News


ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టింగ్‌.. ప్చ్‌

Monday 16th March 2020
Markets_main1584334573.png-32499

ఎన్‌ఎస్‌ఈలో రూ. 661 వద్ద ఓపెనింగ్‌
ఇష్యూ ధర రూ. 755
ఇంట్రాడేలో రూ. 656-749 మధ్య ఊగిసలాట
ఉదయం 10.15కల్లా రూ. 750కు రికవరీ

మార్కెట్లో తొలుత భారీ ఆసక్తిని రేకెత్తించిన ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో నష్టాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 755తో పోలిస్తే.. ఎన్‌ఎస్‌ఈలో రూ. 661 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది రూ. 94 నష్టంకాగా.. తదుపరి రూ. 656 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఆపై ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో రూ. 749 వరకూ రికవర్‌ అయ్యింది. ఉదయం 10.15 ప్రాంతంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరు రూ. 750 వద్ద ట్రేడవుతోంది. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయం కారణంగా ఇటీవల ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు పతనబాటలో సాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో తొలుత ఎస్‌బీఐ కార్డ్స్‌ ఇష్యూ పట్ల భారీ  ఆసక్తి వ్యక్తమైనప్పటికీ నష్టాలతో లిస్టయినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఈ  ఇష్యూ దాదాపు 27 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. క్రెడిట్‌ కార్డుల బిజినెస్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదుపరి రెండో ర్యాంకులో ఎస్‌బీఐ కార్డ్స్‌ నిలుస్తోంది. 2019 నవంబర్‌కల్లా 18 శాతం వాటాను సొంతం చేసుకుంది. 18 కోబ్రాండెడ్‌ భాగస్వామ్యాలను కలిగి ఉంది. గత రెండేళ్లలో కార్డుల వినియోగం, ఔట్‌స్టాండింగ్‌లలో 35 శాతం, 54 శాతం చొప్పున వృద్ధిని సాధించింది. మాతృ సంస్థ ఎస్‌బీఐకి గల 22,000 బ్రాంచీల నెట్‌వర్క్‌ దన్నుగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు వివరించారు. ఐపీవోకు ముందు ఎస్‌బీఐ కార్డ్స్‌లో స్టేట్‌బ్యాంక్‌కు 74 శాతం వాటా ఉంది. విదేశీ భాగస్వామి సీఏ రోవర్‌ హోల్డింగ్స్‌(కార్లయిల్‌) మిగిలిన 26 శాతం వాటాను కలిగి ఉంది. ఆఫర్‌లో భాగంగా కార్లయిల్‌ 9.3 కోట్ల షేర్లను, ఎస్‌బీఐ 3.7 కోట్ల షేర్లను విక్రయించిన విషయం విదితమే. 



You may be interested

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 11 శాతం డౌన్‌!

Monday 16th March 2020

సోమవారం ఉదయం ఎన్‌ఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 11 శాతం పతమై 717.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నట్లు బ్యాంక్‌ ప్రమోటర్లు వెల్లడించారు. దీంతో బ్యాంక్‌ పట్ల అసత్య పుకార్లు సృష్టిస్తున్నారని , ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇష్యూ తప్పించి, మరి ఏఇతర సమస్యలు లేవని ప్రమోటర్లు పేర్కొన్నారు.  అవసరమైతే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు అండగా ఉంటామని వారు

ఎస్‌బీఐ చీఫ్‌ను అవమానించిన ఆర్థిక మంత్రి

Monday 16th March 2020

సోషల్ మీడియాలో వైరల్‌గా ఆడియో క్లిప్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్‌పై కేం‍ద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియో క్లిప్ ప్రకారం.. రుణవితరణ పెరగకపోవడానికి .. ముఖ్యంగా అస్సాం తేయాకు తోటల్లో పనిచేసే వారికి రుణాలు లభించకపోవడానికి ప్రధాన కారణం అయనేనంటూ నిర్మలా

Most from this category