News


ఎస్‌బీఐలో రిస్క్‌ కొద్దీ రాబడులు..: మోతీలాల్‌ ఓస్వాల్‌

Friday 14th February 2020
Markets_main1581704126.png-31804

ఆర్థిక వృద్ధి కనిష్ట స్థాయిని చవిచూసిందని, వినియోగం ఇక్కడి నుంచి తప్పకుండా వృద్ధి చెందుతుందన్నారు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ షా. డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి కంపెనీల ఫలితాలు బాగున్నాయని, ఆటోమొబైల్‌ రంగానికి ఇంతకుమించి ప్రతికూలతలు ఉండకపోవచ్చన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.

 

టెలికం/ఏజీఆర్‌
భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ సంస్థలు మార్కెట్‌ వాటాను పెంచుకుంటాయి. ఇది ఈ కంపెనీల ‍స్టాక్స్‌ పనితీరులో చూస్తూనే ఉన్నాం. కంపెనీలు ఇచ్చిన అంచనాల ప్రకారం చూస్తే వాటి ఏఆర్‌పీయూ వచ్చే రెండేళ్లలో అధిక స్థాయికి చేరనుంది. అప్పుడు భారతీ, రిలయన్స్‌ మంచి పనితీరు ప్రదర్శిస్తాయి. ఈ రెండు స్టాక్స్‌లోనూ ఎంతో శక్తి దాగుంది. వీటిల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఏజీఆర్‌ అంశంపై విచారణలను గత మూడు నాలుగు నెలలుగా చూస్తూనే ఉన్నాం. కనుక టెలికం కంపెనీల ఎక్స్‌పోజర్‌ ప్రభావం ఇప్పటికే బ్యాంకు స్టాక్స్‌లో ప్రతిఫలించింది. తాజా తీర్పుతో అదనంగా వచ్చి పడే ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు.

 

ఫైనాన్షియల్‌/ఇన్సూరెన్స్‌
గత ఏడాది కాలంలో ఈ కంపెనీలు మంచి పనితీరు చూపించాయి. ఇక ముందూ మంచి ప్రదర్శనే చేస్తాయి. ఈ స్టాక్స్‌లో కరెక్షన్‌ వస్తే దాన్ని కొనుగోలుకు అవకాశంగా తీసుకోవచ్చు. ఈ రంగం ఇక ముందూ ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ బీమా రంగంలో ఆసక్తికర పనితీరు చూపిస్తున్నాయి. ఎస్‌బీఐ డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాలను, యాజమాన్యం వ్యాఖ్యలను పరిశీలించినట్టయితే రిస్క్‌ కొద్దీ రాబడుల పరంగా ఎస్‌బీఐ ఎంతో సానుకూలంగా ఉంది. ఇదొక మంచి వ్యాల్యూ స్టాక్‌. ఆస్తుల నాణ్యత మెరుగుపడుతోంది. సబ్సిడరీలు లిస్ట్‌ అవుతున్నాయి. ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవోకు వస్తోంది. ఆ తర్వాత ఏఎంసీ లిస్టింగ్‌కు రానుంది. కనుక ప్రస్తుత ధరలో చూస్తే ఎస్‌బీఐలో ఎంతో వ్యాల్యూ దాగుంది. కొంచెం రిస్క్‌ తీసుకుంటే ఎంతో రాబడులకు అవకాశం ఉంది.

 

ఫార్మా..
ఫార్మాలో లార్జ్‌క్యాప్‌ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రతికూల పనితీరు చూపించాయి. దేశీయంగా ఎక్స్‌పోజర్‌ ఉన్న కంపెనీలు మంచి పనితీరు చూపించాయి. ఆల్కెమ్‌, దివిస్‌, ఇప్కా పనితీరు బాగుంది. దేశీయంగా వ్యాపారం కలిగి ఉన్న కంపెనీలు ఇక ముందూ మంచి పనితీరు చూపించనున్నాయి. సన్‌ లేదా లుపిన్‌ మంచి పనితీరు చూపించేందుకు మరికొంత సమయం పడుతుంది.



You may be interested

ఫండ్స్‌ వలకు చిక్కిన స్మాల్‌ క్యాప్స్‌

Friday 14th February 2020

లార్జ్‌క్యాప్‌ షేర్లతో పోలిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగంలో చాలా షేర్లు ఆకర్షణీయమైన ధరల వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్థిక రంగ మందగమనం, ఎన్నో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో రాణించేవి లార్జ్‌క్యాప్‌ కంపెనీలే కనుక విదేశీ ఫండ్స్‌, దేశీయ ఫండ్స్‌ ఇన్నాళ్లూ ప్రధానంగా లార్జ్‌క్యాప్‌లో నాణ్యమైన స్టాక్స్‌లోనే ఎక్స్‌పోజర్‌కు మొగ్గు చూపించాయి. కానీ, ఆర్థిక వృద్ధి క్షీణత బోటమ్‌ అవుట్‌ అయిందన్న అంచనాలతో, ఇక మీదట చిన్న, మధ్య స్థాయి కంపెనీలు

తొలుత హుషార్‌- తుదకు బేజార్‌

Friday 14th February 2020

సెన్సెక్స్‌ 200 పాయింట్లు డౌన్‌ తొలుత లాభాల డబుల్‌ సెంచరీ నిఫ్టీ 61 పాయింట్ల వెనకడుగు తొలుత ఎస్‌అండ్‌పీ.. దేశ సావరిన్‌ రేటింగ్‌కు స్టేబుల్‌ ఔట్‌లుక్‌ను ప్రకటించడంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను చెల్లించకపోవడంపై సుప్రీం కోర్టు సీరియస్‌కావడంతో డీలాపడ్డాయి. వెరసి తొలుత లాభాల డబుల్‌సెంచరీ చేసిన సెన్సెక్స్‌ చివరికి అదే స్థాయిలో నష్టపోయింది. 202 పాయింట్లు క్షీణించి 41,258 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 61 పాయింట్లు

Most from this category