News


క్యూ1 ఫలితాలు: అంచనాల్ని అందుకోని ఎస్‌బీఐ

Friday 2nd August 2019
Markets_main1564734867.png-27501

దేశియ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా , ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్యూ1 ఫలితాలలో మార్కెట్ల అంచనాలను అందుకోలేకపోయింది. నికర లాభం రూ.4,000 కోట్లను ప్రకటిస్తుందని అంచనా వేయగా అది రూ.2,312 కోట్లకు పరిమితమయ్యింది. స్థూల నిరార్థక ఆస్తులు(ఎన్‌పీఏ) త్రైమాసిక ప్రాతిపదికన ఎటువంటి మార్పు లేకుండా 7.53 శాతంగానే ఉన్నాయి. కానీ నికర ఎన్‌పీఏలు మాత్రం ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 3.01 శాతం ఉండగా జూన్‌ త్రైమాసికంలో 3.07 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) కూడా మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఎస్‌బీఐ ఎన్‌ఐఐ జూన్‌ త్రైమాసికంలో రూ.23,372 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేయగా, అది రూ. 22,938 కోట్లకు పరిమితమయ్యింది. మధ్యాహ్నం 1.50 సమయానికి ఎస్‌బీఐ షేరు విలువ 0.6 శాతం పెరిగి రూ.319.45 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

సెన్సెక్స్‌ 634 పాయింట్ల రికవరి

Friday 2nd August 2019

నష్టాలతో ప్రారంభమైన మార్కె్‌ట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లో మళ్లింది. ఇటీవల మార్కెట్లో భారీ పతనంతో కనిష్టస్థాయిలకు పతనమైన షేర్లు చౌక ధరలకు లభిస్తుండంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పూనుకున్నారు. పలితంగా సూచీలు ఉదయం నష్టాలను పూడ్చుకొని లాభాల్లోకి మళ్లాయి. అటో, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో నిఫ్టీ ఇంట్రాడే కనిష్టం(10,848.95) నుంచి 192 పాయింట్ల రికవరినీ, సెన్సెక్స్‌ కనిష్టస్థాయి(36,607.41) నుంచి 634 పాయింట్ల రికవరిని సాధించాయి. మరోవైపు

సెన్సెక్స్‌ టార్గెట్‌ 39,500..తగ్గించిన సిటీ గ్రూప్‌

Friday 2nd August 2019

మార్కెట్లు వరుస సెషన్లలో భారీ పతనాలకు గురవుతున్న నేపథ్యంలో సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ తన మార్చి 2020 సెన్సెక్స్ టార్గెట్‌ను 41,000 స్థాయి నుంచి 39,500 కు తగ్గించింది. కార్పొరేట్ ఆదాయ వృద్ధి అంచనాలను డౌన్‌గ్రేడ్‌ చేయడానికి ఇది కారణమైంది. మార్కెట్ క్షీణత ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ బ్రోకరేజ్ సంస్థ కూడా సెన్సెక్స్ టార్గెట్‌ను తగ్గించలేదు. కాగా ఈ ఏడాది బడ్జెట్ (జూలై 5) లో

Most from this category