News


ఎస్‌బీఐ కార్డ్స్‌ 8.50శాతం అప్‌..!

Tuesday 17th March 2020
Markets_main1584429127.png-32530

కరోనా ఎఫెక్ట్‌తో లిస్టింగ్‌లో నిరాశపరిచిన ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరు మరుసటి రోజు లాభాల బాటపట్టింది. బీఎస్‌ఈలో మంగళవారం ఈ షేరు రూ.685.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ రికవరిలో భాగంగా మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరు కొనుగోలుకు ఇన్వెస్టర్లు మొగ్గచూపారు. ఫలితంగా ఒక దశలో షేరు ఒక 9శాతం లాభపడి రూ.744.50 వద్ద ఇంట్రాడే గరిష్టా‍న్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:20ని.లకు షేరు మునుపటి ముగింపు(రూ.683.20)తో పోలిస్తే 8.50శాతం లాభంతో రూ. 741.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.658.00, రూ.755.00లుగా ఉన్నాయి. 


భారీ అంచనాలతో రూ.10వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఈ నెలలో ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓకు వచ్చింది. ఐపీఓ సైతం 22 రెట్లకు పైగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. అయితే కరోనా వైరస్‌ వ్యాధి ప్రభావంతో వృద్ధి భయాల కారణంగా మార్కెట్‌ పతనంలో భాగంగా లిస్ట్‌ ధర(రూ.755)తో పోలిస్తే బీఎస్‌ఈలో 13శాతం నష్టంతో రూ.658 వద్ద లిస్టయింది. చివరకు 9.50శాతం నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. 



You may be interested

నిత్యావసరాలకు భారీ గిరాకీ

Tuesday 17th March 2020

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలన్నీ అధిక సంఖ్యలో ఉత్పత్తులను విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. కరోనా మహమ్మారిని భారత్‌లో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జనసమూహ ప్రాంతాలను నిషేధించడం, సినిమాహాళ్లు, పబ్‌లు, విద్యాలయాలు  మూసివేత వంటివాటిని కేంద్రప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. దీంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల విక్రయాలు భారీగా పెరిగాయి. కరోనా భయంతో వినియోగదారులంతా శానిటేషన్‌ నుంచి ఫుడ్‌ వరకు సంబంధించిన ఉత్పత్తులను కొనుక్కోని నిల్వ చేసుకుంటుండడంతో ఎఫ్‌ఎంసీజీల విక్రయాలు భారీగా పెరిగాయి.

ప్రతీ బేర్‌ దశ తదుపరి బుల్‌ ట్రెండ్‌!

Tuesday 17th March 2020

బేర్‌ పట్టులో సగటున 39 శాతం పతనం ఆపై 40-100 శాతం మధ్య బుల్‌ ర్యాలీ  గత రెండు దశాబ్దాల చరిత్రలో గణాంకాలివి కరోనా సృష్టిస్తున్న కల్లోలం కారణంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ పతన బాటలో సాగుతున్నాయి. గత నెల రోజుల్లోనే యూఎస్‌ మార్కెట్లు 27 శాతం పడిపోగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో నిఫ్టీ గత రెండు నెలల్లో 30 శాతంపైగా తిరోగమించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ విలయం సృష్టిస్తోంది.

Most from this category