అమెరికా మార్కెట్ల రికార్డుల హోరు
By Sakshi

అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ రికార్డు ర్యాలీ చేశాయి. అక్టోబర్‌లో ఉపాధి కల్పన అంచనాలకు జరగడం, చైనా తయారీ రంగ గణాంకాలు మూడేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ చర్చల్లో భాగంగా మొదటి దశ ఒప్పందంపై సానుకూల వార్తలు వెలువడటం తదితర అంశాలు ఇందుకు కారణమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో ఎస్అండ్పీ 500, నాస్డాక్ ఇండెక్స్‌లు కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. మార్కెట్ ముగిసే అక్కడి ప్రధాన ఇండెక్స్‌లైన డౌన్జోన్ 300 పాయింట్లు(1.11శాతం) పెరిగి 27,347 వద్ద, ఎస్అండ్పీ 29 పాయింట్లు(1శాతం) లాభపడి 3,066.92 వద్ద, నాస్డాక్ ఇండెక్స్ 94.04 పాయింట్లు ర్యాలీ చేసి 8,386.40 వద్ద స్థిరపడ్డాయి. అక్టోబర్‌లో ఎగుమతుల ఆర్డర్లు పెరగడంతో చైనా తయారీరంగ గణాంకాలు మూడేళ్ల గరిష్టస్థాయిలో నమోదయ్యాయి. మెరుగైన ఈ గణాంకాలు... అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా డిమాండ్ మందగమన ఆందోళనలను తగ్గించాయి. అలాగే అమెరికాలో జనరల్ మోటర్స్ కంపెనీలో జరుగుతున్న సమ్మె కారణంగా ఈ అక్టోబర్‌లో ఉపాధి కల్పన గణాంకాలు తగ్గముఖం పట్టవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావించారు. అయితే అనూహ్యంగా గత రెండు నెలల్లో జరిగిన ఉద్యోగాల సృష్టి కంటే ఎక్కువగానే జరిగాయి. ఫలితంగా అమెరికా ఉత్పాదక రంగం బలంగానే ఉందనే సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు చైనాతో జరుగుతున్న "ఫేజ్ వన్" వాణిజ్య ఒప్పందం విజయవంతమయ్యే దిశగా సాగుతున్నాయని యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్బర్ రాస్ తెలిపారు. ఎస్అండ్ఇండెక్స్లో నమోదైన మొత్తం 356 కంపెనీల్లో 76శాతం కంపెనీలు క్యూ3లో అంచనాలకు మించిన మెరుగైన ఫలితాలను ప్రకటించాయి.
You may be interested
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 30 పాయింట్లు అప్
Saturday 2nd November 2019విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం లాభంతో ముగిసింది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్ శుక్రవారం ముగింపు స్థాయి11928.25 తో పోలిస్తే 29పాయింట్ల లాభంతో 11,958 వద్ద స్థిరపడింది. పలు కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండటం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థలో మందమన నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం ఈక్విటీలపై పన్ను తగ్గింపు యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడటం, అంచనాలకు తగ్గట్టుగానే
డాక్టర్ రెడ్డీస్ లాభం రెట్టింపు..
Saturday 2nd November 2019క్యూ2లో రూ. 1,093 కోట్లు పన్ను ప్రయోజనాలు, వన్ టైమ్ ఆదాయాల ఊతం ఆదాయంలో 26 శాతం వృద్ధి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,093 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 504 కోట్లతో పోలిస్తే 117 శాతం అధికం. క్యూ2లో ఆదాయం రూ. 3,798