News


ఎస్‌బీఐ క్యాప్‌ నుంచి రెండు రికమండేషన్లు

Monday 16th December 2019
Markets_main1576485363.png-30248

లాంగ్‌టర్మ్‌కోసం రెండు షేర్లను ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి మహంతేశ్‌ సబారద్‌ సిఫార్సు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈక్విటీలు మంచి ప్రదర్శన చూపుతాయని, స్వల్పకాలానికి మాత్రం మార్కెట్‌లో జోరు తెచ్చే ట్రిగ్గర్స్‌ ఏమీ లేవని అభిప్రాయపడ్డారు. 
1. అతుల్‌ లిమిటెడ్‌: టార్గెట్‌ రూ. 5000. ఇటీవలే ఈ షేర్ల కవరింగ్‌ మొదలుపెట్టామని మహంతేశ్‌ చెప్పారు. లైఫ్‌సైన్సెస్‌ నుంచి ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ వరకు పలు ఉత్పత్తులు సంస్థ తయారు చేస్తోంది. విక్రయాలు క్రమంగా పెంచుకుంటోంది. బాలెన్స్‌ షీటు పరిశీలిస్తే ఫ్రీక్యాష్‌ఫ్లో బాగున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి రుణభారం లేదు, ఆర్‌ఓసీఈ 20 శాతానికి మించి ఉంది. వాల్యూషన్లు కూడా మామూలుగానే ఉన్నాయి. కంపెనీ వచ్చే రెండేళ్లలో రూ.500 కోట్ల మూలధన వ్యయాలు చేయనుంది. కంపెనీ మార్జిన్లను 11 నుంచి 19 శాతానికి అప్‌గ్రేడ్‌ చేసుకుంది. 
2. శ్రీరామ్‌ సిటీయూనియన్‌ ఫైనాన్స్‌: టార్గెట్‌ రూ. 1680. ఎస్‌ఎంఈ లెండింగ్‌, ఆటోమొబైల్‌ రుణాల విషయంలో మంచి పనితీరు చూపుతోంది. దక్షిణాదిన బాగా విస్తరించింది. ఆర్‌ఓఏలు బలంగా ఉన్నాయి. శ్రీరామ్‌ గ్రూప్‌లో కంపెనీ క్రాస్‌ సెల్లింగ్‌, అప్‌సెల్లింగ్‌ చేస్తుంటుంది. ప్రస్తుత ధరల నుంచి షేరు దాదాపు 20 శాతం వరకు రాబడినిస్తుందని అంచనా.



You may be interested

పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం

Monday 16th December 2019

టోకు ధరల సూచీ(డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణ సూచీ  నవంబర్‌లో 0.58శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో ఇది 0.16శాతంగా నమోదైంది. గతేడాది ఇదే నవంబర్‌లో ఇది 4.47శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉల్లిపాయలతో పాటు ఇతర కూరగాయల ధరలు పెరగడంతో నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం పెరిగినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ  విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. ప్రైమరీ ఆర్టికల్‌ విభాగంలో ధరల పెరుగుదల అక్టోబర్‌లో 6.4శాతంగా నమోదుకాగా, ఈ నెలలో 7.7శాతానికి ఎగిసింది ఫుడ్‌ ఆర్టికల్స్‌

ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌: పసిడికి తగ్గిన డిమాండ్‌

Monday 16th December 2019

అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు తగ్గముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌కు తగ్గుతోంది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌  పసిడి ధర 4డాలర్లు నష్టపోయి 1477 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్థికంగా అగ్రరాజ్యాలైన  అమెరికా చైనాల మధ్య 17నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తాత్కలికంగా తెరదించుతూ ఇరుదేశాలు గతవారంలో మధ్యంతర ఒప్పందాన్ని కుదరుర్చుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రిస్క్‌ అసెట్స్‌గా పిలువబడే ఈక్విటీల్లో

Most from this category