News


మూడు బ్యాంకు స్టాక్స్‌పై ఐఐఎఫ్‌ఎల్‌ బుల్లిష్‌

Sunday 13th October 2019
Markets_main1570991106.png-28849

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు స్టాక్స్‌ పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. నవంబర్‌ నెల మొదటి పది రోజుల్లో నిఫ్టీ 12,000 స్థాయిలో ఉంటుందని అంచనా వేశారు. 2020లో మార్కెట్లు అసలైన మంచి పనితీరు కనబరుస్తాయని చెప్పారాయాన. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.  

 

ఇన్‌ఫ్రా, వ్యవసాయం, రైల్వేలకు ప్రభుత్వం వైపు నుంచి మంచి మద్దతు ఉన్నట్టు సంజీవ్‌ భాసిన్‌ చెప్పారు. టెలికం రంగం సైతం ధరల విధ్వంసం నుంచి బయటపడడం బ్యాంకులకు సానుకూలమేనన్నారు. బ్యాంకుల్లో రుణ వ్యయాలు, విశ్వాసలేమి ముగింపునకు వచ్చినట్టు చెప్పారు. నవంబర్‌ నుంచి మంచి సానుకూల బుల్‌ మార్కెట్‌ ఉంటుందని, ఇందులో అన్ని రంగాలు పాల్గొంటాయని మరోసారి తన గత అంచనాలను కొనసాగించారు. మిడ్‌క్యాప్‌లో చాలా స్టాక్స్‌ అధిక అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయని, వీటి విలువల పరంగా చూస్తే వచ్చే 18 నెలల కాలంలో మంచి రాబడులను ఇస్తాయన్నారు. వచ్చే ఒకటి రెండు వారాలకు కాకుండా, రానున్న 18 నెలల కాలంపై తాను మార్కెట్‌ ర్యాలీ విషయంలో నమ్మకంగా ఉన్నట్టు చెప్పారు. అమెరికా-చైనా మధ్య డీల్‌ కుదిరితే అది టాటా మోటార్స్‌కు మంచి సానుకూల పరిణామంగా భాసిన్‌ పేర్కొన్నారు. ఎందుకంటే జేఎల్‌ఆర్‌కు చైనా మార్కెట్‌ ముఖ్యమైనదనే విషయం తెలిసిందే. 

 

ఐటీ రంగంలో గొప్ప పనితీరును ఇప్పటికే చూసేశామన్నారు సంజీవ్‌ భాసిన్‌. టీసీఎస్‌ పట్ల తక్కువ ప్రాధాన్యం కలిగి ఉన్నట్టు, ఇండస్ట్రియల్‌ బ్యాంకుల పట్ల తాను బుల్లిష్‌గా ఉన్నానని తెలిపారు. ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో బలహీనతకు వాణిజ్య వాహన రుణ విభాగంలో అతిపెద్ద సంస్థగా ఉండడం కారణమన్నారు. భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ను విలీనం చేసుకోవడం నుంచి సానుకూల ఫలితాలను పొందుతోందని చెప్పారు. వచ్చే 18 నెలల కాలం ఇండస్‌ఇండ్‌ బ్యాంకుకు సానుకూలంగా ఉంటుందని అంచనా వేశారు. దీర్ఘకాలానికి మంచి పెట్టుబడి సాధనం అవుతుందన్నారు. స్వల్ప కాలంలో రూ.1,200 బోటమ్‌గా ఉంటుందని, 2020లో మంచి పనితీరును ఈ స్టాక్‌లో చూడొచ్చని వివరించారు. మిడ్‌క్యాప్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, లార్జ్‌క్యాప్‌లో యాక్సిస్‌ బ్యాంకు స్టాక్స్‌ పట్ల భాసిన్‌ బుల్లిష్‌ వ్యక్తం చేశారు. యాక్సిస్‌ బ్యాంకు ప్రీమియం ధరకు నిధులు సమీకరించిందని ఇది ఎంతో సానుకూలమన్నారు. ఎస్‌బీఐలోనూ రూ.245 వద్ద ఇన్వెస్ట్‌ చేయడం పొరపాటు అవదన్నారు. ఆర్‌బీఎల్‌ బ్యాంకు సైతం రిస్క్‌ తీసుకునే వారికి మంచి రాబడులను ఇచ్చే స్థాయిలో ఉందన్నారు. వచ్చే ఏడాది కాలంలో  ఈ స్టాక్‌లో 25 శాతం రాబడులకు అవకాశం ఉండొచ్చన్న అంచనా వేశారు.  You may be interested

అల్యూమినియం స్టాక్స్‌ ర్యాలీ ఎప్పుడు..?

Sunday 13th October 2019

లండన్‌ మెటల్‌ ఎక్సేంజ్‌ (ఎల్‌ఎంఈ)లో మూడేళ్ల కనిష్ట స్థాయికి అల్యూమినియం ధరలు చేరాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు, ఆటోమొబైల్‌ రంగం నుంచి డిమాండ్‌ తగ్గడం వంటి అంశాలు అల్యూమినియంపై చూపిస్తున్నాయి. అమెరికా-చైనా ఒకరిపై ఒకరు టారిఫ్‌లు వేసుకోవడం మొదలైన తర్వాత.. 2018 మధ్య నుంచి ఇప్పటి వరకు ఎల్‌ఎంఈలో అల్యూమినియం ధరలు 28 శాతం పడిపోయాయి. ఇక అంతర్జాతీయంగానూ వృద్ధి పరిస్థితులు సన్నగిల్లుతుండడం, మాంద్యం వచ్చే అవకాశాలున్నాయన్న ఆందోళనలను

టీసీఎస్‌ Vs ఇన్ఫోసిస్‌.. ఎలా ఉన్నాయి?

Saturday 12th October 2019

క్యు2లో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ కన్నా ఇన్ఫోసిస్‌ మెరుగైన ఫలితాలను ప్రకటించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్యు2లో ఇన్ఫీ తన పూర్తి సంవత్సర గైడెన్స్‌ను 9 నుంచి 10 శాతానికి పెంచింది. ఈ ఏడాది ఆరంభంలో ఇన్ఫీ కన్నా వాల్యూషన్లలో ప్రీమియం సంపాదించిన టీసీఎస్‌ ప్రస్తుతం ఈ ప్రీమియం మొత్తం కోల్పోయిందని నిర్మల్‌బ్యాంగ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇందుకు తగ్గట్లే ఇన్ఫీ సైతం డిజిటల్‌ విభాగంలో మంచి వృద్ధి సాధిస్తామని చెబుతోంది. మరోవైపు

Most from this category