News


స్టేట్‌బ్యాంక్‌ నికర లాభం రూ. 5583 కోట్లు

Friday 31st January 2020
Markets_main1580460693.png-31373

స్టాండెలోన్‌ ప్రాతిపదికన 41 శాతం అప్‌
2.6 శాతం పుంజుకున్న ఎస్‌బీఐ షేరు 

దేశీ బ్యాంకింగ్‌  రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ. 5,583 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 41 శాతం వృద్ధికాగా.. ఎస్సార్‌ స్టీల్‌, ఎన్‌ఐఐ తదితర మొండి ఖాతాల నుంచి రికవరీలు లాభాల్లో వృద్ధికి సహకరించినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం రూ. 6532 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 22 శాతంపైగా పెరిగి రూ. 27,779 కోట్లకు చేరగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 8.71 శాతం నుంచి 6.94 శాతానికి బలహీనపడ్డాయి. ఇక నికర ఎన్‌పీఏలు సైతం 3.95 శాతం నుంచి 2.65 శాతానికి నీరసించాయి. కాగా.. క్యూ3లో పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ ప్రొవిజన్లు రూ. 6006 కోట్ల నుంచి రూ. 7253 కోట్లకు ఎగశాయి. అయితే క్యూ2లో నమోదైన రూ. 13,139 కోట్లతో పోలిస్తే ప్రొవిజన్లు తగ్గాయి.  

షేరు ప్లస్‌లో
మధ్యాహ్నం 2.15 ప్రాంతంలో స్టేట్‌బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.6 శాతం లాభపడి రూ. 319 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 314 సమీపంలో ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. కాగా.. క్యూ3లో నికర వడ్డీ మార్జిన్లు 0.62 శాతం బలపడి 3.59 శాతానికి చేరాయి. నిర్వహణ లాభం 44 శాతం ఎగసి రూ. 18,223 కోట్లను తాకింది. స్లిప్పేజెస్‌ 265 శాతం పెరిగి రూ. 16,525 కోట్లకు చేరాయి. ఒక అతిపెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఎక్స్‌పోజర్‌ నుంచి రూ. 7000 కోట్లమేర స్లిప్పేజెస్‌లో కలసి ఉన్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది.  రిటైల్‌ రుణాలు 17 శాతంపైగా వృద్ధిచూపగా.. కార్పొరేట్‌ రుణాలు 0.5 శాతం నీరసించినట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. 



You may be interested

డాబర్‌ భళా- బీఈఎల్‌, జేకే టైర్‌ బోర్లా

Friday 31st January 2020

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ డాబర్‌ ఇండియా లాభాల్లో బోర్లాపడిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ నష్టాలలో జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఆర్థిక సర్వే, బడ్జెట్‌ నేపథ్యంలో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి  హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఓవైపు ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం డాబర్‌ ఇండియా కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. అయితే మరోవైపు

రికార్డుస్థాయికి ఐఆర్‌సీటీసీ

Friday 31st January 2020

కేంద్ర ప్రభుత్వం రేపు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రేల్వే రంగంలో సేవలను అందించే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) శుక్రవారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో 3.65శాతం లాభపడి రూ.1177.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.1:30నిల.లకు షేరు క్రితం

Most from this category