News


15 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబైన ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

Thursday 5th March 2020
Markets_main1583379266.png-32287

  • నేటితో ముగియనున్న ఐపీఓ 

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మూడో రోజు 15 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. నేటి(గురువారం)తో ముగియనున్న ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ రూ.750-755గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10,300 కోట్ల మేర నిధులు సమీకరిస్తుందని అంచనా. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు(క్విబ్‌)కు కేటాయించిన వాటా 57 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 2 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.8 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి. ​బుధవారం సాయంత్రం నాటికి గ్రే మార్కెట్‌ ప్రీమియమ్‌(జీఎమ్‌పీ) రూ.165గా ఉందని సమాచారం. 

ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)మార్గంలో 13 కోట్ల షేర్లను విక్రయిస్తారు. ఈ నెల 16న ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ షేర్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతుంది. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ మహీఃద్రా క్యాపిటల్‌ కంపెనీ,, యాక్సిస్‌ క్యాపిటల్‌, డీఎస్‌పీ మెరిల్‌ లించ్‌, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌(ఇండియా), నొముర ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా), ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వ్యవహరిస్తున్నాయి. 



You may be interested

నేడు అటూఇటుగా ఓపెనింగ్‌ ?

Thursday 5th March 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 4 పాయింట్లు మైనస్‌ నేడు నిఫ్టీకి 11,103 వద్ద తొలి సపోర్ట్‌! బుధవారం 4.5 శాతం జంప్‌చేసిన డోజోన్స్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30   ప్రాంతం‍లో 4 పాయింట్లు తక్కువగా 11,243 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,247 పాయింట్ల  వద్ద ముగిసింది. ఇక్కడి  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

ఎయిరిండియాలో 49 శాతంగానే విదేశీ ఎయిర్‌లైన్స్‌ వాటాలు..

Thursday 5th March 2020

భారీ రుణాలు, నష్టాల భారంతో అమ్మకానికి వచ్చిన ఎయిరిండియాలో ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో విదేశీ ఎయిర్‌లైన్స్ సహా ఇతరత్రా విదేశీ సంస్థలు.. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎయిరిండియాలో 49 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేయడానికి ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా ఎయిరిండియా నియంత్రణాధికారాలు భారతీయుల చేతుల్లోనే ఉండేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఇతరత్రా

Most from this category