News


ఎస్‌బీఐ కార్డ్స్‌కు కోవిడ్‌-19 సెగ

Tuesday 17th March 2020
news_main1584413476.png-32514

(అప్‌డేటెడ్‌..)

  • రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం...

ఎస్‌బీఐ అనుబంధ కంపెనీ, ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ షేర్ల లిస్టింగ్‌పై కోవిడ్‌-19 వైరస్‌ తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌ కూడా భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ షేర్ల లిస్టింగ్‌ కూడా పేలవంగానే జరిగింది. మరోవైపు కొన్ని కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. కాగా పార్క్‌ హోటల్స్‌ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, ఆమోదం తెలిపింది. 

13 శాతం నష్టంతో లిస్టింగ్‌..... 
ఇష్యూ ధర, రూ.755తో పోల్చితే ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ షేర్‌ బీఎస్‌ఈలో 13 శాతం నష్టంతో రూ.658 వద్ద లిస్టయింది. ఈ షేర్‌కు ఇదే ఇంట్రాడే కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో ఇష్యూ ధర, రూ.755కు ఎగసినప్పటికీ, చివరకు 9.5 శాతం నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 41.6 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 6.08 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.57,199 కోట్లకు చేరింది. 

ఈ నెలలోనే వచ్చిన ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 22 రెట్లకు పైగా ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10.000 కోట్ల మేర నిధులు సమీకరించింది.  

 

  • రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం...

ఐపీఓలో భాగంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు (రూ.2 లక్షల కంటే తక్కువగా ఇన్వెస్ట్‌ చేసేవాళ్లు) 4.27 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించారు. ఇష్యూ ధర రూ.755తో పోల్చితే ఈ షేర్‌ బీఎస్‌ఈలో రూ.72 నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. ఒక్కో షేర్‌కు రూ.72 నష్టం పరంగా చూస్తే, మొత్తం రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం వచ్చింది. అలాగే క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు రూ.174 కోట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు రూ.132 కోట్ల మేర నష్టాలు వచ్చాయి.  



You may be interested

పార్క్‌ హోటల్స్‌ ఐపీఓ @ రూ.1,000 కోట్లు

Tuesday 17th March 2020

పార్క్‌ హోటల్స్‌ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు రూ.600 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయిస్తారు. మొత్తం మీద ఈ ఐపీఓ సైజు రూ.1,000 కోట్లు. ఈ కంపెనీ హైదరాబాద్‌, విశాఖపట్టణం బెంగళూరు, చెన్నై, కోల్‌కత, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, జైపూర్‌, జోధ్‌పూర్‌, కోయంబత్తూర్‌ తదితర నగరాల్లో

జీడీపీకి కరోనా కాటు!

Tuesday 17th March 2020

వృద్ధి 50 బేసిస్‌ పాయింట్లు తగ్గుతుందన్న ఆందోళన ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రతాపం మరింత వ్యవధిపాటు కొనసాగితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు అర శాతం వరకు తగ్గుతుందన్న ఆందోళన దేశీయ కంపెనీల నుంచి వ్యక్తమైంది. అంతేకాదు, ఈ వైరస్‌ ప్రభావం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యలోటు మరింత పెరిగిపోవడమే కాకుండా బ్యాంకులకు మొండి బాకీలు (ఎన్‌పీఏలు) మరింత జోడవుతాయని పేర్కొన్నాయి. కరోనా వైరస్‌ ప్రభావం దేశ

Most from this category