News


సౌదీ ఆరామ్‌కో..... ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ !

Saturday 7th December 2019
news_main1575690219.png-30100

  • 2,560 కోట్ల డాలర్లతో ‘అలీబాబా’ రికార్డ్‌ బ్రేక్‌
  • ఈ నెల 12న సౌదీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌ !

రియాద్‌: ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌ విలువ గల కంపెనీగా సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం, సౌదీ ఆరామ్‌కో అవతరించనున్నది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిలిచింది. ఐపీఓలో భాగంగా తన షేర్‌ ధరను 32 రియాల్స్‌(8.53 డాలర్లు-రూ.601)గా  సౌదీ ఆరామ్‌కో నిర్ణయించింది. ఈ ధర పరంగా ఈ కంపెనీ ఐపీఓ సైజు 2,560 కోట్ల డాలర్లు(రూ.1,80,480 కోట్లు )అవుతుంది. ఇప్పటివరకూ 2,500 కోట్ల డాలర్లతో అతి అపెద్ద ఐపీఓగా ఉన్న ఆలీబాబా రికార్డ్‌ను సౌదీ ఆరామ్‌కో బ్రేక్‌ చేసినట్లే. 2014లో చైనా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కంపెనీ ఆలీబాబా ఐపీఓ 2,500 కోట్ల డాలర్లు సమీకరించింది. కాగా అదనంగా వచ్చిన దరఖాస్తులను కూడా వినియోగించుకోవాలని (గ్రీన్‌ షూ ఆప్షన్‌)ను కంపెనీ భావిస్తే, సౌదీ ఆరామ్‌కో ఐపీఓ సైజు 2,940 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. 


ప్రపంచంలోనే పెద్ద కంపెనీ...! 
మరోవైపు తాజా ఇష్యూ ధరను బట్టి సౌదీ ఆరామ్‌కో కంపెనీ విలువ 1.7 లక్షల కోట్ల డాలర్లుగా తేలుతుంది. మార్కెట్‌ విలువ పరంగా చూస్తే, యాపిల్‌(1.2 లక్షల కోట్లు), మైక్రోసాఫ్ట్‌, ఆలీబాబా(1.1 లక్షల కోట్లు) కంటే ఎంతో ఎగువున సౌదీ ఆరామ్‌కో ఉంది. తాదవుల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో సౌదీ ఆరామ్‌కో షేర్లు ఈ నెల 12న లిస్టయ్యే అవకాశాలున్నాయి. 2020లో 7,500 కోట్ల డాలర్ల డివిడెండ్‌ను ఇవ్వాలని సౌదీ ఆరామ్‌కో భావిస్తోంది. ఇది యాపిల్‌ డివిడెండ్‌ కంటే  ఐదు రెట్లు అధికం. 



You may be interested

ఇక్కడ ఎస్‌యూవీలంటేనే ఇష్టం

Saturday 7th December 2019

రెండేళ్లలో నాలుగు కొత్త ఎస్‌యూవీలు  ఫోక్స్‌వ్యాగన్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ న్యాప్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: యూరోపియన్‌ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌ వచ్చే రెండేళ్లలో కొత్తగా నాలుగు స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ను (ఎస్‌యూవీ) మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుతం టిగువన్‌ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో కంపెనీ విక్రయిస్తోంది. భారతీయులకు ఎస్‌యూవీలపై మక్కువ ఎక్కువని ఫోక్స్‌వ్యాగన్‌ ప్యాసింజర్‌ కార్స్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ న్యాప్‌ శుక్రవారమిక్కడ చెప్పారు. ఈ విభాగంలో రానున్న రోజుల్లో తమ స్థానాన్ని పదిలపర్చుకుంటామన్నారు. 2020లో

భారతీ ఎయిర్‌టెల్‌ పట్ల సీఎల్‌ఎస్‌ఏ బుల్లిష్‌

Friday 6th December 2019

టెలికం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సానుకూలంగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ ఏజీఆర్‌ బకాయిలు చెల్లింపుల కోసం గాను 3 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2 బిలియన్‌ డాలర్లను క్యూఐపీ రూపంలో, మరో బిలియన్‌ డాలర్లు డెట్‌ రూపంలో సమీకరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాల నేపథ్యంలో రిస్క్‌-రాబడుల దృష్ట్యా ఎయిర్‌టెల్‌ సానుకూలంగా ఉందని సీఎల్‌ఎస్‌ఏ

Most from this category