News


మార్కెట్లో సముద్ర మథనం: ధీరజ్‌రెల్లి

Friday 26th July 2019
Markets_main1564164120.png-27344

క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల పాత్ర మన దేశంలో గతంలో ఎప్పుడూ ప్రశ్నార్థకం కాలేదు. కంపెనీల భారీ డిఫాల్ట్‌ల నేపథ్యంలో నాలుగు అతిపెద్ద ఆడిటర్లు నియంత్రణ సంస్థల పరిశీలనలోకి వచ్చారు. దీంతో ‘‘మీరు ఎవరిని విశ్వసిస్తారు’’ అని ప్రశ్నించారు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో ధీరజ్‌రెల్లి. మార్కెట్లలో ఓ తరహా సముద్ర మథనం జరుగుతోందని, దీంతో మంచి అన్నది చెడు నుంచి వేరు పడుతుందన్నారు. ‘‘మిలియన్‌ డాలర్ల ప్రశ్నల్లా..?. అంతిమంగా ఎవరు అమృతంతో బయటపడతారన్నదే’’అని వ్యాఖ్యానించారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఎక్కువ శాతం స్థానిక అంశాల కారణంగానే నష్టపోతున్నట్టు రెల్లి చెప్పారు. మార్కెట్‌ వ్యాప్తంగా ఆకర్షణీయమైన స్టాక్స్‌ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. 

 

కేవలం కొన్ని స్టాక్స్‌ వెంటే పెట్టుబడుల ప్రవాహం అన్నది ఎప్పుడూ కొనసాగేది కాదన్నారు ధీరజ్‌ రెల్లి. ఒకవేళ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో గత ఏడాదిన్నరలో జరిగిన పతనం మాదిరిగా నిఫ్టీ-50 కూడా దిద్దుబాటుకు గురైతే సూచీ 9,000 స్థాయిలో ఉంటుందన్నారు. మొత్తం మీద సెంటిమెంట్‌ చాలా ప్రతికూలంగా ఉందన్నారు. ఒకవేళ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే, నిఫ్టీ స్టాక్స్‌పైనే ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. దేశ ఆర్థిక రంగ వృద్ధి గత కొన్ని త్రైమాసికాల్లో నిదానించిందని, ఈ నిజాన్ని మార్కెట్లు గ్రహించడం ఆలస్యమైనట్టు చెప్పారు. మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.8 శాతంగా ఉందని, నామినల్‌ జీడీపీ 3 శాతం తగ్గిందని, 12 శాతం ఉండాల్సిందల్లా 9 శాతానికి వచ్చిందని వివరించారు. ఇదే మార్కెట్లపై ఎంతో ఒత్తిడికి దారితీసినట్టు చెప్పారు. 

 

పడిపోయిన మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే విషయమై రెల్లి హెచ్చరిక చేశారు. అందుబాటులో ఉన్న వాటిల్లో నాణ్యమైనవి ఏవని గుర్తించగలిగిన వారే అవకాశాలను అందుకోగలరని, పార్ట్‌టైమ్‌ ఇన్వెస్టర్లకు ఇది అంత సులభం కాదన్నారు. నాణ్యతను వేరు చేసి చూసే సామర్థ్యం లేని వారు, నిఫ్టీ జూనియర్‌ లేదా మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో పాసివ్‌ ఇన్వెస్ట్‌ చేసుకోవడం, అది కూడా క్రమానుగతంగా మంచి ఆప్షన్‌ అవుతుందని రెల్లి సూచించారు. ‘‘ఎన్నో రంగాల్లో కొన్ని స్టాక్స్‌ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. నిపుణుల సూచనలు పొందలేని ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్‌ మార్గంలో, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీల్లో పాసివ్‌ ఇన్వెస్టింగ్‌ చేసుకోవాలి’’ అని సూచించారు. 



You may be interested

మారుతీ సుజుకీ లాభం 32 శాతం డౌన్‌

Saturday 27th July 2019

18 శాతం తగ్గిన అమ్మకాలు ప్రతికూల పరిస్థితుల్లోనూ 10 శాతానికి మించి మార్జిన్‌  ఈ ఏడాది చివరి కల్లా బీఎస్‌-సిక్స్‌ అన్ని మోడళ్లు  న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద వాహన కంపెనీ మారుతీ సుజుకీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 32 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.2,015 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,377 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. అమ్మకాలు

ఐటీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కే ఫండ్స్‌ మొగ్గు

Friday 26th July 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు జూన్‌ త్రైమాసికంలో లార్జ్‌క్యాప్‌లో ఐటీ స్టాక్స్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారు. అదే సమయంలో లార్జ్‌క్యాప్‌లోనే ఇంధన కంపెనీలకు మాత్రం దూరంగా ఉన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ చేసిన కొనుగోళ్లను పరిశీలిస్తే...    టీసీఎస్‌ షేరు మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఎక్కువ నచ్చిన షేరుగా నిలిచింది. రూ.866 కోట్ల విలువైన షేర్లను ఫండ్స్‌ జూన్‌లో కొన్నట్టు మార్నింగ్‌ స్టార్‌ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. టీసీఎస్‌ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు,

Most from this category