News


ఎస్‌అండ్‌పీ రికార్డ్‌- ఏడీఆర్‌లు వీక్‌

Saturday 15th February 2020
Markets_main1581739431.png-31817

అటూఇటుగా ముగిసిన ఇండెక్సులు
ఎస్‌అండ్‌పీ క్లోజింగ్‌ రికార్డ్‌
ఇండియన్‌ ఏడీఆర్‌ల నేలచూపు
వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డౌన్‌

ఓవైపు కరోనా వైరస్‌ ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ గత వారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. సోమవారం(10న) మార్కెట్లకు సెలవుకాగా.. గత నాలుగు రోజుల ట్రేడింగ్‌లో ఎస్‌అండ్‌పీ మూడుసార్లు సరికొత్త రికార్డులను అందుకుంది. కార్పొరేట్‌ ఫలితాలు, ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుండటం, ఈ వ్యాధి కారణంగా మృతుల సంఖ్య పెరుగుతుండటం‍ వంటి అంశాలతో వారాంతాన మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్‌ 25 పాయింట్లు(0.1 శాతం) క్షీణించి 29,398 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 6 పాయింట్లు(0.2 శాతం) తక్కువగా 3,380 వద్ద స్థిరపడింది. ఇది రికార్డ్‌ క్లోజింగ్‌కాగా.. నాస్‌డాక్‌ 19 పాయింట్లు(0.2 శాతం) బలపడి 9,731 వద్ద ముగిసింది. గత వారం మార్కెట్లు నికరంగా 1.6 శాతం బలపడ్డాయి. ఫలితాలు ఆకట్టుకోవడంతో చిప్‌ తయారీ దిగ్గజం ​ఎన్‌విడియా 2017 తదుపరి గత వారం భారీగా లాభపడింది. కాగా.. వరుసగా నాలుగో నెల.. జనవరిలోనూ రిటైల్‌ సేల్స్‌ పుంజుకున్నాయి. కరోనా నేపథ్యంలో అవసరమైతే తగిన చర్యలు చేపట్టనున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ పేర్కొన్నారు.

వేదాంతా వీక్‌
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌) వారాంతాన అటూఇటుగా ముగిశాయి. వేదాంతా(వీఈడీఎల్‌) 2 శాతం పతనమై 7.96 డాలర్లను తాకగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 1.66 శాతం తిరోగమించి 58.74 డాలర్ల వద్ద  స్థిరపడింది. ఇక టాటా మోటార్స్‌(టీటీఎం) 1 శాతం క్షీణించి 11.71 డాలర్ల వద్ద నిలవగా.. డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) 0.9 శాతం బలహీనపడి 45.45 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఇన్ఫోసిస్‌ 0.3 శాతం పుంజుకుని 10.95 డాలర్ల వద్ద నిలవగా.. విప్రో లిమిటెడ్‌ 0.26 శాతం బలపడి 3.8 డాలర్ల వద్ద ముగిసింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) యథాతథంగా 15.09 డాలర్ల వద్ద ముగిసింది. 



You may be interested

భారీగా పెరిగిన పసిడి

Saturday 15th February 2020

జర్మనీ,జపాన్‌ కరెన్సీలు యూరో,యన్‌లు పడిపోవడంతో శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో రూ.324 పెరిగి 10 గ్రాముల బంగారం ధర 40,980.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ల్లో  8 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,587 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

సెయిల్‌ నష్టాలు రూ.344 కోట్లు

Saturday 15th February 2020

తగ్గిన ఉక్కు ధరల ప్రభావం  పెరిగిన అమ్మకాలు  క్యూ4 ఫలితాలపై కంపెనీ ఆశాభావం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ, సెయిల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.344 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. వ్యయాలు పెరగడం, ఉక్కు ఉత్పత్తుల ధరలు తగ్గడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని సెయిల్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ చౌధురి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం (2019-18) ఇదే క్వార్టర్‌లో రూ.638 కోట్ల నికర లాభం

Most from this category