News


ఐటీ కంటే ఫార్మా సానుకూలం: భాసిన్‌

Friday 15th November 2019
Markets_main1573841568.png-29623

ఐటీ కంటే ఫార్మా రంగం పట్ల సానుకూలతను వ్యక్త పరిచారు ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. ఫార్మా రంగంలో సన్‌ ఫార్మా, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లను ఆయన సూచించారు. ఐటీ రంగంలో ఒక్క విప్రో షేరును మాత్రం తాను కొనుగోలు చేస్తానని పేర్కొన్నారు. పలు మార్కెట్‌ అంశాలపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. 

 

ఫార్మాలో వేటి పట్ల సానుకూలం?
మూడు ‍స్టాక్స్‌పై అధిక వెయిటేజీతో ఉన్నాం. అవి సన్‌ ఫార్మా, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌. సన్‌ఫార్మా ఫలితాలు అంచనాలకు మించి ఉన్నాయి. వ్యాపార పరంగా పుంజుకునే దశలో కంపెనీ ఉందని భావిస్తున్నాం. లుపిన్‌ తన జపాన్‌ వ్యాపారాన్ని విక్రయించింది. దీంతో రుణభారం తగ్గిపోనుంది. అమెరికా కంటే ఇతర భౌగోళిక ప్రాంతాలపై కంపెనీ దృష్టి సారిస్తోంది. డాక్టర్‌ రెడ్డీస్‌ యూరోప్‌ వ్యాప్తంగా, బయట కూడా మంచి పనితీరు చూపిస్తోంది. సమీప కాలంలో బలహీన రూపీ వీటికి కలసిరానుంది. ఐటీ కంటే ఈ కంపెనీల పట్లే సానుకూలంగా ఉన్నాం. 

 

ఐటీసీ కొనుగోలుకు ఇది సమయమా?
అవును. ఇది మీ సహనాన్ని పరీక్షిస్తోంది. ఏడాదికి పైగా ఈ స్టాక్‌ను మేం సూచిస్తున్నాం. కానీ, ఇప్పటికీ రాబడులు ఇచ్చింది లేదు. కానీ, రిలయన్స్‌ ఏడేళ్లుగా ఎటువంటి రాబడులు ఇవ్వలేదు. కానీ, ఆ తర్వాత రెండున్నరేళ్లలో 2.5 రెట్లు పెరిగింది. మైక్రోసాఫ్ట్‌ ఎనిమిదేళ్లుగా ఫ్లాగ్‌గా ఉండి, గత రెండున్నరేళ్లలో 3.5 రెట్లు పెరిగింది. రానున్న మూడేళ్లలో 100 బిలియన్‌ డాలర్ల కంపెనీగా అవతరించే ఏకైక కంపెనీ ఐటీసీనే. వచ్చే దీపావళికి రూ.350కి పైన ఉంటుందని అంచనా వేస్తున్నాం. 

 

టెలికం రంగం విశ్లేషణ...
జియో బోటమ్‌లైన్‌ను పరిశీలిస్తే.. రూ.179 ప్యాక్‌ వ్యాలిడిటీని తగ్గించారు. అంటే ఏఆర్‌పీయూ అన్నది ధరల పెరుగుదలతో మార్కెట్‌ వ్యాప్తంగా అధికం కానుంది. వాడుకునే డేటాకు మరింతగా చెల్లించాల్సి రావచ్చు. అంటే రానున్న మూడు నాలుగు త్రైమాసికాల్లో లాభదాయక బలంగా ఉండనుంది. ప్రభుత్వం తప్పకుండా ఈ రంగానికి ఓ ప్యాకేజీని ప్రకటిస్తుందని నా అంచనా. ఈ రంగంపై ఎంతో సానుకూలంగా ఉన్నాం. రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ గణనీయమైన వాటాను సొంతం చేసుకుంటాయి. ప్రభుత్వం నుంచి వొడాఫోన్‌ కొంత ఉపశమనం పొందినప్పటికీ, సవాళ్లను ఎదుర్కోవడం కొనసాగొచ్చు. You may be interested

ఫండ్‌ మేనేజర్లు ప్రధానంగా కొన్న షేర్లివే..

Friday 15th November 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఏఎంసీలు) నిర్వహణలోని ఆస్తులు అక్టోబర్‌లో 7 శాతం పెరిగాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక మాత్రం 5 నెలల కనిష్టానికి చేరింది. మార్కెట్లలో ఇటీవలి కాలంలో అనిశ్చితులు పెరిగిపోయిన విషయం తెలిసిందే. పైగా గత ఏడాదిన్నర కాలంలో చూసుకుంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లో అధిక శాతం ఫండ్స్‌ ఇచ్చిన రాబడులు ఒక అంకెలోపే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడుల రాక తగ్గడం గమనార్హం. సెప్టెంబర్‌ నెలలో

బ్యాంకుల నెత్తిన టెల్కోల పిడుగు!?

Friday 15th November 2019

ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌కు భారీగా రుణాలిచ్చిన బ్యాంకులు ప్రభుత్వ సాయం అందకుంటే ఇక్కట్లేనంటున్న నిపుణులు సుప్రీంకోర్టు తాజాతీర్పుతో ఏజీఆర్‌ రూపంలో టెలికం కంపెనీల నెత్తిన పడిన ఆర్థిక భారం అంతిమంగా బ్యాంకులను చుట్టుకోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏజీఆర్‌ తీర్పుతో క్యు2లో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు ఉమ్మడిగా దాదాపు రూ. 74వేల కోట్ల నష్టం ప్రకటించాయి. దీంతో ఈ రెండిటికి అప్పులిచ్చిన బ్యాంకుల పరిస్థితి ఎలాఉంటుందోనన్న అనుమానాలు పెరిగాయి. ఈ రెండు కంపెనీలకు కలిపి

Most from this category