News


ఎస్‌బీఐ లైఫ్‌ ఓఎఫ్‌ఎస్‌లో పాల్గొంటారా?

Wednesday 26th June 2019
Markets_main1561534656.png-26585

ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌  ఆఫర్‌ ఫర్‌సేల్‌ ప్రకటించింది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఒక్క షేరు రూ. 670 చొప్పున ఇస్తామని తెలిపింది. ఈ ధర సంస్థ ఐపీఓ ధర రూ. 700 కన్నా రూ. 30 తక్కువ. రెండేళ్ల క్రితం సంస్థ ఐపీఓకి వచ్చింది. ఇప్పుడు ఐపీఓ ధర కన్నా తక్కువకు షేరు లభించనుండడంతో పలువురు ఈ ఓఎఫ్‌ఎస్‌లో పాల్గొనాలని భావిస్తుంటారు. అయితే అనలిస్టులు మాత్రం ఈ షేరుపై ఏమంత బుల్లిష్‌గా లేరు. కంపెనీ ముందు పలు సవాళ్లున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలిక ధృక్పథం ఉన్న ఇన్వెస్టర్లు బీమారంగ పురోగతిని దృష్టిలో ఉంచుకొని ఓఎఫ్‌ఎస్‌ను పరిశీలించవచ్చని సూచిస్తున్నారు. ప్రస్తుతం షేరు తన గరిష్ఠ ధరకు 13 శాతం దిగువన ట్రేడవుతోంది. ఐపీఓ అనంతరం గతేడాది ఏప్రిల్‌లో షేరు 774.75 రూపాయల ఆల్‌టైమ్‌ హైని చేరింది. అనంతరం కుప్పకూలి రూ. 487 కనిష్ఠాన్ని తాకింది. అక్కడనుంచి తిరిగి 44 శాతం రికవరీ చెంది రూ. 675 వద్ద కదలాడుతోంది. కంపెనీకి మార్జిన్‌ విస్తరణ విషయంలో పరిమితులున్నాయని, ప్రొటెక‌్షన్‌ వ్యాపారంలో సవాళ్లున్నాయని గోల్డ్‌మన్‌సాక్స్‌ అభిప్రాయపడింది. బీఎన్‌పీ పారిబా ఓఎఫ్‌ఎస్‌ మార్గంలో 2.5 కోట్ల ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లను విక్రయించనుంది. ఓఎఫ్‌ఎస్‌లో 10 శాతం వాటాను రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని, దేశీయ బీమా పరిశ్రమ రానున్న రోజుల్లో మరింత విస్తృతమవుతుందని హెచ్‌ఢీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సూచించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. 
 You may be interested

భవిష్యత్తు అల్యూమినియం ప్యాకేజింగ్‌దే: ఏబీసీఏఐ

Wednesday 26th June 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పానీయాల ప్యాకేజింగ్‌కు అల్యూమినియం క్యాన్లను వాడటం పెరుగుతోందని అల్యూమినియం బెవరేజెస్‌ క్యాన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏబీసీఏఐ) స్పష్టంచేసింది. కల్తీకి ఆస్కారం లేకపోవడం, పానీయాల జీవిత కాలం ఎక్కువ ఉండడం, ప్లాస్టిక్‌ పట్ల విముఖత ఇందుకు కారణమని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏటా అల్యూమినియంతో తయారైన 200 కోట్ల పానీయాల క్యాన్లు విక్రయం అవుతున్నాయని బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌ ఇండియా ఎండీ అమిత్‌ లహోటి తెలిపారు. ఆదిత్య

ఆ మూడు లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!

Wednesday 26th June 2019

నిధుల బదిలీ మూడేళ్లపాటు జరగొచ్చు కేంద్రానికి ఆర్‌బీఐ నిధులపై నొముర అంచనా బ్యాంకులకిస్తేనే బాగుంటుందన్న బీఓఏ-ఎంఎల్‌ ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి కేంద్రానికి బదలాయింపులు జరుగుతాయని భావిస్తున్న రూ.3 లక్షల కోట్ల వినియోగంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిమాణంలో అధిక భాగం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ- నోమురా అంచనా వేసింది. నోమురా దీనిపై ఒక నివేదిక విడుదల చేస్తూ, ఆర్‌బీఐ నుంచి నిధుల బదలాయింపు

Most from this category