News


ఆటోమొబైల్‌ షేర్లపై పాజిటివ్‌

Tuesday 5th November 2019
Markets_main1572944371.png-29367

‘టాటా మోటర్స్‌, అశోక్‌ లేలాండ్‌, మారుతి సుజుకీ, ఐషర్‌ మోటర్స్‌ స్టాకులపై బై కాల్‌ ను కలిగివున్నాం. అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి హీరో, బజాజ్‌ ఆటోపై సానుకూలంగా ఉన్నాం’ అని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యురిటీస్‌, డైరక్టర​ సంజయ్‌ భాసిన్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. 

ప్ర: మార్కెట్లు గరిష్ఠ స్థాయిలకు చేరుతున్నాయి, సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఏం జరుగుతుంది?
సంజయ్‌ భాసిన్‌: 10,700 స్థాయి వద్ద నిఫ్టీ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అప్పుడు ఎఫ్‌ఐఐ(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు)లు నికర అమ్మకం దారులుగా ఉన్నారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లోకి విదేశీ నిధుల ప్రవాహం పెరిగింది. నిఫ్టీ కొత్త గరిష్ఠానికి చేరువలో ఉంది. సాధరణంగా గరిష్ఠ స్థాయిల వద్ద మ్యూచువల్‌ ఫండ్స్‌ స్వల్ప మొత్తంలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపే అవకాశం ఉంది. అందువలన మార్కెట్లు గరిష్ఠ స్థాయిలకు చేరుతున్నప్పటికి సంస్థాగత ఇన్వెస్టర్లు కొంత వరకు అమ్మకాలకు మొగ్గు చూపవచ్చు. కానీ ఎఫ్‌ఐఐలు సాధరణంగా తక్కువగా స్థాయిల వద్ద అమ్మకాలకు, గరిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మార్కెట్‌లోకి నిధుల ప్రవాహాం పెరుగుతుందని అంచనా వేస్తున్నా. 12,000 స్థాయి వద్ద కన్సాలిడేషన్‌ జరిగే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత విస్తృత మార్కెట్‌పై సానుకూలంగా ఉన్నాను. ఈ రోజు కాకపోతే రేపు, మనం 12,000 స్థాయికి దగ్గర్లో ఉన్నాం. 2017 లో మిడ్‌క్యాప్‌లు ఏవిధంగా మెరిశాయో అదేవిధంగా 2020 లో కూడా ఇవి కీలకంగా ఉండనున్నాయి. 

ప్ర: ఎఫ్‌ఐఐలు ఎల్లప్పుడు కనిష్ఠాల వద్ద అమ్ముతారు, గరిష్ఠాల వద్ద కొనుగోలు చేస్తారని ఏలా చెప్పగలరు? గత 15-20 ఏళ్ల నుంచి ఎఫ్‌ఐఐలు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడున్న చాలా వరకు బ్లూచిప్‌ స్టాకుల ఫ్రీ ప్లోటింగ్‌ అధికంగా ఎఫ్‌ఐఐల అధినంలోనే ఉంది. ఏసియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి మంచి ప్రధర్శన చేస్తున్న కంపెనీలు ఎఫ్‌ఐఐల ఆధినంలో ఉన్నవే!
భాసిన్‌:  నిజమే. అది అలా జరిగింది. కానీ యస్‌ బ్యాంక్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఇండియాబుల్స్‌ వంటి కంపెనీలలో కూడా ఎఫ్‌ఐఐలే అధిక వాటాను కలిగివున్నారు. వారి స్వభావాన్ని తప్పుబట్టడం లేదు. నిధుల ప్రవాహంలో ఇదొక మార్గం. గత సమాచారాన్ని పరిశీలిస్తే ఎఫ్‌ఐఐలు మార్కెట్‌ బాటమ్‌ అయనప్పుడు అధికంగా అమ్మకాలు చేయగా, గరిష్ఠాల వద్ద కొనుగోలు చేశారనే విషయం అర్థమవుతుంది.  12,000 స్థాయి వద్ద కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికి, అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు బుల్‌ దృక్పథంలో ఉన్నాయి. వచ్చే 18 నెలలకు గాను పాజిటివ్‌గా ఉన్నాం. స్వల్ప కాల వ్యవధిలు, కంపెనీల లాభాలు, స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కొంత అభివృద్ధి  వంటి అంశాలు మార్కెటుకు ప్రతికూలంగా పనిచేయవచ్చు.

