News


సంజీవ్‌ భాసిన్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Wednesday 26th June 2019
Markets_main1561544919.png-26595

ప్రస్తుత మార్కెట్లో మదర్‌సన్‌ సుమి, అపోలోటైర్స్‌, ఎక్సైడ్‌ షేర్లను రికమండ్‌ చేస్తున్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌భాసిన్‌ చెప్పారు. లార్జ్‌క్యాప్స్‌లో భెల్‌ బాగుందన్నారు. పోర్టుఫోలియోలో వీటికి 5- 7 శాతం వరకు వాటా ఇవ్వచ్చన్నారు. రంగాల వారీగా ఒఈఎం రంగం ఆటో రంగం కన్నా ముందు బాటమ్‌ అవుట్‌ అవుతోందన్నారు. అందువల్ల ఈ రంగానికి చెందిన పైన పేర్కొన్న మూడు స్టాకులు మంచి ప్రదర్శన చూపుతాయని అంచనా వేశారు. రాబోయే పండుగ సీజన్‌లో ఈ స్టాకుల మంచి సంపద సృష్టిస్తాయన్నారు. ప్రభుత్వం ప్రకటించబోయే కొన్ని కీలక నిర్ణయాలు ఈ రంగంలో ఉత్తేజాన్నిస్తాయని చెప్పారు. లార్జ్‌క్యాప్స్‌లో భెల్‌ క్యాపెక్స్‌ పరంగా పునరుజ్జీవం చూడనుందన్నారు. వచ్చే ఏడాదిలో ఈ షేరు రూ. 100 వరకు చేరినా ఆశ్చర్యం లేదన్నారు. గతేడాది అందరూ పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీపై నెగిటివ్‌గా ఉన్నప్పుడు తాము వాటిని కొనుగోలు చేశౠమని, ఈ రెండు షేర్లు తమకు మంచి రాబడి ఇచ్చాయని తెలిపారు. ఇప్పటికీ ఈ షేర్లు బలంగానే ఉన్నాయన్నారు. పీఎస్‌యూ షేర్లలో సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను ఎంచుకోవచ్చన్నారు. లేదంటే విడిగా ఇంజనీర్స్‌ ఇండియా, ఎన్‌బీసీసీ, బీఈఎల్‌, ఐజీఎల్‌, గెయిల్‌ షేర్లను ఎంచుకోవచ్చని సూచించారు. రాబోయే రెండేళ్లలో పీఎస్‌యూ షేర్లు అద్భుత ప్రదర్శన చూపుతాయని అంచనా వేశారు. యూఎస్‌ ఫెడ్‌పై ట్రంప్‌ ఒత్తిడి పనిచేస్తోందని, త్వరలో అక్కడి వడ్డీరేట్లు 2 శాతం దిగువకు వస్తాయని అంచనా వేశారు. ఇదే జరిగితే డాలర్‌ బాగా బలహీన పడవచ్చన్నారు. అప్పుడు వర్దమాన మార్కెట్లు బాగా రాణిస్తాయని చెప్పారు. బంగారం విషయంలో దేశీయ మార్కెట్ల పరంగా పెద్దగా బుల్లిష్‌నెస్‌ ఉండకపోవచ్చని, భారత మార్కెట్లో కొనుగోలుదారుల కన్నా అమ్మకందారులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. బంగారంపై పెట్టుబడి కన్నా సిప్‌ల్లో పెట్టుబడి మంచి ఫలితాలనిస్తుందన్నారు. రాబోయే కాలంలో లిక్విడిటీ పెరగడం మూలాన ఈక్విటీలు బాగా బుల్లిష్‌గా ఉంటాయని అంచనా వేశారు. You may be interested

జలాన్‌ కమిటీతో పనిలేకుండానే రీక్యాప్‌?!

Wednesday 26th June 2019

బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఆర్‌బీఐ వద్ద మిగులు నిధులను కేంద్రానికి ఇచ్చి అటు నుంచి పీఎస్‌యూ బ్యాంకులకు రీక్యాప్‌ చేయాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే జలాన్‌ కమిటీ నివేదిక వాయిద పడిన సందర్భంలో దీనికోసం వేచిచూడకుండా బడ్జెట్లో కొంత మొత్తాన్ని పీఎస్‌బీల రీక్యాప్‌కు అందించాలని కొత్త విత్తమంత్రి భావిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్లో పీఎస్‌బీల రీక్యాప్‌ కోసం 35-40 వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎకానమీలో క్రెడిట్‌

రెండోరోజూ అదే జోరు

Wednesday 26th June 2019

మార్కెట్‌ ర్యాలీ రెండోరోజూ కొనసాగింది. సూచీలు బుధవారమూ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 157 పాయింట్ల లాభంతో39,592 వద్ద. నిప్టీ 51.10 పాయింట్లు పెరిగి 11,847.55 వద్ద స్థిరపడ్డాయి. నైరుతి రుతుపవనాలు శరవేగంగా ఉత్తర, మధ్య భారతదేశమంతటా విస్తరించాయనే ఐఎండీ ప్రకటన, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటం తదితర సానుకూలాంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇంట్రాడేలో మెటల్‌, ఫార్మా, బ్యాంకింగ్‌,

Most from this category