News


ఆచితూచి వ్యవహరిస్తున్న ఎఫ్‌పీఐలు!

Wednesday 16th October 2019
Markets_main1571221249.png-28928

టాక్స్‌ తగ్గింపు ప్రభావం చూపుతుంది
మార్కెట్‌ నిపుణుడు సమీర్‌ నారాయణ్‌
పతనం పూర్తయిందని భావించిన కౌంటర్లను జాగ్రత్తగా ఎంచుకొని విదేశీ ఫండ్స్‌ పెట్టుబడులు పెడుతున్నాయని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు సమీర్‌ నారాయణ్‌ అభిప్రాయపడ్డారు. స్వల్పకాలానికి ఎర్నింగ్స్‌ వృద్ధి కన్నా పన్నుల తగ్గింపే ఎక్కువ ప్రభావం చూపుతుందని భావించే షేర్లను ఎంచుకుంటున్నాయన్నారు. ఎంపిక చేసిన కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను తగ్గింపు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని ఎఫ్‌ఐఐలు భావిస్తున్నాయన్నారు. త్రైమాసిక ఫలితాల ఆధారంగా విదేశీ మదుపరులు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రస్తుతానికి వీళ్లు బాగా ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇదే ధోరణి కొన్నాళ్లు కొనసాగుతుందని అంచనా వేశారు. 
ప్రమోటర్ల వాటాల అమ్మకం
జీగ్రూప్‌ సహా ఇటీవల కాలంలో పలు కంపెనీల్లో ప్రమోటర్లు వాటాల విక్రయించుకోవడం కనిపిస్తోంది. కాస్తోకూస్తో రేటున్నప్పుడే వాటాలు అమ్ముకొని రుణవిముక్తి చెందాలని ప్రమోటర్లు భావిస్తున్నారని సమీర్‌ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మరింత దిగజారితే అప్పుడు విక్రయ నిర్ణయాధికారం కూడా తమకుండదని భావించే ప్రమోటర్లు వాటాలను అమ్ముకుంటున్నారన్నారు. భవిష్యత్‌లో తమ వాటాలకు మంచి రేటు వస్తుందన్న అంచనాలున్నా, ప్రస్తుతం రుణాలు తీర్చుకోవడానికే వీళ్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని విశ్లేషించారు. ఒకవేళ మరిన్ని చెడువార్తలు పెల్లుబికితే అప్పుడు తనఖాదారులు తమకు చెప్పకుండా అమ్మేసుకుంటారని వీళ్లు భయపడుతున్నారన్నారు. ఇదేమీ చెడు నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. 
డిజిన్వెస్ట్‌మెంట్‌, యస్‌బ్యాంక్‌పై అభిప్రాయాలు
వాటాల ఉపసంహరణ వార్తలతో ఇటీవల పలు పీఎస్‌యూలు ర్యాలీ జరిపాయి. దీంతో వాల్యూషన్లపరంగా వీటిలో చాలా షేర్లు ఖరీదైన వాల్యూషన్ల వద్ద ఉన్నాయని సమీర్‌ చెప్పారు. ప్రభుత్వం వీటిలో వాటాలు పూర్తిగా అమ్ముకొని యాజమాన్య హోదా నుంచి తప్పుకోవాలని యోచిస్తోందని, దీనివల్ల భవిష్యత్‌లో పలు స్థూల ఆర్థిక పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. వాటాల ఉపసంహరణకు చాలా తక్కువ సమయం ఉన్నందున ప్రభుత్వం ప్రాక్టికల్‌గా ఫలితాలు చూపాలని సూచించారు. 
యస్‌బ్యాంక్‌ విషయంలో అందరూ రెండో రౌండ్‌ నిధుల సమీకరణపై దృష్టి పెట్టారని సమీర్‌ తెలిపారు. కష్టాల్లో ఉన్న కంపెనీని ఆదుకునేందుకు ఎవరు ముందుకు వస్తారు, వాళ్ల సత్తా ఎంత?అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తారన్నారు. రెండో రౌండ్‌ ఫండింగ్‌ తర్వాత షేరు ధరలో పతనం ఆగవచ్చని అంచనా వేశారు. You may be interested

11450 పైన ముగిసిన నిఫ్టీ

Wednesday 16th October 2019

నాలుగో రోజూ లాభాల ముగింపే ఆర్థిక, ఇంధన, ఐటీ షేర్ల ర్యాలీతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో బుధవారం మార్కెట్‌ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో 38,599 వద్ద ముగిసింది, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 11450 పైన 11,471 వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది వరుసగా నాలుగో రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్‌, మెటల్‌, అటో షేర్లు ఎఫ్‌ఎంజీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో

ఐకానిక్‌ బజాజ్‌ ‘చేతక్‌’ తిరిగొచ్చింది!

Wednesday 16th October 2019

బజాజ్‌ ఐకానిక్‌ స్కూటర్‌ ‘చేతక్‌’, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా తిరిగి మార్కెట్‌లో సందడి చేయనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ-స్కూటర్లను(ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌) చేతక్‌ బ్రాండ్‌తో విక్రయించాలని బజాజ్‌ కంపెనీ భావిస్తోంది. కాగా సుమారుగా పదేళ్ల కిందట బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ తయారిని నిలిపివేసింది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ తిరిగి వస్తున్నప్పటికి ఇది సాంప్రదాయ స్కూటర్‌లా ఉండదని బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ అన్నారు.  చేతక్‌ స్కూటర్‌ను బుధవారం కేంద్ర

Most from this category