STOCKS

News


ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవోకు సెబీ ఓకే

Wednesday 12th February 2020
Markets_main1581481361.png-31715

త్వరలో పబ్లిక్‌ ఇష్యూ
రూ. 10,000 కోట్ల సమీకరణ!

పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాం‍క్‌ క్రెడిట్‌ కార్డుల అనుబంధ విభాగం ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు వార్తలు వెలువడ్డాయి. తద్వారా ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ త్వరలో ఐపీవో చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ. 9,000-10,000 కోట్ల మధ్య సమీకరించే వీలున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవోకు రానున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ ప్రస్తుత త్రైమాసికంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవోను చేపట్టే వీలున్నట్లు  ఇటీవల పేర్కొన్నారు. 

76 శాతం వాటా
సెబీకి దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవోలో భాగంగా ఎస్‌బీఐ కార్డ్స్‌ 13 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచే అవకాశముంది. వీటికితోడు రూ. 500 కోట్ల విలువైన అదనపు సెక్యూరిటీలను సైతం జారీ చేయనుంది. వీటిలో సుమారు 3.73 కోట్ల షేర్లను ఎస్‌బీఐ, 9.3 కోట్లకుపైగా కార్లయిల్‌ విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ కార్డ్స్‌లో మాతృ సంస్థ స్టేట్‌బ్యాంక్‌కు 76 శాతం వాటా ఉంది. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కార్లయిల్‌ గ్రూప్‌ మిగిలిన 24 శాతం వాటాను కలిగి ఉంది. ఇష్యూకి కొటక్‌ మహీంద్రా కేపిటల్‌, యాక్సిస్‌ కేపిటల్‌, డీఎస్‌పీ మెరిల్‌లించ్‌ తదితర సంస్థలు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ తదుపరి
ఎస్‌బీఐ ప్లాస్టిక్‌ కార్డ్స్‌ విభాగం 9.5 మిలియన్ల మంది కస్టమర్లను కలిగి ఉన్నట్లు అంచనా. తద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదుపరి ర్యాంకులో నిలుస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. గత మూడేళ్లలో దేశీయంగా క్రెడిట్‌ కార్డుల వినియోగం వార్షిక ప్రాతిపదికన దాదాపు 36 శాతం చొప్పున ఎగసింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం క్రెడిట్‌ కార్డ్‌ ఔట్‌స్టాండింగ్‌ దాదాపు 26 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. గత 6-7 ఏళ్ల కాలంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌వోఈ) 25 శాతానికి తగ్గలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.   



You may be interested

లాభాల్లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Wednesday 12th February 2020

మార్కెట్‌ రెండో రోజూ ర్యాలీలో భాగంగా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,554.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అటు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో ఇండెక్స్‌ 0.81శాతం లాభపడి 31554.70 వద్ద

స్వల్పంగా తగ్గిన పుత్తడి

Wednesday 12th February 2020

బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.35 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ.40,420.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  ఔన్స్‌ బంగారం ధర 1,571.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (మంగళవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

Most from this category