News


మార్కెట్‌ స్థిరపడితే ఎస్‌బీఐ కార్డ్‌ ర్యాలీ..?

Tuesday 17th March 2020
Markets_main1584387782.png-32511

స్టాక్‌ మార్కెట్లు కుదుటపడితే ఎస్‌బీఐ కార్డ్‌ షేరు పుంజుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ సంస్థ ఎండీ, సీఈవో హర్‌దయాళ్‌ ప్రసాద్‌. మార్కెట్లలో అల్లకల్లోలం సర్దుమణిగిన తర్వాత కంపెనీ బలాలు ముందుకు వస్తాయని అప్పుడు తిరిగి షేరు ధర కంపెనీ పనితీరును ప్రతిఫలిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ, కంపెనీ ఆదాయం, వృద్ధి తప్పకుండా షేరులో కనిపిస్తాయని, ప్రస్తుత పతనం తాత్కాలికమేనన్నారు. కంపెనీ వృద్ధి అవకాశాలపై మాట్లాడుతూ.. దేశంలో క్రెడిట్‌ కార్డుల విస్తరణ చాలా నిదానంగా ఉందన్నారు. దీంతో తాము వృద్ధి చెందేందుకు భారీ అవకాశాలున్నాయని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ప్రజల ఆకాంక్షలే తమ వ్యాపార విస్తరణ అవకాశాలుగా ప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రజలు ఖర్చు చేయాలనుకుంటున్నారని, అందుకు వారికి డబ్బులు అవసరమన్నారు. జీవితంలో ఎన్నో కావాలని కోరుకుంటున్నారని, కొన్నేళ్ల  క్రితం వరకు ఈ అవకాశాల్లేవని వివరించారు. పీవోఎస్‌ సదుపాయాలు, ఈ కామర్స్‌ విస్తరణ మరెన్నో నేడు అందుబాటులోకి రావడం వల్ల క్రెడిట్‌ కార్డుల విస్తరణకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. దేశంలో వృద్ధి అవకాశాలు ఇక ముందూ బలంగా ఉంటాయన్న అంచనాను వ్యక్తీకరించారు.

 

మరే ఇతర దేశంలో చూసినా.. క్రెడిట్‌ కార్డుల విస్తరణ చిన్న పట్టణాల్లోకీ చొచ్చుకుపోయిందని, మన దేశంలోనూ సరైన విధానాలు, మంచి నమూనాలతో అదే విధమైన వృద్ధి అవకాశాలను చేరుకోవచ్చని హర్‌దయాళ్‌ ప్రసాద్‌ అన్నారు. ఎన్‌పీఏలపై మాట్లాడుతూ.. గడిచిన పదేళ్ల కాలంలో (క్రితం ఎన్‌పీఏల గరిష్ట దశ నుంచి) వ్యాపార నిర్వహణలో ఎంతో మార్పు వచ్చిందని వివరించారు. ‘‘ఇప్పుడు భారత్‌లో బలమైన క్రెడిట్‌ బ్యూరో వ్యవస్థ ఉంది. ఏ దేశానికి అయినా ఇది ఎంతో ముఖ్యం. రెండోది ఐటీ సదుపాయాలు. దేశమంతటా ఏర్పాటయ్యాయి. గతంలో ఈ వ్యాపారం మెట్రోల్లోనే ఉండేది. ఇప్పుడిది ద్వితీయ, తృతీయ పట్టణాలకూ విస్తరిస్తోంది. 58 శాతం క్రెడిట్‌కార్డుల వ్యాపారం ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచే వస్తోంది. కనుక లెహమన్‌ సంక్షోభం తర్వాత చూసిన పరిస్థితి ఇక మీదట ఉండబోదు. రిస్క్‌లను సర్దుబాటు చేసుకుని, ఎన్‌పీఏలను నియంత్రించుకుంటే మంచి లాభదాయకతకు అవకాశం ఉంటుంది’’ అని పరస్థితి వివరించారు.



You may be interested

యస్‌ బ్యాంకు ర్యాలీ.. కాస్త జాగ్రత్త!

Tuesday 17th March 2020

యస్‌ బ్యాంకు సోమవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో ఉవ్వెత్తున ఎగిసింది. ఇంట్రాడేలో 58 శాతం వరకు ర్యాలీ చేసింది. చివరికి 45 శాతం లాభంతో రూ.37.10 వద్ద బీఎస్‌ఈలో క్లోజయింది. గత శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత బ్యాంకు మూడో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.18వేల కోట్లకు పైగా నష్టాలను ప్రకటించింది. ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నా, ఇప్పటికే షేర్లు కొనుగోలు చేసిన వారు తమ వద్దనున్న మొత్తం

మళ్లీ ప్రపంచ మార్కెట్లు బేర్‌

Monday 16th March 2020

ఫెడ్‌ ఎఫెక్ట్‌ నిల్‌.. 2,700 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ 760 పాయింట్లు కుప్పకూలిన నిఫ్టీ యూరోపియన్‌ మార్కెట్లు 8 శాతం వీక్‌ యూఎస్‌ ఫ్యూచర్స్‌ 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌ పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌., ఐటీ, రియల్టీ పతనం కోవిడ్‌-19 ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఎకాఎకిన వడ్డీ రేట్లను 1 శాతంమేర తగ్గించేసింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 0-0.25 శాతానికి చేరాయి. ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఇటీవలే 0.5 శాతం

Most from this category