News


సంవత్‌ ‘2075’ కలిసొస్తుంది..

Tuesday 6th November 2018
Markets_main1541500053.png-21762

సంవత్‌ 2075 ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తుందని ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా ఫౌండర్‌, సీఈవో పొరింజు వెలియత్‌ తెలిపారు. కరెక‌్షన్‌కు గురైన, బాగా పడిపోయిన స్టాక్స్‌ మళ్లీ పెరుగుతాయని ధీమా వ్యక్తంచేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల ఈ విషయాలు వెల్లడించారు. ‘సంవత్‌ 2075 ప్రారంభమౌతోంది. మంచి ఆరంభం ఉంటుందని భావిస్తున్నా. ప్రస్తుతం మనం ఓవర్‌సోల్డ్‌ మార్కెట్‌లో ఉన్నాం. గత దీపావళి రోజున మార్కెట్‌లో ఓవర్‌బాట్‌, అధిక వ్యాల్యుయేషన్స్‌ వంటి పరిస్థితులు ఉన్నాయి. సంవత్‌ 2075 ఇన్వెస్టర్లకు కచ్చితంగా లాభాలను అందిస్తుంది. కొత్త ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. రానున్న కాలంలో మంచి రిటర్న్స్‌ అందించే మార్కెట్‌ను చూడబోతున్నాం’ అని వివరించారు. చాలా స్టాక్స్‌లో దిద్దుబాటు చోటుచేసుకోవడం, మార్కెట్లు బాగా పడిపోవడం వల్ల ఇన్వెస్టర్లలో నిరాశావాదం ఇంకా ఉందన్నారు. మార్కెట్‌ ఎంత ఎక్కువ పతనమైతే.. అప్పుడు పెట్టుబడులకు అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయని తెలిపారు. పడిపోయిన స్టాక్స్‌లో ఇప్పటికే కొన్ని రికవరీ అయ్యాయని గుర్తుచేశారు. మార్కెట్‌ బాటమ్‌ ఔట్‌ అయ్యిందని తెలిపారు. అయితే ఇక కరెక‌్షన్‌ ఉండదని చెప్పలేమన్నారు. స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేశానని, చాలా ఇన్వెస్ట్‌మెంట్లను కోల్పోవలసి వచ్చిందన్నారు. అయితే మళ్లీ మంచి రోజులు వస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. బాగా పతనమైన స్టాక్స్‌ రానున్న కాలంలో అదిరిపోయే రిటర్న్స్‌ను అందిస్తాయని తెలిపారు.
దీర్ఘకాలంలో చూస్తే ఇండియన్‌ మార్కెట్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోందని పొరింజు వెలియత్‌ పేర్కొన్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం భారత్‌ అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు ఫలితాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులు పెరిగారని, జీఎస్‌టీ వసూళ్లు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఇండియన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతోందని పేర్కొన్నారు. రానున్న సంవత్సరాల్లో భారత్‌లో పటిష్టమైన ఫైనాన్షియల్‌ వ్యవస్థ ఆవిష్కృతమౌతుందని తెలిపారు. ఎన్‌పీఏ సమస్య మరికొంత కాలం కొనసాగినా కూడా, అనతి కాలంలో అది గతమౌతుందని పేర్కొన్నారు. ఎస్సార్‌ వంటి ఘటనలు భవిష్యత్‌పై ధీమాను పెంచుతున్నాయని తెలిపారు. హోటల్‌ విభాగంలో గత కొన్నేళ్లుగా ఓవర్‌సోల్డ్‌ పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల వచ్చే 2-3 ఏళ్లలో ఈ కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని సిఫార్సు చేశారు. భారత్‌లో వివిధ రంగాల్లో అవకాశాలు దశల వారీగా ఎల్లప్పుడూ ఉంటాయని, వాటిని అందిపుచ్చుకోవాలని తెలిపారు. ప్రతి రంగంలోనూ ఒడిదుడుకులు ఉంటాయని గుర్తుచేశారు.
  You may be interested

స్వల్ప లాభంతో ముగింపు

Tuesday 6th November 2018

ముంబై:- ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు...రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీఎసీస్‌, ఐసీఐసీఐ షేర్ల ర్యాలీతో మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అయిన్పటికీ, సెన్సెక్స్‌ 35వేల మార్కును కోల్పోయి 41 పాయింట్ల స్వల్పలాభంతో 34,992 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 6 పాయింట్లు పెరిగి 10,530 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, మీడియా, రియల్టీ రంగాలకు చెందిన సూచీలు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో, మెటల్‌, ఫార్మా రంగాలకు చెందిన సూచీలు నష్టపోయాయి.

బ్యాంకింగ్‌ షేర్ల కొనుగోలుకు ఇదే సరైన సమయం

Tuesday 6th November 2018

క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా సంజయ్‌ దత్‌ వ్యాఖ్య ముంబై: తాజా కరెక్షన్‌ దెబ్బతో స్టాక్‌ మార్కెట్‌లోని అతి ఆశావాదం ముగిసిందని, పతనం వల్ల నురుగు చల్లారిపోయినట్లేనని క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా సంజయ్‌ దత్‌ వ్యాఖ్యానించారు. రానున్న ఏడాదికాలంలో మార్కెట్‌ బెటర్‌గానే ఉంటుందన్నారు. అయితే, జాగ్రత్తగా మాత్రమే పెట్టుబడులను కొనసాగించడం మంచిదని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫలితాలు ఆశించిన స్థాయిలో లేనందున షాపింగ్‌ లిస్ట్‌ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు. వచ్చేది

Most from this category