News


త్వరలోనే ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ !

Tuesday 18th February 2020
Markets_main1581995082.png-31870

  • ఈ నెల చివర్లో... లేదా మార్చి మొదట్లో
  • ఇష్యూ పరిమాణం రూ.6,000 కోట్లపైనే
  • ముకేశ్‌ ట్రెండ్స్‌ లైఫ్‌ స్టైల్‌ ఐపీఓకు సెబీ ఓకే


న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) క్రెడిట్‌ కార్డ్‌ విభాగం, ఎస్‌బీఐ కార్డ్స్ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల చివరి వారంలో గానీ, వచ్చే నెల మొదట్లో గానీ ఉండొచ్చని సమాచారం. ఈ ఐపీఓకు ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు 13.05 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయిస్తారు. దీంట్లో ఎస్‌బీఐ 3.7 కోట్లు, కార్లైల్‌ గ్రూప్‌ 9.32 కోట్ల షేర్లను విక్రయిస్తాయి.  ఈ ఐపీఓ సైజు రూ.6,000 కోట్లకు మించి ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.


జీఎమ్‌పీ రూ.296-298 రేంజ్‌లో 
ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, డీఎస్‌పీ మెరిల్‌ లించ్‌, నొముర ఫైనాన్షియల్‌ అడ్వయిజరీ, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వ్యవహరిస్తున్నాయి. భారత్‌లో అత్యధికంగా క్రెడిట్‌ కార్డ్‌లు జారీ చేస్తున్న రెండో అతి పెద్ద కంపెనీ ఇదే. 18 శాతం మార్కెట్‌  వాటా ఈ కంపెనీదే. ఐపీఓ ఇష్యూ ధర రూ.690-750 రేంజ్‌లో ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం గ్రే మార్కెట్‌ ప్రీమియమ్‌(జీఎమ్‌పీ) రూ.296-298గా ఉందని సమాచారం.


ముకేశ్‌ ట్రెండ్స్‌ ఐపీఓకు సెబీ ఓకే...
ఎస్‌బీఐ కార్డ్స్‌తో పాటు ముకేష్‌ ట్రెండ్స్‌ లైప్‌స్టైల్‌ ఐపీఓకు కూడా సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ కోటి వరకూ ఈక్విటీ  షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ సూజు రూ.70-90 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. You may be interested

ఓయో నష్టాలు 335 మిలియన్‌ డాలర్లు

Tuesday 18th February 2020

న్యూఢిల్లీ: ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ కన్సాలిడేటెడ్‌ నష్టాలు మరింత అధికమయ్యాయి. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సం‍స్థ 335 మిలియన్‌ డాలర్ల (రూ.2,390 కోట్లు) నష్టాలను ప్రకటించింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నష్టాలు రూ.52 మిలియన్‌ డాలర్లుగానే (రూ.370 కోట్లు) ఉండడం గమనార్హం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 211 మిలియన్‌ డాలర్ల నుంచి 951 మిలియన్‌ డాలర్లకు

ఐఆర్‌సీటీసీ అద్భుత ప్రదర్శన ఎందుకు..?

Tuesday 18th February 2020

రైల్వే శాఖ అనుబంధ కంపెనీ ఐఆర్‌సీటీసీ ఐపీవోకు వచ్చిన ఐదు నెలల్లోనే ఐదింతలు పెరిగి ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను ఇచ్చింది. అక్టోబర్‌ 3న ఐపీవో ముగియగా ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.320. ప్రస్తుత ధర రూ.1518. ఈ అసాధారణ ర్యాలీ ఇన్వెస్టర్లను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ, ఇందుకు సహేతుక కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు.   స్థిరమైన పనితీరు ఐఆర్‌సీటీసీ అన్నది భిన్నమైన కంపెనీ. లిస్టెడ్‌ కంపెనీల్లో ఈ తరహా

Most from this category