News


సెయిల్‌, ఎన్‌ఎండీసీ, టాటా స్టీల్‌ 4% పతనం!

Thursday 19th September 2019
Markets_main1568878287.png-28434

చమురు ధరలు భారీగా పెరగడంతో మొదలైన మార్కెట్‌ నష్టాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఐఐ(విదేశి సంస్థాగత ఇన్వెస్టర్లు)లు బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. మధ్యాహ్నాం 12.46 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.91 శాతం నష్టపోయి 2,356.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సెయిల్‌ 4.34 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 4.03 శాతం,  టాటా స్టీల్‌ 3.94 శాతం నష్టపోయి ఇండెక్స్‌ పతనానికి కారణమవుతున్నాయి. మిగిలిన షేర్లలో జిందాల్‌ స్టీల్‌ 2.91 శాతం, వేదాంత 2.77 శాతం, హిందుస్థాన్‌  కాపర్‌ 2.58 శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ (హిసార్‌) 2.48 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 2.42 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ 2.27 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ 1.49 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 1.26 శాతం, మొయిల్‌ 0.54 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 0.14 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా,  నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 0.56 శాతం, కోల్‌ ఇండియా 0.18 శాతం మాత్రం లాభపడి ట్రేడవుతున్నాయి.You may be interested

లాభాల్లో టాటా మోటర్స్‌, మారుతి సుజుకీ

Thursday 19th September 2019

మార్కెట్‌ భారీపతనంలోనూ టాటామోటర్స్‌, మారుతి సుజుకీ షేర్లు లాభాల బాట పట్టాయి. రేపు (సెప్టెంబర్‌ 20న) జరగనున్న జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో మందగించిన ఆటోరంగాన్ని ఉత్తేజపరిచేందుకు అటో రంగంపై జీఎస్‌టీ శ్లాబ్‌ను తగ్గింవచ్చనే అంచనాలతో ఈ షేర్లకు కొనుగోళ్ల లభిస్తుంది.  టాటా మోటర్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.123.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.50శాతం లాభపడి రూ.124.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు క్రితం ముగింపు ధర(రూ.121.75)తో

26800 దిగువకు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Thursday 19th September 2019

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 26800 స్థాయిని కోల్పోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ నేడు 27,175.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల బాట పట్టాయి. ప్రైవేట్‌ రంగ షేర్ల క్షీణత ఇండెక్స్‌ను భారీ నష్టాలపాలు చేసింది. ఫలితంగా ఇండెక్స్‌ 400 పాయింట్లు నష్టపోయి 26,767.90

Most from this category