫలితాలనే ప్రకటించాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌ ఇండియా విక్రయం పూర్తయితే పరిశ్రమలో ధరలు, మార్కెట్‌ వాటా, పోటీ వంటి మార్పులు కనిపించవచ్చు.

క్యూ3 భేష్‌
క్యూ3లో బ్యాంకింగ్‌ విభాగంలో ఐసీఐసీఐ చెప్పుకోదగ్గ పనితీరును చూపింది. ఎన్‌బీఎఫ్‌సీలలో మణప్పురంతోపాటు మరికొన్ని కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి. హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగంలో కేన్‌ ఫిన్‌ భేషైన పనితీరు చూపినప్పటికీ ఇకపై వృద్ధి మందగించవచ్చు. రుణ మార్కెట్లలో నెలకొన్న సమస్యల నుంచి నిలదొక్కుకునే కంపెనీలవైపు దృష్టిపెట్టడం మేలు. ఐటీ కంపెనీల ఫలితాలు ఓకే. ఎఫ్‌ఎంసీజీతో పోలిస్తే వేల్యుయేషన్స్‌ తక్కువగానే ఉన్నాయి. నగదు నిల్వల అండ, పటిష్ట బ్యాలన్స్‌షీట్‌ కలిగిన ఐటీ కంపెనీలలో రక్షణాత్మక పెట్టుబడి దృష్టితో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. 

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలలో ఇప్పటికే ర్యాలీ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, నిప్పన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఇకపైన కూడా రిటర్నులు అందించే వీలున్నప్పటికీ ఇవి ప్రస్తుతం వ్యయభరితంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసినవారు కొనసాగవచ్చు. కొత్త పెట్టుబడులకు దిగాలంటే బాగా తరచి చూడవలసిందే. బీమా రంగ కంపెనీలైతే మరింత ఖరీదుగా కనిపిస్తున్నాయి. వెరసి ఈ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే! ప్రస్తుతం ఐసీఐసీఐ లంబార్డ్‌తోపాటు కొన్ని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు కౌంటర్లు ఆసక్తిని రేపుతున్నాయి.You may be interested

బడ్జెట్‌ ఎఫెక్ట్‌- రైల్వే షేర్లు స్పీడ్‌

Wednesday 29th January 2020

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌, ఐఆర్‌సీటీసీ హైజంప్‌ రైట్స్‌, హింద్‌ రెక్టిఫయర్స్‌, టెక్స్‌మాకో జూమ్‌ మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వే రంగ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసినప్పటికీ ఈసారి రైల్వేలకు కేటాయింపులు పెరగనున్న అంచనాలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా తదితరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తాజాగా రైల్‌

ఐటీఐ ఎఫ్‌పీఓ ఇష్యూ గడువు పొడగింపు

Wednesday 29th January 2020

ప్రభుత్వరంగ ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌(ఐటీఐ) కంపెనీ ఎఫ్‌పీఓ(ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఇష్యూను మరో 3రోజుల పాటు పొడిగించారు. జనవరి 24న మొదలైన ఇష్యూ ఇదే నెల 28న ముగియాల్సి ఉంది. ఇష్యూకు ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ముగింపు తేది జనవరి 31 వరకు పొడిగించారు.  అలాగే ప్రైజ్‌ బాండ్‌ ధరను సైతం తగ్గించారు. అలాగే రూ.72–77 ఉన్న ప్రైస్‌బాండ్‌ను రూ.71-77గా కుదించారు. జవవరి 28 తేదిన ఎఫ్‌పీఓ

Most from this category