ప్ర: వాహనంలోని లోపాలను సవరించేందుకు ఎక్స్‌యూవీ 300 బ్యాచ్‌ యూనిట్లను  ఎం అండ్‌ ఎం తిరిగి వెనక్కి పిలుస్తోంది. వాహన విక్రయాల డేటా ఎలాగో సరిగ్గా లేదు.  బీఎస్‌ 6 వాహనాలకు మారినట్టయితే డిజిల్‌ వాహనాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. కంపెనీ యాజమాన్యం నుంచి కొంత సానుకూల వ్యాఖ్యానం రావడం చూశాం. దీనిపై మీ అభిప్రాయం?
భాసిన్‌: ఈ కంపెనీ మేనేజ్‌మెంట్‌ పై పూర్తి నమ్మకంతో  ఉన్నాం. ఆటో తయారి రంగంలో ఉన్న పురాతన కంపెనీలలో ఎం అండ్‌ ఎం ఒకటి. సెన్సెక్స్‌ ప్రారంభం నుంచి ఈ కంపెనీ తన గుర్తింపును నిలుపుకుంటోంది. ఎం అండ్‌ ఎం ట్రాక్టర్‌ అమ్మకాలు మార్కెట్‌ అంచనాలను దాటాయి. దీనికితోడు ట్రాక్టర్లకు సంబంధిం‍చి బీఎస్‌ 4 నుంచి బీఎస్‌ 6 మారవలసిన అవసరం లేకపోవడం సానుకూల అంశం. మేము ఎం అండ్‌ ఎం, నిర్థిష్టమైన ఆటో స్టాకులపై పాజిటివ్‌గా ఉన్నాం. అత్యంత అధ్వాన్న ప్రదర్శన చేసిన ఆటో సెక్టార్‌ కంపెనీలు గత రెండు నెలల నుంచి పుంజుకుంటున్నాయి. మారుతి సుజుకి రూ. 5,500 స్థాయి నుంచి రూ. 7,700 స్థాయికి చేరుకోగా, ఐషర్‌ మోటర్స్‌ రూ. 1,6000 నుంచి రూ. 23,000 స్థాయికి చేరుకుంది. మూడు నెలల కాల వ్యవధి కోసం మేము ఆటో సెక్టార్‌లో ఇన్వెస్ట్‌ చేయడం లేదు. 2020 లో ఆటో స్టాకులు లాభపడతాయని అంచనావేస్తున్నాం. టాటా మోటర్స్‌, అశోక్‌ లేలాండ్‌, మారుతి సుజుకీ, ఐషర్‌ మోటర్స్‌ స్టాకులపై బై కాల్‌ ను కలిగివున్నాం. అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి హీరో, బజాజ్‌ ఆటోపై సానుకూలంగా ఉన్నాం. 

ప్ర: మీరు 2020లో ఆటో స్టాకులు రాణిస్తాయని అన్నారు. కానీ చాలా వరకు రేటింగ్‌ ఎజెన్సీలు మీకు వ్యతిరేకమైన దృక్పథాన్ని చూపుతున్నాయి. మూడీస్‌ మదర్‌సుమి రేటింగ్‌ తగ్గించింది. వాహన అనుబంధ రంగాల స్టాకులపై మీ వైఖరేంటి?
భాసిన్‌: మదర్‌సుమి షేరు ధర డబుల్‌ డిజిట్‌లో ఉన్నప్పుడు, 100 స్థాయిలో ట్రేడవుతున్నప్పుడు పాజిటివ్‌గా ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ కంపెనీ యురోపియన్‌ మార్కెట్‌లో మరింత మార్కెట్‌ వాటాను సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. వారి చైనా వ్యాపారం కూడా బాగానే నడుస్తోంది. కొనుగోలు సిఫార్సులిచ్చిన స్థాయి నుంచి ప్రస్తుతం ఈ కంపెనీ స్టాకు 25 శాతం కదిలింది. ప్రస్తుత స్థాయిల నుంచి పడిపోతుందని అంచనా వేసేవారు వచ్చే రెండు మూడు  నెలల కోసం సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)ను ఆరంభించడం మంచిది. 2020 ప్రారం‍భం​ నాటికి మంచి రివార్డు లభిస్తుంది. కంపెనీ క్రెడిట్‌ విస్తరిస్తోంది. అంతేకాకుండా కంపెనీ లివరేజ్‌ కూడా తగ్గింది. ఈ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్‌ కంపెనీపై అధికంగా ఆధార పడకుండా తమ బాస్కెట్‌ను విస్తరిస్తోంది. సమీప భవిష్యత్తులో ఇది మంచి ప్రదర్శన చేస్తుందని అంచనా వేస్తున్నాం. 

