News


ఎస్‌బీఐ లైఫ్‌ 4.31 శాతం డౌన్‌

Tuesday 25th June 2019
Markets_main1561457830.png-26564

బీఎన్‌పీ పారిబా కార్డిఫ్‌ 2.5 కోట్ల ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌  షేర్లను మార్కెట్‌ ధరకంటే డిస్కౌంట్‌లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించడంతో మంగళవారం ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌ షేరు 4.31 శాతం నష్టపోయి రూ.680 వద్ద ముగిసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఎస్‌బీఐ లైప్‌ ఇన్సూరెన్స్‌లో బీఎన్‌పీ పారిబాకు 7.7 శాతం వాటా ఉండగా ఎస్‌బీఐకు 62.10 శాతం వాటా ఉంది. గత సెషన్‌ ధర కంటే 8.5 శాతం రాయితీతో షేర్‌ను రూ.650 వద్ద విక్రయించనున్నారు. ఈ ఆఫర్‌ను జూన్‌ 25న నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉంచగా, జూన్‌ 26న రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం 10 శాతం షేర్లను బీఎన్‌పీ పారిబా కేటాయించింది. ఈ ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.1775 కోట్లను సమీకరించాలని సంస్థ భావిస్తోంది. గత సెషన్‌లో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేరు విలువ 1.5 శాతం పెరిగి రూ.710.45 వద్ద ముగిసింది. స్టెట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బీఎన్‌పీ పారిబా కార్డిఫ్‌ సంస్థలు కలిసి ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌ను ప్రారంభించాయి. ఈ ఏడాది మార్చిలో బీఎన్‌పీ పారిబా 5కోట్ల ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లను రూ.2,889 కోట్లకు షేరు రూ.577.93 వద్ద  విక్రయించిన సంగతి తెలిసిందే. దీనితో ఎస్‌బీఐ లైఫ్‌లో బీఎన్‌పీ పారిబా వాటా 12.7 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. 2017 అక్టోబర్‌లో ఎస్‌బీఐ లైఫ్‌ రూ.700 వద్ద ఐపీఓకి వచ్చి స్టాక్‌ మార్కెట్‌లో నమోదయ్యింది. 
 



You may be interested

ఫెడ్‌ స్వరం మారింది!

Tuesday 25th June 2019

న్యూట్రల్‌ రేట్‌ తగ్గించిన యూఎస్‌ కేంద్రబ్యాంకు దీర్ఘకాలిక వడ్డీరేట్ల అంచనాలను యూఎస్‌ ఫెడరల్‌ తగ్గించింది. యూఎస్‌ ఎకానమీలో మందగమనం మరింత పెరగకుండా, వృద్ధి పరుగులు పెట్టాలంటే వడ్డీరేట్లు మరింతగా తగ్గించాలని ఫెడ్‌ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. న్యూట్రల్‌ రేటు(ఎకానమీపై ఎలాంటి ప్రభావం చూపని రేటు) 2.5 శాతం ఉండాలని తాజాగా ఫెడ్‌ నిర్ణయించింది. 2014లో న్యూట్రల్‌ రేటు 4 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చిలో న్యూట్రల్‌ రేటు 2.75 శాతముంది. న్యూట్రల్‌రేటును

ఐటీ, కార్పోరేట్‌ బాంకుల్లో ఇన్వెస్ట్‌ చేయోచ్చు: ఐఐఎఫ్‌ఎల్‌

Tuesday 25th June 2019

ఐటీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఫసిస్‌ ఎన్‌బీఎఫ్‌సీలో బజాజ్‌ ఫైనాన్స్‌, చోలమండలం, సుందరం ఫైనాన్స్‌  పార్మా రంగంలో టొరంటోను పరిశీలించోచ్చు మార్కెట్‌లోకి నగదు ప్రవాహం జరిగేంత వరకు మనం ఇప్పట్లో ఎటువంటి మార్కెట్‌ అప్‌టిక్‌ను చూడలేమని ఐఐఎఫ్‌ఎల్‌ వీపీ రిసెర్చ్‌ అభిమన్యు సోపత్‌ అన్నారు. ఓ అంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రస్తుతం ఏఏ  స్టాక్‌లలో ఇన్వెస్ట చేయవచ్చో, ఏ రంగం ఎలా ఉందో వివరించారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే... ప్రభుత్వ తక్షణ చర్యలు ముఖ్యం..  ద్రవ్యోల్బణం

Most from this category