News


లిస్టింగ్‌తోనే దిగ్గజాలను వెనక్కి నెట్టనున్న ఎస్‌బీఐ కార్డ్స్‌

Tuesday 25th February 2020
Markets_main1582569944.png-32052

ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీవో మార్చి 2న ప్రారంభం కానుండగా, 5న ముగియనుంది. అనంతరం అదే నెల 16న స్టాక్‌ ఎక్సేంజ్‌లలో లిస్ట్‌ అవనుంది. లిస్టింగ్‌తోనే ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ అప్పటికే నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని 16 కంపెనీలను మార్కెట్‌ విలువ పరంగా (గత శుక్రవారం నాటి గణాంకాల ఆధారంగా) వెనక్కి నెట్టేయనుంది. ఐపీవోలో ధరల శ్రేణి రూ.750-755గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వారం చివర్లోగా అధికారికంగా ధరల శ్రేణి వెల్లడి కానుంది. అంచనా ధరల శ్రేణి ఆధారంగా లెక్కిస్తే మార్కెట్‌ విలువ రూ.70,000 కోట్లు అవుతుంది. కానీ, గ్రే మార్కెట్‌లో ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరుకు 40 శాతం ప్రీమియం కోట్‌ అవుతుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో లిస్టింగ్‌ నాటికి మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్లను దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

16 నిఫ్టీ స్టాక్స్‌ మార్కెట్‌ విలువ ప్రస్తుతానికి రూ.70వేల కోట్లకు దిగువన ఉంది. వీటిల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, గెయిల్‌, టాటా స్టీల్‌, ఐచర్‌ మోటార్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, యూపీఎల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, సిప్లా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, వేదాంత ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డ్స్‌ విలువ రూ.60,000 కోట్లుగా ఉన్నా కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల నాటికి ఉన్న ఎర్నింగ్స్‌ అంచనా ఆధారంగా 41 పీఈలో ఉన్నట్టు బ్రోకరేజీ సంస్థ ఎమ్కే గ్లోబల్‌ తెలిపింది. కానీ, దేశీయంగా ఉన్న ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకింగ్‌ సంస్థలు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బంధన్‌ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌ 23-38 పీఈ మధ్య ఉన్నట్టు ఎమ్కే గ్లోబల్‌ తెలియజేసింది. అంటే ఎస్‌బీఐ కార్డ్స్‌ ఇష్యూ ఎంతో ప్రీమియంతో రానుందని అర్థమయ్యేలా ఈ గణాంకాల సహితంగా వివరించింది. ఒకవేళ ఐపీవో ధరను రూ.700కు పైన నిర్ణయించి, దీనికి 50 శాతం ప్రీమియంతో లిస్ట్‌ అవుతుందని అంచనా వేసుకుంటే అప్పుడు మార్కెట్‌ క్యాప్‌ రూ.1-1.10 లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. దాంతో ఎస్‌బీఐ కార్డ్స్‌ పీఈ 70 వరకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, పరిశ్రమకు మించి వ్యాపార వృ‍ద్ధిని ఎస్‌బీఐ కార్డ్స్‌ నమోదు చేస్తుండడం గమనించాల్సిన అంశం. అధిక వృద్ధిని నమోదు చేసే కంపెనీలకు మార్కెట్‌ సహజంగానే ఎక్కువ వ్యాల్యూషన్‌ కడుతుంది. ఎస్‌బీఐ కార్డ్స్‌కు క్రెడిట్‌ కార్డు మార్కెట్లో 18 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. 29 శాతం వాటాతో హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్‌ మొదటి స్థానంలో ఉంది. You may be interested

అద్భుతమైన వాణిజ్య ఒప్పందం

Tuesday 25th February 2020

అతి పెద్ద డీల్ అవుతుంది ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన అహ్మదాబాద్‌: ఓ అద్భుతమైన, ఇప్పటి వరకు చరిత్రలో అతిపెద్దది అయిన వాణిజ్య ఒప్పందంపై భారత్‌, అమెరికా చర్చలు నిర్వహిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. భారత పర్యటనలో తొలి రోజు సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం నుంచి ఆయన ప్రసంగించారు. పెట్టుబడులకు అవరోధాలను తగ్గించే దిశగా అద్భుతమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఆరంభ దశలో ఉన్నాయని

రిటైల్‌ ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తున్నారా..?

Tuesday 25th February 2020

బాగా పడిపోతున్న స్టాక్స్‌లో ఎంతో విలువ దాగి ఉందని రిటైల్‌ ఇన్వెస్టర్లు భావిస్తున్నట్టున్నారు. రేటింగ్‌ డౌన్‌ గ్రేడ్‌ అయినవి, కార్పొరేట్‌ సమస్యలతో కుదేలయినవి, రుణాల చెల్లింపుల్లో చేతులెత్తేస్తున్నవి, నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నవి.. ఇలా ఎన్నో కారణాలతో బాగా పడిపోతున్న స్టాక్స్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటాలు చాలా గరిష్ట స్థాయికి చేరడం చూస్తుంటే.. అవి మళ్లీ పూర్వ వైభవాన్ని ప్రదర్శిస్తాయని రిటైల్‌ ఇన్వెస్టర్లు అంచనా వేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.    బీఎస్‌ఈ 500 సూచీలోని రిటైల్‌

Most from this category