STOCKS

News


ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ కొన్న షేర్లివే

Tuesday 15th October 2019
Markets_main1571163448.png-28905

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) అన్నింటిలోనూ నిర్వహణ ఆస్తుల విలువ పరంగా ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ మూడో స్థానంలో ఉంది. ఈక్విటీల్లో అధిక ఆస్తులు కలిగి ఉన్నది మాత్రం ఎస్‌బీఐ. సెప్టెంబర్‌ మాసంలో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ విద్యుత్‌, ఇంధన, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసింది. అలాగే, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగంలో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, చోలమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌, సిటీ యూనియన్‌ బ్యాంకు షేర్లను సైతం కొనుగోలు చేసింది. యాక్సిస్‌ బ్యాంకులో 2 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. కొన్ని రకాల షేర్లను తగ్గించుకోవడం, పూర్తిగా వైదొలగడం చేసింది. 

 

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ భారీగా కొనుగోలు చేసిన టాప్‌ -30 స్టాక్స్‌లో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, లెమన్‌ట్రీ హోటల్స్‌, వేదాంత, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎన్‌ఐఐటీ, ఇండియన్‌ ఆయిల్‌, ఓఎన్‌జీసీ, మదర్సన్‌ సుమీ, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌, జీఈ టీఅండ్‌టీ ఇండియా, టోరెంట్‌ పవర్‌, పవర్‌ ఫైనాన్స్‌, ఆర్‌ఈసీ, ఎస్‌జేవీఎన్‌, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, అంబుజా సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఐటీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌ ఇండియా ఉన్నాయి. 

 

ఎరిస్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, ఎవరెడీ ఇంస్ట్రీస్‌, ఇండియన్‌ ఎనర్జీ ఎక్సేంజ్‌, మయూర్‌ యూనికోటర్స్‌, ఎన్‌బీసీసీ, రేమండ్‌ కంపెనీల్లో తనకున్న మొత్తం వాటాలను ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సెప్టెంబర్‌లో విక్రయించేసింది. టాటా పవర్‌లో 3.5 కోట్ల షేర్లను అమ్మేసింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 39 లక్షల షేర్లు, ఎస్‌బీఐలో 35 లక్షల షేర్లను విక్రయించింది. అలాగే, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, బీహెచ్‌ఈఎల్‌, విప్రో, ఇన్ఫోసిస్‌లోనూ కొంత మేర వాటాలను తగ్గించుకుంది. ఈక్విటీల్లో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తన పథకాల ద్వారా రూ.1,47,422 కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. అన్ని రకాల నిర్వహణ ఆస్తుల విలువ సెప్టెంబర్‌ ఆఖరుకు రూ.3,17,627 కోట్లుగా ఉంది. You may be interested

2 వేల నోటు కనబడుటలేదు!!

Wednesday 16th October 2019

ఈ ఏడాది ఒక్క నోటు కూడా ముద్రించలేదు వెల్లడించిన రిజర్వ్‌ బ్యాంక్‌... న్యూఢిల్లీ: ఈమధ్య ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు అంతగా రాకపోవడాన్ని గమనించారా... గతంలో పెద్దమొత్తంలో నగదు తీస్తే కచ్చితంగా ఎక్కువ సంఖ్యలోనే రూ.2 వేల నోట్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఈ సంఖ్య బాగా తగ్గింది. దీనికి కారణం లేకపోలేదు... గతంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన మరింత పెద్ద నోటు రూ. 2,000 ముద్రణ ప్రస్తుతం పూర్తిగా

క్యూ2లో ఈ కంపెనీలు నష్టాలు ప్రకటించే అవకాశం!

Tuesday 15th October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాల సీజన్‌ ఆరంభమైంది. దాదాపు అధిక శాతం కంపెనీలు ఈ నెల, వచ్చే నెలలో ఫలితాలను ప్రకటించనున్నాయి. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రభావం క్యూ2 ఫలితాలపై పెద్దగా కనిపించదని, మందగమనం భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు స్టాక్స్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆటోమొబైల్స్‌, టెలికం, మెటల్స్‌ కంపెనీలు నష్టాలను ఎదుర్కోవచ్చని లేదా వాటి లాభాలు తగ్గిపోవచ్చన్నది బ్రోకరేజీ సంస్థల అంచనా. ఫార్మా, అగ్రి, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మంచి

Most from this category