News


ఎస్‌బీఐ, ఐసీఐసీఐ మొండి బకాయిలు తగ్గాయ్‌...కానీ!

Monday 28th October 2019
Markets_main1572244875.png-29179

దేశీయ బ్యాంకుల్లో టాప్‌ బ్యాంకులైన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు నమోదు చేశాయి. ముఖ్యంగా మొండిపద్దుల పెరుగుదలతో క్షీణత రెండు బ్యాంకుల ఫలితాల్లో కనిపించింది. అయితే మందగమన ప్రభావం ఇంకా ఉందని, ఆస్తుల నాణ్యత పరంగా బడా అకౌంట్ల పరిష్కారం జరగాల్సిఉందని ఇరు బ్యాంకుల చీఫ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా మొండిపద్దులు దాదాపుగా తగ్గాయని ఐసీఐసీఐబ్యాంకు తెలిపింది. దీనివల్లనే ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కనిపించిందని తెలిపింది. అయితే ఆర్థిక మందగమన ప్రభావంపై ఆందోళనగా ఉన్నట్లు పేర్కొంది. వచ్చే మార్చినాటికి మొండిపద్దుల చేరిక మరింత తగ్గుతుందని ఎస్‌బీఐ తెలిపింది. లోన్‌బుక్‌లో స్లిపేజ్‌లు 2 శాతం దాటకూడదని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎస్‌బీఐ లోన్‌బుక్‌ విలువ రూ. 22.48 లక్షల కోట్లుంది. మరోవైపు ఇతర బ్యాంకుల ఆస్తుల నాణ్యత సైతం క్రమంగా మెరుగుపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మందగమనం, ఎన్‌బీఎఫ్‌సీల నగదు సంక్షోభం, ప్రమోటర్లపై నిఘావ్యవస్థల డేగకన్ను లాంటివి బ్యాంకింగ్‌ వ్యవస్థకు సవాళ్లని విశ్లేషిస్తున్నారు. మందగమనం కొనసాగి, రికవరీ మరింత ఆలస్యమైతే వడ్డీవ్యయాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమ స్లిపేజ్‌లు మరింత పెరగవచ్చని యాక్సిస్‌బ్యాంకు ఎండీ వ్యాఖ్యానించారు. వడ్డీవ్యయాలు మరింత పెరగడం ఇబ్బందికరమని నిపుణులు భావిస్తున్నారు. ఎకానమీలో మందగమనం తొందరగా తొలగిపోయి, రికవరీ స్పీడందుకుంటే బ్యాంకింగ్‌ రంగంలో పునరుజ్జీవం స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తున్నారు. You may be interested

పసిడిలో పెట్టుబడులా? ఈ అంశాలు చూడండి

Monday 28th October 2019

రానున్న ఏడాది కాలంలో మూడు అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కమోడిటీ హెడ్‌ హరీష్‌  తెలిపారు.  ఆయన కాలమ్‌ ద్వారా వ్యక్తపర్చిన అభిప్రాయాలిలా వున్నాయి.....     గత ఏడాది ద్వితియార్ధం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే బంగారం ధరలు 30 శాతానికి పైగా లాభపడ్డాయి. దీనిని బట్టి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాల

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు అప్‌

Monday 28th October 2019

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం అరశాతం మేర లాభపడింది. ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ ఆదివారంనాటి మూరత్‌ ట్రేడింగ్‌ ముగింపు(11625)తో పోలిస్తే బాగా పెరిగింది.  అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న మొదటి దశ వాణిజ్య చర్చల ఒప్పందం దాదాపు కుదిరినట్లే అనే వార్తలు శుక్రవారం వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్‌ బలపడింది. నేడు ఆసియా మార్కెట్లు 3నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ  సంకేతాన్ని అందిపుచ్చుకున్న ఎస్‌జీఎస్‌

Most from this category