News


కోటక్‌ సెక్యూరిటీస్‌ టాప్‌ 3 సిఫార్సులు

Friday 29th November 2019
Markets_main1575018537.png-29954

ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు, పీఎస్‌బీల్లో ఎస్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీల్లో బజాజ్‌ ఫైనాన్స్‌ షేరుపై పాజిటివ్‌గా ఉన్నామని కోటక్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌ జర్బాడే చెప్పారు. కార్పొరేట్‌ బ్యాంక్స్‌లో ఎన్‌పీఎల్‌ బలహీనంగా ఉన్నందున వీటిపై పాజిటివ్‌గా ఉన్నామన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐలు ఇటీవల మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. రాబోయే ఏడాదికూడా వీటి నుంచి మంచి ఫలితాలు ఆశించవచ్చన్నారు. వాహనాల ఫైనాన్సింగ్‌ చేసే ఎన్‌బీఎఫ్‌సీలు ఇకపై కొంత నెగిటివిటీ చూడవచ్చన్నారు. వాహన విక్రయాల్లో మందగమనమే ఇందుకు కారణమన్నారు. అయితే ఈ రంగంలో కూడా బజాజ్‌ ఫైనాన్స్‌ను ఎంచుకోవచ్చని, ఈ కంపెనీ ఎక్కువగా కన్జూమర్‌ డ్యూరబుల్‌ లోన్స్‌ ఇస్తుందని చెప్పారు. కంపెనీ బాలెన్స్‌ షీటు బాగుందన్నారు. ప్రస్తుతం వాల్యూషన్ల కారణంగా కొంత వెనుకంజ ఉన్నా లాంగ్‌టర్మ్‌కు ఎంచుకోవచ్చన్నారు. 
టెలికం రంగం ప్రస్తుతం అత్యావశ్యక సేవలరంగం కింద మారిందని, అలాంటి రంగంలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని చెప్పారు. వీటిలో ఒకటి త్వరలో తప్పుకుంటామన్న సంకేతాలు ఇస్తోందన్నారు. అదే నిజమైతే ఎయిర్‌టెల్‌, జియో మాత్రమే రంగంలో ఉంటాయన్నారు. వొడాఫోన్‌ ఐడియా నిలబడాలంటే ఏఆర్‌పీయూ 180కి చేరాల్సిఉందని చెప్పారు. ఈ రంగంలో కొంత కన్సాలిడేషన్‌ ఉండొచ్చని, త్వరలో పరిస్థితులు బాగుపడతాయని చెప్పారు. ఈ రంగంలో లాంగ్‌టర్మ్‌కు భారతీ ఎయిర్‌టెల్‌ను ఎంచుకోవచ్చన్నారు. 
ఆటో ద్విచక్రవాహన రంగంపై బేరిష్‌గా ఉన్నట్లు సంజీవ్‌ చెప్పారు. అయితే పాసింజర్‌ వాహనాల రంగంపై కొంత పాజిటివ్‌గానే ఉన్నామన్నారు. ఈ రంగంలో మారుతీని వాణిజ్యవాహన రంగంలో అశోక్‌ లేలాండ్‌ను ఎంచుకోవచ్చని అభిప్రాయపడ్డారు. మార్చి ఏప్రిల్‌ సమయానికి ఆటో అమ్మకాల్లో మెరుగుదల స్పష్టంగా కనిపించే ఛాన్సుందన్నారు. 



You may be interested

రిలయన్స్‌ రిఫైనింగ్‌ లాభాలను జియో అధిగమిస్తుంది

Friday 29th November 2019

‘రిలయన్స్‌ జియో లాభాలు, రిలయన్స్‌ రిఫైనింగ్‌, పెట్రోకెమికల్‌ పాలిమర్‌ వ్యాపారాల లాభాలను అధిగమిస్తుంది. దీని ప్రభావం కంపెనీ షేరు ధరలో కనిపిస్తుంది’ అని ఎండీ, కేఆర్‌ చోక్సి, దేవన్‌ చోక్సి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. రిలయన్స్‌ జియో హవా..   రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వినియోగధారిత వ్యాపారాలైన జియో, రిటైల్‌ ముందుకెళ్లేకొద్ది మరింతగా లాభాలను తెచ్చిపెడతాయి. రిలయన్స్‌ జియో అందించే లాభాలు 2021 లో, ప్రస్తుతం

లాభాల స్వీకరణ: సెన్సెక్స్‌ 466 పాయింట్లు క్రాష్‌

Friday 29th November 2019

134 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీల జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ట్రేడర్ల లాభాల స్వీకరణకు తోడు నేడు దేశీయ రెండో క్వార్టర్‌ జీడీపీ గణాంకాలల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సూచీలు మిడ్‌ సెషన్‌ కల్లా భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆసియా మార్కెట్లతో పాటు, అమెరికా ఫ్యూచర్ల నష్టాల ట్రేడింగ్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒకదశలో సెన్సెక్స్‌ 466 పాయింట్లను కోల్పోయి

Most from this category