News


ఆల్‌ టైం గరిష్ఠానికి ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌

Wednesday 16th October 2019
Markets_main1571218498.png-28925

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సురెన్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత ఈ కంపెనీ సాక్‌పై అనేక బ్రోకరేజిలు బై సిఫార్సును ఇచ్చాయి. ఫలితంగా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌ షేరు విలువ బుధవారం ట్రేడింగ్‌లో రూ. 892 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకింది. కాగా ఈ కంపెనీ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 60 శాతానికిపైగా లాభపడడం గమనార్హం. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌  క్యూ2 ఫలితాలలో నికర లాభం 48.2 శాతం(ఏడాది ప్రాతిపదికన) తగ్గి రూ. 129.84 కోట్లుగా నమోదైంది. ‘ఎస్‌బీఐ లైఫ్‌, క్యూ2 ఫలితాలలో ఏడాది ప్రాతిపదికన 33.3 శాతం జీడబ్యూపీ(గ్రాస్‌ వ్రిటన్‌ ప్రీమియం) వృద్ధిని, 17.5 శాతం ఏపీఈ(యాన్యుల్‌ ప్రీమియం ఈక్విలెంట్‌) వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా నమోదు పునరుద్ధరణలో 33.2 శాతం వృద్ధిని నమోదు చేసింది’ అని ఏమ్కే బ్రోకరేజి తెలిపింది. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌ షేరు విలువ మధ్యాహ్నాం 2.26 సమయానికి  5.35 శాతం లాభపడి రూ. 882.00 వద్ద ట్రేడవుతుంది. 



You may be interested

ఫెడరల్‌ బ్యాంక్‌ నికర లాభం రూ. 417 కోట్లు

Wednesday 16th October 2019

ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ మంగళవారం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ2లో కంపెనీ రూ.417కోట్ల నికరలాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.266 కోట్లతో పోలిస్తే ఇది 56.3శాతం అధికం. ఇతర ఆదాయం పెరగడం, తక్కువ పన్ను వ్యయం నికరలాభం పెరిగేందుకు కారణమైనట్లు బ్యాంకు తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,748.44 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.3,135.97 కోట్లుగా

చిన్న ఇన్వెస్టర్ల చేతిలో యస్‌ బ్యాంక్‌

Wednesday 16th October 2019

క్యు2లో షేరుపై పెరిగిన చిన్న ఇన్వెస్టర్ల ఆసక్తి ఇటీవలి కాలంలో భారీగా పతనమైన యస్‌బ్యాంక్‌ షేరుపై చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొన్ని త్రైమాసికాలుగా బ్యాంకు పరిస్థితి బాగాలేదు, పేలవ ఫలితాలు ప్రకటిస్తూవస్తోంది. ఇలాంటి షేర్లలో సాధారణంగా హైనెట్‌వర్త్‌ ఇన్వెస్టర్లు రిస్కీ పెట్టుబడులు పెడుతుంటారు. కానీ ఈ షేరులో హెచ్‌ఎన్‌ఐలతో పోటీగా చిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడులు యస్‌బ్యాంక్‌ కౌంటర్లో గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చూపుతున్నాయి. ముఖ్యంగా క్యు2లో ఈ పరిస్థితి

Most from this category