News


నేటి నుంచి ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

Monday 2nd March 2020
Markets_main1583120342.png-32199

  • ప్రైస్‌బాండ్‌ రూ.750-755
  • ఇష్యూ సైజు రూ.10,000 కోట్లు 
  • మార్చి 16న లిస్టింగ్‌ 

న్యూఢిల్లీ: కోవిడ్‌-19(కరోనా) వైరస్‌ కల్లోలంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తోంది. ఈ ఐపీఓ నేడు (సోమవారం) మొదలై మార్చి 5న ముగుస్తుంది. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ను రూ.750-755గా నిర్ణయించారు. కనీసం 19 షేర్లకు(మార్కెట్‌ లాట్‌) దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో 13 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తారు. మొత్తం ఇష్యూ సైజు రూ.10,000 కోట్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా. మార్చి 16న స్టాక్‌ మార్కెట్లో ఈ కంపెనీ షేర్‌ లిస్టవుతుంది. You may be interested

700 పాయింట్ల భారీగ్యాప్‌అప్‌ తో సెన్సెక్స్‌ ప్రారంభం

Monday 2nd March 2020

11400 పైన నిఫ్టీ ప్రారంభం భారీ స్థాయిలో షార్ట్‌కవరింగ్‌ ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు  ఆరు రోజుల వరుస నష్టాల ముగింపు పలుకుతూ దేశీయ మార్కెట్‌ సోమవారం భారీ లాభంతో మొదలైంది. కరోనా వైరస్‌ భయాలతో ఆర్థిక మందగమన భయాలతో క్రితంవారం సూచీలు కనిష్ట స్థాయిలకి పతనమైన నేపథ్యంలో నేడు ట్రేడర్లు భారీ స్థాయిలో షార్ట్‌ కవరింగ్‌ను పాల్పడ్డారు. సెన్సెక్స్‌ 718.66 పాయింట్ల లాభంతో 39015.95 వద్ద, నిఫ్టీ 209.15 పాయింట్లు పెరిగి

ఆటో రంగానికి కరోనా కాటు

Monday 2nd March 2020

42 శాతం తగ్గిన ఎం అండ్‌ ఎం అమ్మకాలు మారుతి సుజుకీ, టాటా మోటార్స్‌ విక్రయాలు డౌన్‌ న్యూఢిల్లీ: దేశీ ఆటో పరిశ్రమకు కోవిడ్–19 (కరోనా) వైరస్ కుంగదీసింది. గతేడాదిలో భారీ పతనాన్ని నమోదుచేసి.. ఈ ఏడాది ప్రారంభంలో కాస్త పర్వాలేదు అనిపించిన ఈ రంగాన్ని తాజాగా కరోనా వైరస్‌ మళ్లీ పడేసింది. దిగ్గజ ఆటో సంస్థ మారుతి సుజుకీ దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరి నెలలో 1.6 శాతం పడిపోయాయి. గత

Most from this category