News


10 శాతం ప్రీమియంతో లిస్టయిన అరామ్‌కో

Wednesday 11th December 2019
Markets_main1576054360.png-30174

సౌదీకి చెందిన చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్‌కో రియాద్‌ స్టాక్‌ఎక్చేంజ్‌లో బంపర్‌ లిస్టింగయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం ప్రీమియంతో 35.20 వద్ద సంస్థ షేరు లిస్టయింది. ప్రపంచంలో అతిపెద్ద ఐపీఓగా పేరొందిన ఈ పబ్లిక్‌ ఆఫర్‌తో కంపెనీ 2560 కోట్ల డాలర్లు సమీకరించింది. లిస్టింగ్‌తో సంస్థ విలువ 1.88 లక్షల కోట్ల డాలర‍్లకు చేరింది. దీంతో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా సౌదీఅరామ్‌కో అవతరించింది. సౌదీ మార్కెట్‌ ప్రపంచంలో 9వ అతిపెద్ద స్టాక్‌మార్కెట్‌గా మారింది. ప్రస్తుతం ప్రపంచంలో లక్ష కోట్ల డాలర్ల పైచిలుకు విలువున్న లిస్టెడ్‌ కంపెనీలు మొత్తం మూడే ఉన్నాయి. వీటిలో సౌదీ అరామ్‌కో ఒకటి కాగా ఆపిల్‌(1.19 లక్షల కోట్ల డాలర్లు), మైక్రోసాఫ్ట్‌(1.15 లక్షల కోట్ల డాలర్లు) తర్వాత నిలిచాయి. ఆల్ఫాబెట్‌(మార్కెట్‌ విలువ 92,600 కోట్ల డాలర్లు) అమేజాన్‌(86200 కోట్ల డాలర్లు), ఫేస్‌బుక్‌(57200 కోట్ల డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ప్రస్తుత ఐపీఓతో సౌదీ అరామ్‌కో కేవలం 1.5 శాతం వాటాను విక్రయించింది. మిగిలిన వాటా సౌదీ రాజ్యం చేతిలో ఉంది. ఇతర బడా కంపెనీల్లో అత్యధిక శాతం వాటా ఈక్విటీ షేర్‌ హోల్డర్ల చేతిలో ఉంటుంది. ఐపీఓతో వచ్చిన సొమ్మును మరిన్ని ఆదాయ మార్గాల్లో పెట్టుబడిగా పెడతామని సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పబ్లిక్‌ ఆఫర్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు సంస్థాగత ఇన్వెస్టర్ల వాటాలో 23 శాతం కేటాయించారు. 



You may be interested

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ బంపర్‌ లిస్టింగ్‌..!?

Wednesday 11th December 2019

50శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ అంటున్న విశ్లేషకులు   ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ బంపర్‌గా లిస్టయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఐపీఓ విజయవంతమైన నేపథ్యంలో ఇప్పుడు ఇప్పడు మార్కెట్‌ వర్గాల దృష్టి లిస్టింగ్‌పై పడింది. రేపు జరిగే(డిసెంబర్‌ 12న) జరిగే లిస్ట్‌లో ఇష్యూ ధర రూ.37లతో పోలిస్తే 50శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ జరగవచ్చని నిపుణలు అంచనా వేస్తున్నారు. సుమారు రూ.750 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌

స్థిరంగా పసిడి

Wednesday 11th December 2019

అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ఒకడాలరు స్వల్పలాభంతో 1,469 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  చైనా దిగుమతులపై అమెరికా రెండో దఫా సుంకాల విధింపు ఈ వారం చివరి రోజు(డిసెంబర్‌ 15న) అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ట్రేడర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే నేటి రాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌

Most from this category