ప్ర: యస్‌ బ్యాంక్‌ 1.2 బిలియన్‌ డాలర్ల బైండిగ్‌ బిడ్‌ను పొందింది. ఇతర మార్గాల ద్వార కూడా బ్యాంక్‌ నిధులను సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ కోలుకునే అవకాశాలు మెరుగయినట్టనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రూ.65-66 స్థాయిల వద్ద యస్‌ బ్యాంక్‌ షేరును మీరు కొనుగోలు చేస్తారా?
భాసిన్‌: ఖచ్చితంగా ఇది కాంట్రారియన్‌ ట్రేడ్‌ అవుతుంది. వచ్చే జనవరి నాటికి ఈ షేరు మూడంకెల సంఖ్యను చూస్తుందని అంచనావేస్తున్నాం. బ్యాంక్‌ అధ్వాన్న పరిస్థితి పూర్తయినట్టనిపిస్తోంది. ప్రస్తుతం యాజమాన్యం ఎంత తొందరగా నిధులను సమికరించగలరనేదే ముఖ్యం. ఈ నెల చివరి నాటికి బ్యాంక్‌ బైండిం‍గ్‌ బిడ్‌ను పొందే అవకాశం ఉంది. దీంతో పాటు ఫెడరల్‌ బ్యాంక్‌, డీసీబీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  వంటి మిడ్‌క్యాప్‌ స్టాకులు కూడా మంచి రిటర్న్‌లను ఇవ్వగలవు.  ఈ షేర్లను కొనుగోలు చేయమని సలహాయిస్తున్నాం. రిస్క్‌ తీసుకునే స్వభావం ఉంటే యస్‌ బ్యాంక్‌ను కూడా జోడించొచ్చు. కానీ ఈ ఐదు స్టాకులను మాత్రం మీ పోర్టుఫోలియోకి జోడించుకోవడం మర్చిపోవద్దు. వచ్చే దీపావళి నాటికి ఈ ఐదు స్టాకులు 30 శాతం నుంచి 40 శాతం వరకు పెరగలవు. 

ప్ర: మొత్తంగా ఏయే స్టాకులపై మీరు బుల్లిష్‌గా ఉన్నారు?
భాసిన్‌: ఐదు బ్యాంక్‌ల పేర్లను ముందే చెప్పాను. వీటితో పాటు గెయిల్‌, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌, హీరో మోటర్‌ కార్ప్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు మంచి స్థాయిలో ఉన్నాయి. వీటిపై సానుకూలంగా ఉన్నాం. ఫార్మా నుంచి లుపిన్‌, సన్‌ ఫార్మాపై బుల్లిష్‌గా ఉన్నాం. ఒక వేళ నా డబ్బును రిస్కున్న ఆస్తులలో ఇన్వెస్ట్‌చేయాలనుకుంటే, ఎల్‌1(తక్కువ బిడ్‌ చేసే కాంట్రాక్టర్లు) కాంట్రక్టులను ఎంచుకుంటా. మొత్తంగా మౌలిక రంగానికి సంబంధించి 7.5 లక్షల కాంట్రాక్టులు రానుండగా, 1.5 లక్షల కాంట్రాక్టులు పట్టాలెక్కాయి. దిలిప్‌ బుల్డ్‌కాన్‌, ఎన్‌బీసీసీ, ఎన్‌సీసీ వంటి కంపెనీలలోకి ఆర్డర్‌ ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగడంతో ప్రభుత్వ ఆర్డర్లు తగ్గాయి. అందువలన ఈ రంగంలో వాల్యుషన్లు సౌకర్యంగా ఉన్నాయి. You may be interested

ఈ-పాన్‌ ఇక సులభం

Tuesday 5th November 2019

ఆధార్‌ కార్డు డేటా బేస్‌లోని సమాచారాన్ని వినియోగించుకోని, ఆన్‌లైన్‌లో పాన్‌ కార్డును జారీ చేసేందుకు ఆదాయపన్ను శాఖ సిద్ధమవుతుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. వచ్చే కొన్ని వారాలలో  ఎలక్ట్రానిక్‌ పాన్‌(ఈ-పాన్‌) సౌకర్యాన్ని ప్రారంభించాలని ఆదాయ శాఖ ప్రణాళికలు వేస్తోందని, ఇప్పటికే గత ఎనిమిది రోజులలో 62,000 ఈ-పాన్‌లను పైలేట్‌ ప్రాజెక్ట్‌గా జారీ చేసిందని ఈ పత్రిక తెలిపింది. ‘రియల్‌ టైంకు చేరువలో’ భాగంగా ఈ సేవలను ఉచితంగా అందుబాటులోకి

ఎంఎస్‌సీఐ నుంచి ఈ షేర్ల తొలగింపు?!

Tuesday 5th November 2019

రుణభారం ఎక్కువ ఉన్న కంపెనీలే టార్గెట్‌... బ్రోకరేజ్‌ల అంచనా ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌స్టాన్లీ కాపిటల్‌  ఇంటర్నేషనల్‌) సూచీ నుంచి భారీ రుణభారంతో సతమతమవుతున్న దేశీయ కంపెనీల షేర్లను ఈ వారంలో తొలగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. బాగా అప్పులపాలై ఉన్న వొడాఫోన్‌ ఇండియా, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా లాంటి షేర్లకు ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌ నుంచి ఉద్వాసన తప్పదని బ్రోకరేజ్‌లు అభిప్రాయపడుతున్నాయి. ఇలా రుణభారంతో సతమతమయ్యే కంపెనీల షేర్లు చాలా వరకు ఇటీవల

Most from this category