News


యుఎస్‌ సూచీ లక్ష్యాన్ని పెంచిన గోల్డ్‌మాన్‌శాక్స్‌

Tuesday 30th July 2019
Markets_main1564478562.png-27413

యుఎస్‌ బెంచ్‌మార్క్‌ ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ 2019 టార్గెట్‌ను 3 శాతం పెంచి 3,100 పాయింట్లుగా నిర్ణయించినట్టు ప్రముఖ గోల్డ్‌మాన్ శాక్స్‌ మంగళవారం తెలిపింది. ఇది ఈ ఏడాది 24 శాతం లాభాలను సూచిస్తుంది. కానీ ఆర్థిక కార్యకలాపాలు, మార్జిన్ దృక్పథంలో బలహీనత వలన ఆదాయ అంచనాలను తగ్గించింది. ఈ వారం ఫెడరల్ రిజర్వ్ నుంచి ఊహించినట్టే రేటు తగ్గింపు ఉంటుందనే వార్తల నేపథ్యంలో వాల్ స్ట్రీట్ ఇంట్రాడే గరిష్ఠమైన 3,027 స్థాయిని సులభంగా అధిగమిస్తుందని అంచనాలున్నాయి. 2020 సంవత్సరానికి గాను, ఎస్ & పి 500 టార్గెట్‌ను 3,400 పాయింట్లగా గోల్డ్‌మాన్‌ శాక్స్‌ నిర్ణయించింది. ఇది 2019 లక్ష్యం నుంచి 10 శాతం అధికం కావడం గమనర్హం.



You may be interested

అకస్మాత్తుగా అమ్మకాలు: నిఫ్టీ 110 పాయింట్లు క్రాష్‌

Tuesday 30th July 2019

మిడ్‌సెషన్‌ అనంతరం మార్కెట్లో నెలకొన్న అనూహ్య అమ్మకాలతో సూచీలు భారీ నష్టాన్ని చవిచూసాయి. నిఫ్టీ ఇండెక్స్‌ తనకు కీలకమైన 200డీఎంఏ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమై ఆ స్థాయికి కిందకు పతనమవడంతో అమ్మకాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌, కోటక్‌ బ్యాంకు షేర్లు భారీ నష్టాల్ని చవిచూసాయి.  ఫలితంగా మార్చి 11 తరువాత నిఫ్టీ ఇండెక్స్‌ తొలిసారి 11100 స్థాయిని కోల్పోయింది.

ఈ మూడు రంగాల్ని చూడొచ్చు: యుటీఐ ఎంఎఫ్

Tuesday 30th July 2019

ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ఇంకో రెండు, మూడు త్రైమాసికాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.కానీ నెమ్మదిగానైనా మందగమనం తగ్గుముఖం పడుతుందని యుటిఐ ఎంఎఫ్ ఈక్విటీ ఫండ్ మేనేజర్ అండ్‌ రీసెర్చ్ హెడ్ సచిన్ త్రివేది ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. రేట్ల కోత మంచిదే.. ఎస్‌బీఐ డిపాజిట్లపై రేట్ల కోత విధించింది. ఇది స్వాగతించాల్సిన విషయం. ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఆర్బిఐ

Most from this category