News


తిరిగి రికార్డుస్థాయికి ఎస్‌బీఐ

Wednesday 17th July 2019
Markets_main1563357793.png-27130

ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ షేర్లు మంగళవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో తిరిగి జీవితకాల గరిష్టానికి చేరాయి. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.364.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న మద్దతులో భాగంగా ఈ షేర్లు నేటి ట్రేడింగ్‌లో 2.50 లాభపడి రూ.373.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఇది జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. కొద్దిరోజుల క్రితం  ఇదేస్థాయికి చేరిన తర్వాత స్వల్ప కరెక‌్షన్‌కు లోనైన ఎస్‌బీఐ తిరిగి తాజాగా ఈ స్థాయిని అందుకుంది. మధ్యాహ్నం గం.3:15ని.లకు షేరు గతముగింపు(రూ.364.25)తో పోలిస్తే 2.36శాతం లాభంతో రూ.372.85ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరుసగా రూ. 363.20 రూ.373.50లుగా నమోదయ్యాయి. మరోప్రధాన ఇండెక్స్‌ ఎన్‌ఎస్‌ఈలో జీవితకాల గరిష్టస్థాయి(రూ.373)ని అధిగమించేందుకు మరో 5పైసల దూరంలో ఉంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 247.65 రూ.373.50లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఆర్‌బీఐ నిధుల బదిలీకి పచ్చజండా?!

Wednesday 17th July 2019

పూర్తయిన జలాన్‌ ప్యానెల్‌ నివేదిక ఆర్‌బీఐ మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేయమని జలాన్‌ కమిటీ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిమల్‌జలాన్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ నిధుల బదిలీపై చర్చించి బుధవారం తన తుది నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. మిగులు నిధులను 3-5 సంవత్సరాల కాలపరిమితిలో విడతలవారీగా కేంద్రానిక అందించాలని కమిటీ సిఫార్సు చేసిందని సదరు వర్గాలు తెలిపాయి. అయితే ఎంత మొత్తం బదిలీ

డీసీబీ బ్యాంక్‌ షేర్లకు క్యూ1 ఫలితాల షాక్‌

Wednesday 17th July 2019

18శాతం క్షీణించిన షేరు ధర ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికపు ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో డీసీబీ బ్యాంకు షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో భారీ స్థాయిలో క్షీణించాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.222.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రుణ వృద్ధి భారీ క్షీణించటంతో పాటు తాజాగా స్లిపేజ్‌ పెరగడం, ఎన్‌పీఏలు పెరగడం తదితర కారణలతో బ్యాంకు ఆశించిన ఫలితాలను నమోదు చేయలేకపోయింది. ‘‘తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ.81.1

Most from this category