News


అనూహ్య అమ్మకాలు: ఎస్‌బీఐ 9.50శాతం పతనం

Thursday 24th October 2019
Markets_main1571904139.png-29109

లాభాల్లో నుంచి నష్టాల్లోకి మళ్లిన మార్కెట్‌లో ఎస్‌బీఐ షేర్లు మిడ్‌సెషన్‌ సమయంలో ఒక్కసారిగా భారీ పతనాన్ని చవిచూశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంక్‌ షేర్లు రూ.277.00 వద్ద ట్రేడింగ్‌ వద్ద ప్రారంభించాయి. మిడ్‌సెషన్‌లో ఈ షేర్లలో ఒక్కసారిగా అమ్మకాల తీవ్ర మొదలైంది. మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో కేవలం 10 నిముషాల్లో ఎస్‌బీఐ దాదాపు 9.50శాతం క్షీణించి రూ.248.80 వద్ద ఇంట్రాడే కనిష్టానికి తాకింది. అనంతరం క్షణాల్లో రూ. 266 సమీపానికి రికవరీ అయ్యింది. మధ్యాహ్నం గం.1:30.నిలకు షేరు క్రితం ముగింపు(రూ.275.50)తో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.262 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ఎస్‌బీఐ ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.244.35, రూ.373.70లుగా నమోదయ్యాయి. You may be interested

ఎల్‌అండ్‌టీ ...బ్రోకరేజ్‌లు పాజిటివ్‌

Thursday 24th October 2019

రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అధిగమించడంతో ఎల్‌అండ్‌టీ షేర్లు గురువారం బీఎస్‌ఈల ట్రేడింగ్‌లో 2.50శాతం పెరిగి రూ.1466.00 స్థాయిని తాకాయి. ఆశాజనక ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఎల్‌ అండ్‌ టీ షేర్లపై పలు బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేర్లకు టార్గెట్‌ ధరను పెంచాయి. మధ్యాహ్నం గం.1:20లకు షేరు క్రితం​ముగింపు(రూ.1430.95)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.1430.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నోమురా బ్రోకరేజ్‌  రేటింగ్‌:- కొనవచ్చు టార్గెట్‌ ధర:- రూ.1,725

లాభాల్లో నుంచి నష్టాల్లోకి మార్కెట్‌

Thursday 24th October 2019

లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ మిడ్‌సెషన్‌ కల్లా నష్టాల్లోకి మళ్లింది. మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే మహారాష్ట్రలో భాజపా గెలుపు దాదాపు ఖాయమైంది. అయితే హరియాణా ఫలితాలు మాత్రం హంగ్‌ దిశగా కదులుతున్నాయి. హరియాణ సీఎం పీఠాన్ని చిన్న పార్టీ జేజేపీకి సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్‌ ఆఫర్‌ చేసింది. ఈ అనిశ్చితి సమయంలో స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా

Most from this category