News


ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ మార్చి 2న ప్రారంభం

Thursday 20th February 2020
Markets_main1582195601.png-31968

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విభాగమైన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 2న ప్రారంభం అవుతుంది. ఇటీవల ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించిన సంగతి  తెలిసిందే. ఎస్‌బీఐ కార్డ్స్‌లో ఎస్‌బీఐకి 76 శాతం, కార్లే గ్రూపుకు 24 శాతం వాటా ఉంది. దేశంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అతిపెద్ద రెండో క్రెడిట్‌ కార్డు జారీ సంస్థ కావడం విశేషం. దీనికి మార్కెట్‌లో 18 శాతం వాటా ఉంది. కాగా ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓలో షేర్లు కొనాలనుకునే వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 6 అంశాలు...

1.ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ ఓపెన్‌ ఎప్పుడంటే
ఐపీఓ దరఖాస్తు మార్చి 2-5 వరకు స్వీకరిస్తారు. మార్చి 13న డీమాట్‌ అకౌంట్‌లో షేర్లుక్రెడిట్‌ అవుతాయి.

2.ఎస్‌బీఐ కార్డ్స్‌ షేర్ల లిస్టింగ్‌ తేదీ
 నిబంధనలకు అనుగుణంగా బీఎస్‌ఈ,ఎన్‌ఎస్‌ఈలలో మార్చి 16న కంపెనీ షేర్లు లిస్ట్‌ అవుతాయి.

3.ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓలో బుక్‌రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్స్‌ ఎవరంటే
కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, బోఫా సెక్యూరిటీస్‌, హెచ్‌ఎస్‌బీసీ, నొమురా, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌.

4.ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ పరిమాణం 
ఎస్‌బీఐ రూ.500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. 13.05 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో కేటాయించనుంది. 

5.ఎస్‌బీఐ కార్డ్స్‌కు ఉన్నబలాలు
-భారతదేశంలో రెండో అతిపెద్ద క్రెడిట్‌ కార్డ్‌ జారీదారుగానే గాక , మార్కెట్‌లో మంచి నైపుణ్యం వృద్ధితో కూడిన లాభాలు ఆర్జించిన సంస్థగా మంచి గుర్తింపు ఉంది.
- వివిధ రకాల కస్టమర్లను చేర్చుకోగల సామర్థ్యం కలిగి ఉంది.
- బ్రాండ్‌ ఇమేజ్‌తో పాటు బలమైన ప్రమోటర్‌ మద్దతు ఉంది.
-వివిధ రకాల పోర్ట్‌పోలియోల్లో క్రెడిట్‌ కార్డ్‌లను ఆఫర్‌ చేయగలగడం.
-సమర్థవంతమైన రికవరీ, డేటాను అనలైటికల్‌గా విశ్లేషణ చేయగల సామర్థ్యం.
-అధునాతన , స్కేలబుల్‌ టెక్నాలజీతో కూడిన మౌలిక సదుపాయాలు 

6.ఓవరాల్‌గా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌
ఎస్‌బీఐ క్రెడిడ్‌ కార్డ్స్‌ వచ్చే ఐదళ్లలో 2.5 రెట్లు వృద్ధిచెందాలని భావిస్తోంది. ఇప్పటికే క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవిలు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక సంవత్సరం 2015 నుంచి ఆర్థిక సంవత్సరం 2019 వరకు 32 శాతం సీఏజీఆర్‌ వృద్ధి చెంది రూ.6 లక్షల కోట్లకు చేరింది. 2024నాటికి ఈ లావాదేవీల విలువ రూ.15 లక్ష కోట్లకు చేరాలని ఎస్‌బీఐ భావిస్తోంది. అయితే ఇది  2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువ అని క్రిసిల్‌ రిసెర్చ్‌ వెల్లడించింది.

 You may be interested

అప్‌ట్రెండ్‌ చాన్స్‌ మిగిలే ఉంది..!

Friday 21st February 2020

నిఫ్టీ గురువారం 12,150 స్థాయిల్లో నిరోధాన్ని ఎదుర్కొని, చివరికి స్వల్ప నష్టంతో 12,080 వద్ద క్లోజయింది. డైలీ చార్ట్‌లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పాటు చేసినప్పటికీ.. అప్‌ట్రెండ్‌ అవకాశాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ గత రెండు సెషన్లలోనూ 50డీఎంఏ వద్ద నిరోధాన్ని ఎదుర్కొన్నది. డైలీ చార్ట్‌లో గరిష్టంలో గరిష్టం, కనిష్టాలను నమోదు చేసిందని, వీక్లీ చార్ట్‌లో ప్రోత్సాహకర సంకేతాలను ఇచ్చిందని, దీంతో ఇండెక్స్‌ ఇక ముందూ

ఇండియాబుల్స్ గ్రూప్ షేర్ల జోరు

Thursday 20th February 2020

ఇండియాబుల్స్ గ్రూప్ కుదుర్చుకున్న ఒప్పందాలలో ప్రభుత్వం ఎటువంటి అవకతవకలను కనుగొనలేదనే నివేదికలతో ఈ గ్రూప్ షేర్లు 17శాతం వరకు పెరిగాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) దర్యాప్తులో ఇండియాబుల్స్ ఒప్పందంలో పెద్ద అవకతవకలు జరగలేదని తేలినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ సానుకూలాంశంతో... ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇంట్రాడేలో 17.50శాతం పెరిగింది. మార్కెట్‌ ముగిసే సరికి 11శాతం లాభంతో రూ.338.30  వద్ద స్థిరపడింది.  ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేడ్‌ సర్వీసెస్‌ షేరు ఇంట్రాడేలో 5శాతం

Most from this category