News


రూపాయి నేలచూపు

Friday 3rd January 2020
Markets_main1578024025.png-30639

మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు దేశీ కరెన్సీపైనా ప్రభావం చూపాయి. ఇరాక్‌లోని బాగ్దాద్‌పై అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సైతం నేలచూపులతో మొదలైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తొలుత 20 పైసలు క్షీణించి 71.57 వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.20 ప్రాంతం‍లో 17 పైసలు(0.25 శాతం) బలహీనపడి 71.54 వద్ద ట్రేడవుతోంది. గురువారం రాత్రి బాగ్దాద్‌ విమానాశ్రయానికి చేరువలో అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన ముఖ్య అధికారితోపాటు.. ఇరాక్‌కు చెందిన అధికారులు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తలెత్తడంతో ముడిచమురు ధరలకు రెక్కలొచ్చాయి. ప్రపంచ ముడిచమురు సరఫరాలలో ఇరాన్‌, ఇరాక్‌లకు ప్రాధాన్యమున్న సంగతి తెలిసిందే. కాగా.. దేశీయంగా చమురు అవసరాలకు 75 శాతం వరకూ విదేశాలనుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. దీంతో చమురు ధరలు పెరిగితే డాలర్లలో చేపట్టే చెల్లింపులు మరింత పెరిగే వీలుంది. ఫలితంగా రూపాయి బలహీనపడినట్లు ఫారెక్స్‌ వర్గాలు తెలియజేశాయి.  



You may be interested

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు...సెన్సెక్స్‌ 120 పాయింట్లు డౌన్‌

Friday 3rd January 2020

 ఇరాక్‌ విమానాశ్రయంపై అమెరికా మిలటరీ దాడులు నిర్వహించి, ఇరాన్‌, ఇరాక్‌ సైనికాధికారులను కాల్చివేయడంతో హఠాత్తుగా ఆసియా స్టాక్‌ సూచీలు పడిపోయిన నేపథ్యంలో దేశీయ స్టాక్‌ సూచీలు శుక్రవారం క్షీణతతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 120 పాయింట్ల క్షీణతతో 41,500 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల తగ్గుదలతో 12,245 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. 

అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించొచ్చు

Friday 3rd January 2020

మనీ యాప్‌ను విడుదల చేసిన ఆర్‌బీఐ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- ఇక నుంచి అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించవచ్చు. ఇందుకు అవసరమైన మొబైల్‌ ఎడెడ్‌ నోట్‌ ఐడెంటిఫయర్‌ (ఎంఏఎన్‌ఐ–మనీ) యాప్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ‘‘కలర్‌ బ్లైండ్‌నెస్, పాక్షిక దృష్టిలోపం ఉన్న వాళ్లు కూడా గుర్తించేందుకు వీలుగా

Most from this category