News


శామ్‌సంగ్‌ నుంచి అత్యాధునిక ఏసీలు

Friday 10th January 2020
Markets_main1578595592.png-30809

దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సింగ్‌ ఎలక్ట్రానిక్స్‌ గురువారం భారత మార్కెట్లో 40 సిర్‌ కండీషనింగ్‌ ఏసీ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో వైండ్‌ఫ్రీ ఏసీ 2.0 కూడా ఉంది. గదిలో గంటకు పైగా వ్యక్తులు ఎవరూ లేకపోతే సెన్సార్‌ గుర్తించి విద్యుత్‌ పొదుపు మోడ్‌లోకి ఏసీని మార్చేస్తుంది. ఈ ఏసీల్లోని ప్రత్యేకతల్లో ఇదీ ఒకటి. అలాగే, ప్రీమియం ట్రిపుల్‌ ఇన్వర్టర్‌ సిరీస్‌ ఏసీలు, ఎకో ఇన్వర్టర్‌, ఆన్‌/ఆఫ్‌ ఏసీలు, విండో ఏసీల మోడళ్లు విడుదల చేసిన వాటిల్లో ఉన్నాయి. నూతన స్పి‍్లట్‌ ఏసీలు ఈ నెల నుంచే దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లలోనూ అందుబాటులోకి వస్తాయని, వీటి ధరలు రూ.35,990-73,990 మధ్య ఉంటాయని శామ్‌సంగ్‌ తెలిపింది. ‘‘నూతన శ్రేణి ఏసీల ద్వారా కస్టమర్ల అంచనాలను చేరుకున్నామని శామ్‌సంగ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ భూటాని తెలిపారు. 

 

వైండ్‌ ఫ్రీ ఏసీ 2.0 మోడళ్లు మూడు రకాలుగా ఉన్నాయి. వీటి ధరలు రూ.57,990, రూ.67,990, రూ.73,990. ఈ ఏసీని కొనుగోలు చేసిన వారికి నాలుగు గంటల్లోనే వారు కోరుకున్న చోట ఏసీని ఇన్‌స్టాల్‌ చేస్తామని శామ్‌సంగ్‌ హామీ ఇస్తోంది. వైండ్‌ ఫ్రీ 2.0 ఏసీకి 23,000 సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వీటి నుంచి చల్లటి గాలి గది అంతటికీ సమానంగా వ్యాప్తి చేయడం జరుగుతుంది. దీంతో గదిలో ఉన్న వారికి సౌకర్యంగా అనిపిస్తుంది. స్మార్ట్‌హోమ్‌ యాప్‌ ద్వారా ఏసీని వైఫ్‌ రూపంలో నియంత్రించుకోవచ్చు. కంప్రెషర్‌పై 10 ఏళ్ల వారంటీని కంపెనీ అందిస్తోంది. విద్యుత్‌ను ఆదా చేసే డిజిటల్‌ ఇన్వర్టర్‌ టెక్నాలజీని వీటిల్లో వినియోగించింది. ఫాస్ట్‌ కూలింగ్‌ మోడ్‌తో పోలిస్తే ఈ ఏసీల్లో 77 శాతం ఇంధనం ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. కస్టమర్లకు వైండ్‌ ఫ్రీ ఏసీల కొనుగోలుపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌, ప్రీమియం ట్రిపుల్‌ ఇన్వర్టర్‌ ఏసీలపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. You may be interested

ఆటోమొబైల్‌లో నియామకాల రికవరీ

Friday 10th January 2020

- నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ - డిసెంబర్‌లో 8 శాతం వృద్ధి - టైమ్స్‌జాబ్స్‌ రిక్రూట్‌ఎక్స్‌ నివేదిక న్యూఢిల్లీ: డిమాండ్ మందగమనంతో గతేడాది కుదేలైన ఆటోమొబైల్ రంగం మళ్లీ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తయారీ, విక్రయం, క్వాలిటీ కంట్రోల్‌ వంటి వివిధ విభాగాల్లో నియామకాలు పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని  టైమ్స్‌జాబ్స్‌ రిక్రూట్‌ఎక్స్‌ ఒక నివేదికలో వెల్లడించింది. ఆటోమొబైల్ రంగంలో గతేడాది నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో నిపుణులకు డిమాండ్‌ 8 శాతం పెరిగిందని వివరించింది. "నియామకాల

రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెద్ద ఉపశమనం

Friday 10th January 2020

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీకి పెద్ద ఉపశమనం లభించింది. ఢిల్లీ-ఆగ్రా టోల్‌ రోడ్డు ప్రాజెక్టును సింగపూర్‌కు చెందిన క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు విక్రయించేందుకు ఈ కంపెనీ గతంలోనే అవగాహనకు రాగా.. ఎట్టకేలకు దీనికి నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించింది. ‘సామరస్య పూర్వక ప్రత్యామ్నాయం’ కింద ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ,

Most from this category