STOCKS

News


ఎస్‌బీఐ క్యూ3 లాభం హైజంప్‌?

Friday 31st January 2020
Markets_main1580446338.png-31364

నికర లాభం రూ. 5577 కోట్లు!
నికర వడ్డీ ఆదాయం 19 శాతం అప్‌?
బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు

దేశీ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించనున్నట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. నేడు ఎస్‌బీఐ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) పనితీరును వెల్లడించనుంది. ఈ ఏడాది క్యూ3లో పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ నికర లాభం 80 శాతం జంప్‌చేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఎస్సార్‌ స్టీల్‌ రుణ పరిష్కారం(రిజల్యూషన్‌), తగ్గనున్న ప్రొవిజన్లు సహకరించే వీలున్నట్లు పేర్కొన్నారు. ఇక నికర వడ్డీ ఆదాయం 9-12 శాతం మధ్య పుంజుకోవచ్చని భావిస్తున్నారు. ఈ బాటలో 6-10 శాతం మధ్య రుణ వృద్ధి నమోదుకావచ్చని, నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా మెరుగుపడవచ్చని విశ్లేషించారు.

వొలటైల్‌గా
ఎస్సార్‌, జేపీ పవర్‌, రుచీ సోయా, రతన్‌ ఇండియా పవర్‌ తదితర మొండి రుణాల(ఎన్‌పీఎల్‌) నుంచి రికవరీ వివిధ విధాలుగా నమోదయ్యే వీలున్నట్లు కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. దీంతో ఎస్‌బీఐ విభిన్న పనితీరు చూపవచ్చని అంచనా వేసింది. నికర లాభం 96 శాతం, నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 19 శాతం చొప్పున జంప్‌చేయగలదని అభిప్రాయపడింది. రూ. 5,577 కోట్ల నికర లాభం ఆర్జించవచ్చని ఊహిస్తోంది. ఇదే విధంగా ఎన్‌ఐఐ రూ. 27,000 కోట్లకు చేరవచ్చని చెబుతోంది. అయితే రుణ వృద్ధి 6 శాతమే బలపడవచ్చని, నికర వడ్డీ మార్జిన్లు త్రైమాసిక ప్రాతిపదికన యథాతథంగా 2.9 శాతంగా నమోదుకావచ్చని తెలియజేసింది. ఎడిల్‌వీజ్‌ సైతం ఎస్సార్‌ స్టీల్‌ రైట్‌బ్యాక్‌ కారణంగా క్యూ3లో ఎస్‌బీఐ నికర లాభం బలపడనున్నట్లు భావిస్తోంది. కాగా.. క్యూ3లో ఎస్‌బీఐ స్లిప్పేజెస్‌ 3.1 శాతం స్థాయిలో నమోదుకావచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల ఎక్స్‌పోజర్‌ కారణంగా స్లిప్పేజెస్‌ రూ. 18,000 కోట్లవరకూ నమోదయ్యే వీలున్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 0.5 శాతం నీరసించవచ్చని మోతీలాల్‌ పేర్కొంది. అయితే అగ్రి, ఎన్‌బీఎఫ్‌సీ పోర్ట్‌ఫోలియోలో స్లిప్పేజెస్‌ పెరిగే వీలున్నట్లు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ తెలియజేసింది. 



You may be interested

లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లోకి అమెజాన్‌!

Friday 31st January 2020

గురువారం అద్భుత ఫలితాలు ప్రకటించడంతో ఆన్‌లైన్‌ ఈకామ్‌ దిగ్గజం అమెజాన్‌ షేరు ట్రేడింగ్‌ ఆఫ్టర్‌ అవర్స్‌లో దాదాపు 10 శాతం లాభంతో కదలాడుతోంది. దీంతో శుక్రవారం ఆరంభంలో షేరు 2050 డాలర్ల పైన ఆరంభమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈలెక్కన కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ లక్ష కోట్ల డాలర్లను చేరనుంది. గురువారం క్లోజింగ్‌ రేటు ప్రకారం కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ సుమారు 93000 కోట్ల డాలర్లుంది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ సాధిస్తే

స్వల్పంగా తగ్గిన పసిడి

Friday 31st January 2020

రూ.40,500 పైన పసిడి కరోనా వైరస్‌ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయ షేర్‌ మార్కెట్‌లు పతనమవుతున్న సంగతి తెలిసిందే.  అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ వేగంగా విస్తరించడం, మరణాల సంఖ్య పెరుగుతుండడంతో గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. అంతేకాకుండా చైనా సమర్థవంతంగా వైరస్‌ను కట్టడి చేస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ గురువారం రాత్రి విశ్వాసం వ్యక్తం చేయడంతో...బంగారం

Most from this category