News


39 శాతం సబ్‌స్క్రైబయిన ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

Tuesday 3rd March 2020
Markets_main1583209542.png-32237

  • ఈ నెల 5న ముగింపు 
  • ఇష్యూ సైజు రూ.10,355 కోట్లు 
  • ఈ నెల 16న లిస్టింగ్‌

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) తొలి రోజు 39 శాతం సబ్‌స్క్రైబయింది. సోమవారం ప్రారంభమై ఈ నెల 5న ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ను రూ.750-755గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10,355 కోట్లు సమీకరిస్తుందని అంచనా. తొలి రోజు రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా 62 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 12 శాతం చొప్పున సబ్‌స్రై​‍్కబయ్యాయి. కాగా 74 మంది యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీ రూ.2,769 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో 13 కోట్ల ఈక్విటీ షేర్లను కూడా విక్రయిస్తారు. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 16న స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, యాక్సిస్‌ క్యాపిటల్‌, డీఎస్‌పీ మెరిల్‌లించ్‌, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ (ఇండియా), నొముర ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌(ఇండియా), ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వ్యవహరిస్తున్నాయి. కాగా మొన్నటిదాకా రూ.300-320 రేంజ్‌లో ఉన్న గ్రే మార్కెట్‌ ప్రీమియమ్‌(జీఎమ్‌పీ) సోమవారానికి రూ.150కు పడిపోయిందని సమాచారం. తాజాగా రెండు కరోనా కేసులు వెలుగులోకి రావడంతో మన స్టాక్‌ మార్కెట్‌ భారీగా పడిపోవడమే దీనికి కారణమని విశ్లేషకులంటున్నారు. 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 3rd March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు భారతీ ఎయిర్‌టెల్‌: ఈ కంపెనీ చెల్లించాల్సిన ఏజీఆర్‌ బాకాయిలు ప్రభుత్వం అంచనా వేసిన దానిలో మూడో వంతు మ్రాతమే ఉన్నాయని భారతీ ఎయిర్‌ టెల్‌ తెలిపింది. మొదట్లో టెలికం విభాగం కొన్ని మినహాయింపులు ఇచ్చిందని వాటన్నింటిని తీసివేస్తే ఈ మొత్త వచ్చిందని కంపెనీ పేర్కొంది. జిందాల్‌ స్టెయిన్‌లెస్‌: కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ నిర్వహించే కోటక్‌ స్పెషల్‌ సిట్యూవేషన్‌ ఫండ్‌(కేఎస్‌ఎస్‌ఎఫ్‌) జిందాల్‌ స్టెయిన్‌లెస్‌

నోకియా సీఈఓ రాజీవ్ సూరి రాజీనామా

Tuesday 3rd March 2020

లండన్‌: భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి నోకియా ప్రెసిడెంట్‌, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. సంస్థకు 25 ఏళ్ల పాటు సేవలందించిన సూరి తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామాను సమర్పించారని నోకియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 31తో ఈయన పదవీకాలం ముగియనుండగా.. నూతన ప్రెసిడెంట్‌, సీఈఓగా పెక్కా లండ్‌మార్క్ పేరును కంపెనీ బోర్డు ఖరారుచేసింది. సూరీ పదవీకాలం ముగిసినప్పటికీ.. వచ్చే ఏడాది జనవరి

Most from this category