News


నాలుగు ఎన్‌బీఎఫ్‌సీలపై ఐఐఎఫ్‌ఎల్‌ బుల్లిష్‌

Thursday 27th September 2018
Markets_main1538036049.png-20644

సాధారణంగా మార్కెట్లో అందరూ భయపడే వేళ కొనుగోళ్లకు మంచి తరుణమని నిపుణుల సూచిస్తుంటారు. అయితే నిప్పు లేనిదే పొగరాదని, అందువల్ల ఇటీవల నెగిటివ్‌ వార్తలతో క్రాష్‌ అయిన కంపెనీల జోలికి పోకపోవడం మంచిదని ఐఐఎఫ్‌ఎల్‌ సూచిస్తోంది. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీల్లో భారీగా పతనమైన కంపెనీల షేర్లను వదిలి బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఈక్విటాస్‌ షేర్లను ఎంచుకోవాలని సూచించింది. ఈ నాలుగూ బాగా స్థిరమైన ప్రదర్శన చూపే సత్తా ఉన్న కంపెనీలని తెలిపింది. ఈ నాలుగు షేర్లు ప్రస్తుతం ఆకర్షణీయమైన రేట్ల వద్ద ఉన్నాయని తెలిపింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ విషయంలో ఎటూ చెప్పలేమని, ట్రేడర్లు ఈ షేరు ఓవర్‌సోల్డ్‌ ప్రాంతంలో ఉంది కాబట్టి కొనవచ్చంటారని, సంస్థపై వచ్చిన పుకార్లు సద్దుమణిగేవరకు దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లు భావిస్తారని, అందువల్ల ఈ షేరుకు దూరంగా ఉంటున్నామని తెలిపింది. రిస్కు తీసుకోదలిస్తే ఎంటర్‌కావచ్చని సూచించింది. 
యస్‌ బ్యాంక్‌పై
ఒక్క మనిషిపై ఒక బ్యాంకు భవిష్యత్‌ ఆధారపడడం మంచిది కాదని ఐఐఎఫ్‌ఎల్‌ వ్యాఖ్యానించింది. రేపనేదే లేనట్లు ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, రిటైలర్లు యస్‌ బ్యాంకు షేరును భారీఎత్తున కొన్నారని, ఇప్పుడు కేవలం ఒక్క వ్యక్తిపై వచ్చిన వార్తలతో షేరు కుప్పకూలిందని చెప్పారు. అయితే ప్రస్తుత కరెక‌్షన్‌ అనంతరం రూ.220 స్థాయిల్లో షేరు ఆకర్షణీయంగానే ఉందని తెలిపింది. వచ్చే ఏడాదికి రూ. 325 టార్గెట్‌ను ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఐటీ? ఫార్మా?
గత రెండు వారాలుగా ఐటీ స్టాకుల్లో వచ్చిన ర్యాలీలో ప్రాఫిట్‌ బుకింగ్‌ చేశామని ఐఐఎఫ్‌ఎల్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ రంగంపై అండర్‌వెయిట్‌గా ఉన్నట్లు తెలిపింది. రూపీ క్షీణతతో ఐటీకి వచ్చే ప్రయోజనాలు మార్కెట్లో ప్రైస్‌ఇన్‌ అయ్యాయని తెలిపింది. వచ్చే ఏడాది ఫార్మా మంచి ప్రదర్శన చూపవచ్చని అంచనా వేసింది. ఈ రంగంపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు పేర్కొంది. ఈ రంగంలో ఎలాంటి పతనం వచ్చినా కొనుగోళ్లకు అవకాశంగా భావించాలని సూచించింది. 



You may be interested

రివర్స్‌ గేర్‌లో మార్కెట్‌

Thursday 27th September 2018

స్టాక్‌ మార్కెట్‌ రివర్స్‌ గేర్‌ తీసుకుంది. లాభాలతో ప్రారంభమైన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 11,000 మార్క్‌ దిగువకు వచ్చేసింది. మధ్యాహ్నాం 1:56 సమయంలో సెన్సెక్స్‌ 205 పాయింట్ల నష్టంతో 36,338 పాయింట్ల వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల నష్టంతో 10,979 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఎఫ్‌అండ్‌వో ఫ్యూచర్స్‌ ఎక్స్‌పైరీ, క్రూడ్‌ ధరల పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ ఆందోళనలు, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను కోల్పోవడం, ఫెడ్‌ రేట్ల పెంపు

క్రూడ్‌, ఎన్నికలే మార్కెట్లకు ముప్పు

Thursday 27th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు గత రెండు వారాల నుంచి కన్సాలిడేట్‌ అవుతూ వస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ ఆందోళనలు, రూపాయి ఒడిదుడుకులు, క్రూడ్‌ ధరల పెరుగుదల కారణంగా అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. క్రూడ్‌ ధరలు మూడంకెల స్థాయికి చేరితే, ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వెలువడితే అప్పుడు మార్కెట్లకు ప్రస్తుత స్థాయిలే గరిష్టమని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ ఎండీ నిలేశ్‌ షా తెలిపారు.  ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 82

Most from this category