News


ఎస్‌బీఐ కొత్త రికార్డు

Thursday 4th July 2019
Markets_main1562219450.png-26781

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) షేర్లు గురువారం కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లు రూ.367.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ భాగంగా ఎస్‌బీఐ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో ఎస్‌బీఐ షేర్లు 1.29శాతం పెరిగి రూ.370.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఇది షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.10:45ని.లకు షేరు గతముగింపు(రూ.366.15)తో పోలిస్తే రూ.370.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.247.40 రూ.370.90లుగానమోదయ్యాయి.



You may be interested

ఆర్థిక సర్వే.... 7% జీడీపీ వృద్ధి!

Thursday 4th July 2019

ఎకనమిక్‌ సర్వే అంచనా బడ్జెట్‌కు ముందస్తు పీఠికగా పేర్కొనే ఎకనమిక్‌ సర్వేను ప్రభుత్వం నేడు పార్లమెంట్‌ ముందుంచింది. రాబోయే రోజుల్లో ఎకానమీలో పాజిటివ్‌ సంకేతాలు కనిపిస్తాయని సర్వే అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం ఉంటుందని అంచనా వేసింది. పెట్టుబడుల రేటులో తిరోగమనం పూర్తయిన సంకేతాలున్నాయని తెలిపింది. తీరైన ఎంపీసీ కారణంగా వడ్డీరేట్లు దిగివస్తున్నాయని పేర్కొంది. జనవరి- మార్చిలో ఎన్నికల కారణంగా ఎకానమీలో స్తబ్దత నమోదయిందని తెలిపింది. ఈ

రాణిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Thursday 4th July 2019

మార్కెట్‌ స్థిరమైన ర్యాలీలో భాగంగా గురువారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 2శాతం వరకు లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 3,269.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో అస్తవ్యస్తమైన ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు పునురుద్ధరణకు రిక్యాపులైజేషన్ ప్రకటించే అవకాశం ఉందనే అంచనాలతో ఈ రంగ షేర్లకు నేడు డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా

Most from this category