News


3నెలల గరిష్టానికి ఎస్‌బీఐ

Thursday 31st October 2019
Markets_main1572500272.png-29256

బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ తో ప్రభుత్వరంగ బ్యాంక్‌ దిగ్గజం ఎస్‌బీఐ షేర్లు గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.300 పైకి ఎగబాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.293.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంక్ యొక్క ఎంటర్ప్రైజ్ విలువ, ఆస్తి నాణ్యత, అధిక వృద్ధి కారణంగా నాటికి కల్లా షేర్లు 42శాతం అప్‌సైడ్‌ అవకాశం ఉన్నట్లు పలు బ్రోకరేజ్‌ సంస్థలు పేర్కోన్నారు. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో 9శాతం లాభపడి రూ.315.90వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. కేవలం 3వారాల్లో ఈ షేర్లు రూ.20శాతం ర్యాలీ చేశాయి. ఉదయం గం.10:40ని.లకు షేర్లు క్రితం ముగింపు(రూ.289.90)తో పోలిస్తే 8.50శాతం లాభంతో రూ.313.95 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ ధర షేరు 3నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. కాగా షేర్లు ఏడాది కనిష్ట గరిష్ట ధర రూ.244.35, రూ.373.80లుగా నమోదయ్యాయి.
లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు:-
నేటి మార్కెట్‌ ర్యాలీలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 5.50శాతం పెరిగింది. ఇండెక్స్‌లో అత్యధికంగా సెంట్రల్‌ బ్యాంక్‌ 13శాతం పెరిగింది. 
యస్‌బీఐ షేర్లు 8.50శాతం, అలహబాద్‌ బ్యాంక్‌ 8.50శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 7.50శాతం, పీఎన్‌బీ 3.50శాతం, జమ్మూకాశ్మీర్‌బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం లాభపడ్డాయి.  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 2శాతం నుంచి 1.50శాతం పెరిగాయి. యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 1శాతం వరకు ర్యాలీ చేశాయి. మధ్యాహ్నం గం.2:10ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,413.40)తో పోలిస్తే 4.86 శాతం లాభంతో రూ.2,530.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

మళ్లీ 1500డాలర్లపైకి పసిడి

Thursday 31st October 2019

అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పావుశాతం తగ్గించడంతో పాటు అమెరికా చైనాల మధ్య పాక్షిక ఒప్పందంపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో పసిడి ఫ్యూచర్లకు మళ్లీ డిమాండ్‌ పెరుగుతోంది. ఫలితంగా రెండురోజుల్లో 11డాలర్ల వరకు లాభపడింది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో 1500డాలర్ల పైన 1,501.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ, ప్రస్తుతం 1.75 శాతం నుంచి 2 శాతం రేంజ్‌లో ఉన్న

ఫ్లాష్‌..సెన్సెక్స్‌ కొత్త రికార్డు

Thursday 31st October 2019

 గురువారం దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ కొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వం బ్యాంక్‌లు, ఐటీ షేర్ల మద్దతుతో ఉదయం 10.55 సమయానికి 280.50 పాయింట్లు లాభపడి 40312 పాయింట్ల స్థాయిని అధిగమించడం ద్వారా సెన్సెక్స్‌ ఈ ఫీట్‌ను సాధించింది. ఈ ఏడాది జూన్‌ 4న సెన్సెక్స్‌ 40,312 పాయింట్ల వద్ద ఆల్‌టైం రికార్డును ఏర్పరచగా, ఈ రోజు సెషన్‌లో దానిని అధిగమించించింది.  గత సెషన్‌లో  40,051.87 పాయింట్ల వద్ద పాజిటివ్‌గా ముగిసిన ఈ ఇండెక్స్‌, గురువారం

Most from this category