News


ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓకు 4రోజులు ఎందుకంటే..?

Thursday 27th February 2020
Markets_main1582793315.png-32143

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ కనీస గడువు కాలం 3ట్రేడింగ్‌ సెషన్‌లు ఉంటుంది. కానీ ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ కాలవ్యవధి 4ట్రేడింగ్‌ సెషన్లుగా ఉంది. ఐపీఓ మార్చి 2న ప్రారంభమై అదే నెల 5వ తేదీన ముగుస్తుంది. మార్కెట్‌ రెగ్యూలేటరీ నియమావళి ప్రకారం ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ కనిష్టంగా 3మార్కె్‌ట్‌ పనిదినాలుగానూ, గరిష్టంగా 10 ట్రేడింగ్‌ పనిదినాలు ఉంటుంది. ఇష్యూలో భాగంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35శాతం షేర్లను కేటాయించడంతో ఎస్‌బీఐ కార్డు ఐపీఓకు భారీగా డిమాండ్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు తమ దరఖాస్తులను సకాలంలో దాఖలు చేసేలా ఐ-బ్యాంకర్లు అదనపు రోజును కోరుకునేలా చేసింది.

‘‘ఐపీఓకు నెలకొన్న భారీ డిమాండ్‌ దృష్ట్యా, మారుమూల ప్రాంతాల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించడానికి..  ప్రమోటర్‌ కంపెనీ తరపున, మార్కెట్ రెగ్యులేటర్‌(సెబీ)ని అదనంగా మరోరోజూ సమయం కావాలని అభ్యర్థించాము. కాబట్టి ఎక్స్ఛేంజీలు నాల్గవ రోజు(మార్చి 5వరకు) సాయంత్రం 5గంటల వరకు అన్ని దరఖాస్తులను అంగీకరించగలవు, ఎక్స్ఛేంజ్ సిబ్బంది ముగింపు రోజు ఆలస్యంగా పని చేయనవసరం లేదు. ఈ సమిష్టం విజయం’’ అని ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లు తెలిపారు. ప్రాథమిక అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని డిమాండ్‌, ఇన్వెస్టర్ల ఆసక్తి తదితర కారణాలను పరిశీలిస్తే చూస్తే గతంలో అన్ని విజయవంతమైన మెగా ఐపీఓలలో చూసినట్లుగా మేము భారీ సంఖ్యలో దరఖాస్తులను ఆశిస్తున్నామని వారు తెలిపారు. 

సాదారణంగా ఐపీఓ మూడురోజుల పాటు ఉంటుంది. కానీ ఇష్యూయర్‌ ధరశ్రేణిని సవరిస్తే మరో 3రోజులుపాటు ఐపీఓను పొడిగించవచ్చు. ఊహించని పరిణామాలు, బ్యాంకింగ్ సమ్మె లాంటి సమ్మత అవాంతరాలు ఎదురైతే కూడా ఇష్యూయర్‌ కనీసం మూడు పనిదినాల వరకు బిడ్డింగ్ వ్యవధిని పొడిగించవచ్చు. అనుకున్న దానికై బలమైన బిడ్లను దాఖలైనపుడు, ఇష్యూయర్‌ ముగింపు తేదీకి ఒక రోజు ముందు క్యూఐపీ ఆఫర్ వ్యవధిని కూడా మూసివేయవచ్చు.

అంతకు ముందు దేశంలో అతిపెద్ద ఐపీఓగా పిలువబడే కోల్‌ ఇండియా ఐపీఓ ఇష్యూ కూడా 4రోజుల పాటు జరిగింది. క్యూఐబీ ఇన్వెస్టర్లకు 18-20 తేది వరకు, రీటైల్‌, హెచ్‌ఎన్‌ఐ ఇన్వెస్టర్లకు 18-21 తేదీల మధ్య జరిగింది. You may be interested

కరోనాతో సమస్యలతోపాటు అవకాశాలూ ఉంటాయ్‌!

Thursday 27th February 2020

నిఫ్టీ కంపెనీల లాభాలు 5 శాతం డౌన్‌ కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు లేకుంటే మరింత వీక్‌ - వినయ్‌ పండిట్‌, ఇండియానివేష్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీ కంపెనీలకు ఓవైపు సమస్యలు ఎదురయ్యే అవకాశమున్నప్పటికీ మరోపక్క అవకాశాలు సైతం లభించే వీలున్నట్లు చెబుతున్నారు వినయ్‌ పండిట్‌. ఇండియానివేష్‌, ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ హెడ్‌ అయిన నివేష్‌ ఒక ఇంటర్వ్యూలో మార్కెట్ల ట్రెండ్‌, ఎల్‌ఐసీ లిస్టింగ్‌ తదితర పలు అంశాలపై అభిప్రాయాలను

ఐదేళ్ల గరిష్టానికి ఆర్తి డ్రగ్స్‌

Thursday 27th February 2020

గత ఐదు రోజుల్లో 26 శాతం ర్యాలీ క్యూ3 ఫలితాలు, విస్తరణ ఎఫెక్ట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ దేశీయంగానూ ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతోంది. వరుసగా ఐదు రోజుల నుంచీ పతనబాటలో సాగుతున్న అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మధ్యాహ్నం 12.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 400 పాయింట్లు పతనం‍కాగా.. నిఫ్టీ 115 పాయింట్లు తిరోగమించింది. ఇంట్రాడేలో 11,537 పాయింట్ల దిగువకు చేరింది. వెరసి బడ్జెట్‌

Most from this category