News


మిడ్‌టర్మ్‌కు డాషింగ్‌ డజన్‌ సిఫార్సులు

Monday 16th December 2019
Markets_main1576492463.png-30252

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినిచ్చే 12 షేర్లను వివిధ బ్రోకరేజ్‌లకు చెందిన అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.
1. కంటైనర్‌ కార్పొరేషన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 610. స్టాప్‌లాస్‌ రూ. 560. రికార్డు హై నుంచి వెనుదిరిగి వంద రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొందింది. ఇక్కడ దాదాపు మూడు వారాలు కన్సాలిడేషన్‌ చెంది తాజా అప్‌మూవ్‌కు సిద్ధమైంది. 
2. ఎల్‌అండ్‌టీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1355. స్టాప్‌లాస్‌ రూ. 1280. టాప్‌ నుంచి కరెక‌్షన్‌కు వచ్చి కీలక 1260 రూపాయల మద్దతును మరోమారు పరీక్షించింది. చార్టుల్లో ఓవర్‌సోల్డ్‌గా కనిపిస్తున్నందున రీబౌండ్‌ తప్పదని అంచనా. 
3. ఫెడరల్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 103. స్టాప్‌లాస్‌ రూ. 79. ఎనిమిది వారాలుగా 82-92 రూపాయల రేంజ్‌లో తిరిగి రిట్రేస్‌మెంట్‌ను పూర్తి చేసింది. ఇండికేటర్లు ప్రస్తుతం బుల్లిష్‌ రివర్సల్‌ సంకేతాలు ఇస్తున్నాయి.
4. సీమెన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1590. స్టాస్‌లాస్‌ రూ. 1448. దాదాపు రెండు వారాలు 50 రూపాయల రేంజ్‌లోనే కదలాడింది. గత ర్యాలీ అనంతరం ఈ కన్సాలిడేషన్‌ జరగడం బాటమ్‌అవుట్‌కు సంకేతం. ప్రస్తుతం బ్రేకవుట్‌కు సిద్ధంగా ఉంది. 
5. ఎస్కార్ట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 665. స్టాప్‌లాస్‌ రూ. 597. ఇటీవలి కనిష్ఠం రూ. 585 వద్ద షార్ట్‌టర్మ్‌ బాటమ్‌ ఏర్పరుచుకుంది. వీక్లీ చార్టుల్లో హామర్‌ తరహా నిర్మాణం ఏర్పడింది. రూ. 600పైన స్థిరంగా కొనసాగితే అప్‌మూవ్‌ జరుపుతుంది.
6. హెచ్‌డీఎఫ్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2500. స్టాప్‌లాస్‌ రూ. 2290. జూలైలో ఆల్‌టైమ్‌ హైని తాకి అనంతరం రూ. 1960 వద్ద హయ్యర్‌ బేస్‌ ఏర్పరిచింది. ఈ స్థాయిని పలుమార్లు పరీక్షించింది, కానీ బ్రేక్‌డౌన్‌ కాలేదు. దీంతో ఇక్కడ బలమైన మద్దతు ఏర్పడింది. తాజాగా డాన్‌చైన్‌ ఇండికేటర్లో బ్రేకవుట్‌ చూపుతోంది. 
7. ఎస్‌బీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 350. స్టాప్‌లాస్‌ రూ. 324. పీఎస్‌బీలో టాప్‌ ప్రదర్శన చూపుతోంది. దిగువన మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. తాజాగా రూ. 308 నుంచి రివర్సయింది. ఇక్కడ నుంచి కొత్త అప్‌మూవ్‌ వేవ్‌ ఆరంభమైనట్లు కనిపిస్తోంది. దివాలా చట్టం కింద పలు కంపెనీల నుంచి భారీగా రికవరీలు పొందనుంది. 
8. టాటా మోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 190. స్టాప్‌లాస్‌ రూ. 170. దిగువన రూ. 105-110 వద్ద బలమైన బేస్‌ ఏర్పరుచుకుంది. గత ర్యాలీ అనంతరం వచ్చిన పతనంతో చార్టుల్లో జండా ఆకార నిర్మితి ఏర్పడింది. తాజాగా ఈ నిర్మాణం నుంచి బ్రేకవుట్‌ సాధించి బుల్లిష్‌గా మారింది.
9. బలరామ్‌పుర్‌ చినీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 203. స్టాప్‌లాస్‌ రూ. 154. కన్సాలిడేషన్‌ అనంతరం కీలక నిరోధాలను ఛేదించి బుల్లిష్‌ బ్రేకవుట్‌ చూపుతోంది. చార్టుల్లో కప్‌ అండ్‌ హాండిల్‌ ప్యాట్రన్‌ను దాటి బ్రేకవుట్‌ సాధించడం మరింత అప్‌మూవ్‌కు సంకేతం. 
10. మైండ్‌ట్రీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 830. స్టాప్‌లాస్‌ రూ. 729. జూన్‌, జూలైల్లో భారీ పతనం అనంతరం 200 రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొందింది. ఇక్కడ వంద రూపాయల రేంజ్‌లో కన్సాలిడేట్‌ చెంది తాజాగా అప్‌సైడ్‌ నిరోధాన్ని ఛేదించుకొని బయటపడింది. 
11. టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 357. స్టాప్‌లాస్‌ రూ. 315. వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పరిచింది. చార్టుల్లో మిని గోల్డెన్‌క్రాస్‌ ఏర్పరిచి పాజిటివ్‌గా కనిపిస్తోంది.
12. విప్రో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 264. స్టాప్‌లాస్‌ రూ. 232. డౌన్‌ట్రెండ్‌ వాలు రేఖను పైవైపుగా ఛేదించి స్పష్టమైన బై సిగ్నల్స్‌ ఇస్తోంది. ఎంఏసీడీ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌ సంకేతాలు ఇస్తున్నాయి. చార్టుల్లో త్రీవేవ్‌ కరెక‌్షన్‌ ముగిసి తదుపరి అప్‌మూవ్‌కు రెడీ అయినట్లు కనిపిస్తోంది. You may be interested

స్వల్ప నష్టాలతో ముగింపు

Monday 16th December 2019

ఇంట్రాడే కొత్త ఆల్‌టైం హైని అందుకున్న సెన్సెక్స్‌  12100 స్థాయిని చేజార్చుకున్న నిఫ్టీ  ఐటీసీ, మెటల్‌, అటో షేర్లలో అమ్మకాలు  ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలమయ్యాయి. ట్రేడింగ్‌లో ప్రారంభంలో సెన్సెక్స్‌ కొత్త రికార్డు గరిష్టాన్ని నమోదు చేసినప్పటికీ.., మార్కెట్ ముగిసే సరికి 71 పాయింట్లు నష్టపోయి 40938 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 12100 స్థాయిని చేజార్చుకొని 32.70 పాయింట్లు నష్టంతో 12054 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఎఫ్‌ఎంసీజీ, అటో, మెటల్‌ రంగాలకు

కొత్త రికార్డుస్థాయికి హెచ్‌డీఎఫ్‌సీ

Monday 16th December 2019

ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. నేడు బీస్‌ఈలో ఈ షేరు రూ.2357.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో షేరు దాదాపు 1.50శాతం పెరిగి రూ.2384.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ స్థాయికి షేరు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మార్కెట్‌ ముగిసే సరికి  1.02శాతం లాభంతో రూ.2376.90 వద్ద స్థిరపడింది. నేటి ఇంట్రాడేలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ఆర్జించిన

Most from this category