News


పీఎస్‌యూ బ్యాంక్స్‌లో ఎస్‌బీఐ భేష్‌

Saturday 28th December 2019
Markets_main1577512111.png-30493

ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరిన్ని సవాళ్లు
లార్జ్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్స్‌ మధ్య గ్యాప్‌ తగ్గొచ్చు
సిద్ధార్ధ్‌ సెడానీ అంచనా
ఆనంద్‌ రాఠీ ఈక్విటీ& పోర్ట్‌ఫోలియో అడ్వయిజరీ హెడ్‌

కొన్నేళ్లుగా మొండిబకాయిల సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇకపైనా మరిన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు ఆనంద్‌ రాఠీ ఈక్విటీ& పోర్ట్‌ఫోలియో అడ్వయిజరీ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్ధ్‌ సెడానీ. విద్యుదుత్పత్తి కంపెనీలపట్ల ఆశావహంగా లేమంటూనే ప్రసారం, పంపిణీ విభాగంలోని కంపెనీలపట్ల చూపు సారించవచ్చునంటున్నారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కెట్లు, స్టాక్స్‌ పట్ల పలు అంచనాలు ప్రకటించారు. వివరాలు చూద్దాం..

ప్రొవిజనింగ్‌ పెరగవచ్చు
పీఎస్‌యూ బ్యాంకింగ్‌ రంగంలో మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) తగ్గుతున్నప్పటికీ ప్రొవిజనింగ్‌ పెరుగుతోంది. ఇకపైనా ప్రభుత్వ రంగ బ్యాంకులు పలు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పటికే దేశీయంగా పలు రంగాలు భారీ నష్టాలతో కుదేలయ్యాయి. దీంతో మరింత ప్రొవిజనింగ్‌ చేపట్టవలసిన పరిస్థితులు ఎదురుకావచ్చు. ఈ విభాగంలో స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) మాత్రమే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఎస్‌బీఐ లాభదాయకత మెరుగుపడనుంది. స్లిప్పేజెస్‌ తగ్గుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్‌ విభాగంలో ఎస్‌బీఐలో మాత్రమే పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నాం.

కేఈసీ.. ఓకే
విద్యుదుత్పత్తి రంగంపట్ల ఆసక్తి లేదు. ఈ కంపెనీల పనితీరు మెరుగుపడేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఇందువల్ల ఈ విభాగంపట్ల దృష్టిసారించలేదు. అయితే విద్యుత్‌ ప్రసారం, పంపిణీ విభాగంలో కార్యకలాపాలు కలిగిన కేఈసీ ఇంటర్నేషనల్‌ స్టాక్‌ను పరిశీలించవచ్చు. ఈ విభాగంలోని కంపెనీలు మెరుగైన రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌వోఈ)ని సాధించే వీలుంది.

ఈ మిడ్‌ క్యాప్స్‌ గుడ్‌
ఇటీవల లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్స్‌ మధ్య అంతరం(గ్యాప్‌) తగ్గుతోంది. రానున్న ఏడాది కాలంలో మరింత సర్దుబాటు జరిగే అవకాశముంది. మిడ్‌ క్యాప్స్‌లో​ ఆధునిక వినియోగ రంగ కంపెనీ డిక్సన్‌ టెక్నాలజీ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. లెడ్‌ బల్బులు, టీవీలతోపాటు.. మొబైల్‌ ఫోన్ల కాంట్రాక్ట్‌ తయారీ ఈ కంపెనీకి 50 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఈ బాటలో ఏసీల తయారీ కంపెనీ బ్లూస్టార్‌ను పరిగణించవచ్చు. వినియోగ విభాగంలోని ఈ కంపెనీ ప్రాజెక్ట్‌ బిజినెస్‌నూ కలిగి ఉంది. ఇక స్పెషాలిటీ కెమికల్స్‌ రంగంలో దీపక్‌ నైట్రైట్‌ ఆకట్టుకుంటోంది. దహేజ్‌లో ఏర్పాటు చేసిన కొత్త ప్లాంటు సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోంది. మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. ఎసిటోన్‌ డెరివేటివ్‌ తయారీ కోసం మరో రూ. 400 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. You may be interested

4రోజుల్లోనే రూ.1110 పెరిగిన పసిడి

Saturday 28th December 2019

దేశీయ పసిడి ఫ్యూచర్లకు ఈ వారం బాగా కలిసొచ్చింది. కేవలం 4 ట్రేడింగ్‌ సెషన్‌ల్లోనే ఏకంగా రూ.1100లు లాభపడింది. దేశీయం ఎంసీఎక్స్‌లో  ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ఫ్యూచర్స్‌ ధర సోమవారం రూ.38,040 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ వారంలో అంతర్జాతీయ పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడటం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయితో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ కదలాడటం తదితర అంశాలు

పీఎంసీ బ్యాంక్‌ స్కాంపై 32 వేల పేజీల చార్జిషీట్‌

Saturday 28th December 2019

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ స్కాంకు సంబంధించి ఐదుగురు నిందితులపై 32 వేల పేజీల చార్జిషీట్‌ను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ఈ చార్జిషీట్‌లో ఆ బ్యాంకు మాజీ ఎండీ జాయ్‌ థామస్‌, మాజీ చైర్మన్‌ వర్యమ్‌ సింగ్‌, మాజీ డైరక్టర్‌ సుర్జిత్‌ సింగ్‌ ఆరోరాతో పాటు, హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌)

Most from this category