News


ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ ధర శ్రేణి రూ.750-755

Tuesday 25th February 2020
Markets_main1582609673.png-32070

  • మార్చి 2న ఐపీఓ ప్రారంభం

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విభాగమైన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ తన ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ధర శ్రేణిని నిర్ణయించింది. మార్చి 2న మొదలై 5న ముగిసే ఈ ఐపీఓకు ధర శ్రేణిని రూ.750-755గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. అలాగే అర్హత కలిగిన ప్రతి ఎంప్లాయిలకు డిస్కౌంట్‌ కింద ప్రతి షేరును రూ.75లకే విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఐపీఓ కోసం బిడ్ లాట్‌ను 19 షేర్లగా ఖరారు చేసినట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ మంగళవారం ఎక్చ్చేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇష్యూలో భాగంగా ఎస్‌బీఐ కార్డ్స్‌ మొత్తం 130.5 మిలియన్‌ షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఇందులో 37.29 మిలియన్ల వరకు ఎస్‌బీఐ, 93.23 మిలియన్ల వరకు షేర్లను కార్లైల్‌ గ్రూప్‌ ఆఫర్‌ చేస్తుంది. వీటికి అదనంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఎస్‌బీఐ కార్డ్స్‌లో ఎస్‌బీఐకి 76 శాతం వాటా ఉంది. మిగతా వాటా కార్లైల్‌ గ్రూప్‌నకు ఉంది. ఎస్‌బీఐ కార్డ్స్‌ దేశంలో రెండో అతిపెద్ద క్రెడిట్‌ కార్డుల జారీ కంపెనీ. దీనికి 18 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టింగ్‌తో ఎస్‌బీఐకి సంబంధించిన లిస్టింగ్‌ కంపెనీల సంఖ్య ఐదుకు చేరనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.9,000 కోట్లు సమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది.  అంచనా ధరల శ్రేణి ఆధారంగా లెక్కిస్తే మార్కెట్‌ విలువ రూ.70,000 కోట్లు అవుతుంది. కానీ, గ్రే మార్కెట్‌లో ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరుకు 40 శాతం ప్రీమియం పలుకుతోంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో లిస్టింగ్‌ నాటికి మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్లను దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ ఐపీఓ కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, డీఎస్‌పీ మెర్లించ్‌, నోమురా ఫైనాన్స్‌ అడ్వైజరీ, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఈ ఇష్యూకు బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 



You may be interested

టీవీఎస్‌ మోటార్‌ 3% శాతం డౌన్‌

Tuesday 25th February 2020

మంగళవారం టీవీఎస్‌ మోటార్‌ షేరు 3 శాతం పడిపోయింది.రూ.16.10 తగ్గి  రూ.422.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది.కోవిడ్‌-19 ప్రభావంతో టూ వీలర్‌, త్రీవీలర్‌ విడిభాగాల దిగుమతులు ఆగిపోవడంతో టీవీఎస్‌ కంపెనీ వాహన ఉత్పత్తి 10 శాతం ఆగిపోయిందని చెన్నై కేంద్రంగా పనిచేస్తోన్న టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వెల్లడించింది. దీంతో టీవీఎస్‌ మోటార్‌ షేరు విలువ పడిపోయింది.కాగా BS-VI  వాహనాల తయారీ కావాల్సి విడిభాగాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కంపెనీ వెల్లడించింది.

వొడాఫోన్‌ ఐడియా షేరు పతనం

Tuesday 25th February 2020

బ్యాంక్‌ గ్యారంటీలను నగదు చేసుకోవద్దంటున్న రుణదాతలు 6.5 శాతం పతనమైన వొడాఫోన్‌ ఐడియా షేరు మొబైల్‌ సేవల కంపెనీ వొడాపోన్‌ ఐడియాకు రుణాలిచ్చిన ఫైనాన్షియల్‌ సంస్థలు బ్యాంక్‌ గ్యారంటీలను నగదుగా మార్చుకోవద్దని వారాంతాన టెలికం శాఖ(డాట్‌)ను అభ్యర్థించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలా చేస్తే బ్యాంకుల రుణాలను చెల్లించే విషయంలో కంపెనీ విఫలంకాగలదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. టెలికం రంగంలో మూడు కంపెనీల కార్యకాలపాలు కొనసాగే పరిస్థితులు కల్పించే బాటలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రుణదాత

Most from this category